Kohli Vs Pujara: చూడు తమ్ముడు.. జట్టు ముఖ్యం.. నీ సెంచరీ కాదు.. ఇది తెలుసుకో..! ఆటను త్వరగా ముగించడం చాలా అవసరం అంటూ విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పించాడు టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా. సింగిల్స్ తియ్యకుండా, స్ట్రైక్ రొటెట్ చేయకుండా బంగ్లాదేశ్‌పై కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్ లాంటి టోర్నీల్లో నెట్‌రన్‌రేట్ చాలా ముఖ్యమని.. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలంటూ కోహ్లీకి చురకలంటించాడు పుజారా. By Trinath 20 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి విరాట్ కోహ్లీ 48వ సెంచరీ చేసిన ఆనందం అతని అభిమానులకు లేకుండా పోతోంది. కోహ్లీ సెంచరీ విషయంలో క్రికెట్ ప్రపంచం రెండుగా చీలిపోయింది. వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ సెంచరీ విషయంలో అభిమానుల మధ్య ఇప్పటికే వార్ నడుస్తోంది. కోహ్లీ ఫ్యాన్స్ అందరూ ఒకవైపు ఉండగా.. మిగిలిన ప్లేయర్ల ఫ్యాన్స్ మరోవైపు ఉన్నారు. ట్విట్టర్‌లో కోహ్లీకి వ్యతిరేకంగా షేమ్‌లెస్ అంటూ ఓ ట్రెండ్ కూడా చేస్తున్నారు. ఈ రచ్చ ఓవైపు కొనసాగుతుండగానే మరోవైపు కోహ్లీకి వ్యతిరేకంగా పలువురు ఆటగాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో టీమిండియా ప్లేయర్లు కూడా ఉండడం ఆసక్తిని రేపుతోంది. Also Read: కోహ్లీ సెంచరీకి అంపైర్ హెల్ప్ చేశాడా? విరాట్ సెల్‌ఫిష్ బ్యాటింగ్ చేశాడా? జట్టు ముఖ్యం: పూణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన 48వ వన్డే సెంచరీ కోసం సింగిల్స్‌ని డినై చేయడంతో పాటు ఓవర్‌లో చివరి బంతిని సింగిల్ తియ్యడంపై టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ ఛెతేశ్వర్ పుజారా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'విరాట్ కోహ్లి వంద పరుగులకు చేరుకుంటాడని నేను నిజంగా ఆశించాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఆటను త్వరగా ముగించడం చాలా అవసరం. టాప్ నెట్ రన్ రేట్ కలిగి ఉండటం కీలకం.' అని చెప్పారు. ESPN క్రిక్‌ఇన్‌ఫోలో పుజారా ఈ వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌కప్ లాంటి టోర్నీలో నెట్‌రన్ రేట్ నిజంగా కీలకమనే చెప్పాలి. అదే పనిగా బాల్స్ వేస్ట్ చేయడం.. సింగిల్స్ రోటెట్ చేయకుండా ఉండడం ఏ మాత్రం కరెక్ట్ కాదన్న వాదనలు పెరుగుతున్నాయి. జట్టుకు ప్రాధాన్యత ఉండాలని.. . వ్యక్తిగత మైలురాళ్లను సాధించడం ముఖ్యమే కానీ అది జట్టుకు నష్టం కలిగించేలా ఉండకూడదని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. అటు ఆస్ట్రేలియా లెజండరీ బ్యాటర్ హేడన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వీలైనంతగా గేమ్‌ను త్వరగా పూర్తి చేయాలని చెప్పాడు. కోహ్లీ ఆటలో అందరూ ఎక్కువగా విమర్శలు చేస్తున్న అంశం ఏంటంటే.. అతని బాల్ బౌండరీ వద్దకు వెళ్లినా సింగిల్స్ తియ్యలేదు. రన్ చేసుకుంటూ వచ్చిన రాహుల్‌ని వెనక్కిపంపాడు. ఇది చాలా సెల్‌ఫిష్ బ్యాటింగ్ అన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. Also Read: అదే సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే ఈ ప్రపంచకప్ మనదే బ్రదరూ! #virat-kohli #icc-world-cup-2023 #pujara మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి