IND VS SA: కోహ్లీ బర్త్‌డే మ్యాచ్‌.. టీమిండియా తుది జట్టులో భారీ మార్పులు?

ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో నవంబర్‌ 5న జరగనున్న మ్యాచ్‌కు ఇద్దరు కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చే ఆలోచనలో ఉంది టీమిండియా. పేసర్ బుమ్రా స్థానంలో అశ్విన్‌ను, రాహుల్ ప్లేస్‌లో ఇషాన్‌కిషాన్‌ను ఆడించే అవకాశం కనిపిస్తోంది.

New Update
IND VS SA: కోహ్లీ బర్త్‌డే మ్యాచ్‌.. టీమిండియా తుది జట్టులో భారీ మార్పులు?

INDIA VS SOUTHAFRICA: ఇప్పటికే సెమీస్ బెర్త్‌ ఫిక్స్‌ చేసుకున్న టీమిండియా రేపు(నవంబర్‌ 5) దక్షిణాఫ్రికాతో తలపడనుంది. రేపు రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ బర్త్‌డే. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో అందరి చూపు కోహ్లీపైనే పడింది. ఈడెన్‌ స్టేడియంలో వచ్చే అందరికి కోహ్లీ మాస్క్‌లు ఇస్తారని సమాచారం. 70 వేల మాస్కులను బెంగాల్‌ క్రికెట్ అసోసియేషన్‌ ఆర్డర్‌ చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు దక్షిణాఫ్రికా కూడా ఇప్పటికే సెమీస్‌ స్పాట్‌ను ఫిక్స్ చేసుకుంది. ఇప్పటివరకు ఇండియా ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు. ఏడు మ్యాచ్‌లు ఆడితే అన్నిటిలోనూ గెలిచి 14 పాయింట్లతో టేబుల్‌లో నంబర్‌-1 ప్లేస్‌లో ఉంది. అటు దక్షిణాఫ్రికా ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో నంబర్‌-2 పొజిషన్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిస్తే అగ్రస్థానానికి రావొచ్చు. ఎందుకంటే ఇండియా కంటే సౌతాఫ్రికాకే బెటర్‌ నెట్‌రన్‌రేట్ ఉంది.

బుమ్రాకు రెస్ట్:
ఈ మ్యాచ్‌లో ఇండియా పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సెమీస్‌ స్పాట్‌ ఫిక్స్ అవ్వడంతో ఈ మ్యాచ్‌లో పలువురు కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చే ఆలోచనలో రోహిత్ శర్మ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ బౌలింగ్‌ దళాన్ని ముందుండి నడిపిస్తోన్న పేసర్ బుమ్రాకు ఈ మ్యాచ్‌లో రెస్ట్ ఇచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అటు వికెట్ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌కు కూడా కాస్త విశ్రాంతి ఇవ్వాలని జట్టు మ్యానేజ్‌మెంట్ థింక్‌ చేస్తున్నట్లుగా సమాచారం. ఇదే జరిగితే బుమ్రా స్థానంలో అశ్విన్‌ తుది జట్టులోకి రావొచ్చు. అటు రాహుల్ స్థానంలో ఇషాన్‌కిషన్‌ను వస్తాడు.


టీమిండియా ప్లేయంగ్‌-11(అంచనా): రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (WK), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

దక్షిణాఫ్రికా ప్లేయింగ్-11(అంచనా): టెంబా బావుమా (సి), క్వింటన్ డి కాక్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి

Also Read: సింగిల్‌ హ్యాండ్‌తో భారీ సిక్సర్‌.. ఇన్నాళ్లు ఈ వజ్రాన్ని ఎందుకు పక్కన పెట్టారు భయ్యా!

Advertisment
Advertisment
తాజా కథనాలు