Cricket Ashoka: టీమిండియా విజయాల్లో అశోక చక్రవర్తి.. ఎలానో తెలుసుకోండి!

అశోకచక్రం.. దేశ జాతీయ జెండా మధ్యలో ఈ స్పోక్ వీల్‌ ఉంటుంది. ఇది బ్లూ కలర్‌లో ఉంటుంది. ఈ కలర్‌ స్ఫూర్తితోనే టీమిండియా జట్టు జెర్సీ రంగును 'బ్లూ'గా నిర్ణయించారు. ఆటగాళ్లలో ఐక్యత భావాన్ని కలిగించడమే లక్ష్యంగా ఇలా పెట్టారు.

New Update
Cricket Ashoka: టీమిండియా విజయాల్లో అశోక చక్రవర్తి.. ఎలానో తెలుసుకోండి!

ICC WORLD CUP 2023: 'బ్లీడ్‌ బ్లూ' ఇది టీమిండియా అభిమానుల నినాదం. క్రికెటైనా, హాకీ అయినా భారత్‌ ఏ ఇతర క్రీడల్లో పాల్గొన్న మన ఆటగాళ్లు వేసుకునే జెర్సీ కలర్‌ ఎక్కువగా 'బ్లూ'నే ఉంటుంది. సాధారణంగానే ఆటలపట్ల భారతీయులకు మక్కువ ఎక్కువ. అందుకే ఇక్కడ క్రికెట్ ఇక్కడ ఓ మతం. ప్రతీ మతానికి ఏదో ఒక కలర్‌ పవిత్రంగా ఉంటుంది. అలానే ఇండియా క్రీడాప్రేమికులకు పవిత్ర కలర్‌ ఈ 'బ్లూ'. కొన్ని సర్వేల ప్రకారం భారతీయుల్లో చాలా మందికి ఆ కలరే ఫెవరేట్ కూడా. అంతేందుకు.. చాలా మంది పిల్లలు చెబుతుంటారు, 'నా ఫేవరెట్ కలర్ బ్లూ' అని రీజన్ అడిగితే నా ఫేవరెట్ ప్లేయర్ అదే జెర్సీలో ఆడుతాడని ముద్దుముద్దుగా చెబుతారు. దేశాన్ని ఐక్యం చేసే పవర్‌ ఉన్న ఈ కలర్‌ను టీమిండియా జెర్సీ రంగుగా ఎందుకు పెట్టారో తెలుసా?

కారణం తెలుసుకోండి:
మన జాతీయ జెండాలో నాలుగు కలర్స్‌ ఉంటాయి. పైన ఆరెంజ్‌, మధ్యలో వైట్‌, బటమ్‌లో గ్రీన్ ఉంటాయి. ఇక వైట్‌ కలర్‌కి మధ్యలో నీలం కలర్‌ చక్రం ఉంటుంది. అదే అశోకుడి చక్రం. భారత జాతీయ పతాకంపై కనిపించే 24-స్పోక్ వీల్ అయిన అశోక చక్రానికి ఉన్న కలర్‌ కారణంగానే క్రీడాల్లో భారత్‌ జట్టు జెర్సీకి ఈ కలర్‌ ఇచ్చినట్లు చెబుతుంటారు. ఈ నిర్ణయం అభిమానులు, ఆటగాళ్లలో ఐక్యత భావాన్ని కలిగించడం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో సక్సెస్ అయ్యింది కూడా. ఎంతలా అంటే 'బ్లీడ్‌ బ్లూ' అనేఅంతలా.

స్ఫూర్తికి చిహ్నం:
జట్టు సాధించిన విజయాలు, నీలి రంగు జెర్సీలు చూస్తు చాలా మంది పెరిగారు.ఇది తెలియకుండానే భారతీయుల్లో స్ఫూర్తిని నింపింది. నీలిరంగు జెర్సీ జట్టు స్ఫూర్తికి పర్యాయపదంగా మారింది. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికుల మనసుల్లో ఇండియా అంటే బ్లూ జెర్సీ అనే విధంగా మారిపోయింది. ఇలా చాలామందికి తెలియకుండానే అశోక చక్రానికి చెందిన రంగు భారతీయులను ఐక్యం చేసింది. ఈ అశోకచక్రం, అశోకుడి కాలంలో నిర్మించారు. 'చక్ర' అనేది సంస్కృత పదం. దీనికి ఇంకో అర్థం ఉంది. స్వయంగా తిరుగుతూ, కాలచక్రంలా తన చలనాన్ని పూర్తిచేసి మళ్ళీ తన గమనాన్ని ప్రారంభించేదని అర్థం.

Also Read: నా పాదాలు కాదు.. నా హృదయాన్ని టచ్ చేశావ్.. కోహ్లీ సెంచరీపై సచిన్ ఎమోషనల్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు