Cricket: జయ్ షాకి క్షమాపణలు చెప్పిన శ్రీలంక.. ఎందుకంటే? By Trinath 17 Nov 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి బీసీసీఐ సెక్రటరీ, అమిత్‌షా కుమారుడు జయ్ షాపై శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. శ్రీలంక క్రికెట్ అధికారులతో జయ్ షాకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు రణతుంగ. వీరి మధ్య ఉన్న సంబంధం కారణంగా బీసీసీఐ శ్రీలంక బోర్డును తొక్కేస్తుందని చెబుతున్నాడు తొక్కించగలరని. శ్రీలంక క్రికెట్ బోర్డును జయ్ షా నియంత్రించగలరనే భావనలో ఉన్నారని అర్జున రణతుంగ కామెంట్స్ చేయడం కాక రేపింటి. అయితే ఈ వ్యాఖ్యలపై శ్రీలంక తాజాగా స్పందించింది. క్షమించండి: రణతుంగ కామెంట్స్‌పై శ్రీలంక క్షమాపణలు చెప్పింది. నిజానికి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్ కూడా జై షానే. రణతుంగా కామెంట్స్‌పై విచారం వ్యక్తం చేసింది. శ్రీలంక క్రికెట్‌లో షా జోక్యం చేసుకున్నారని ఆరోపించిన రణతుంగ వ్యాఖ్యలకు తాము తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. శ్రీలంక క్రికెట్ పతనానికి జయ్ షా కారణమని అర్జున రణతుంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విధించిన నిషేధాన్ని పరిష్కరించడానికి అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే జయ్ షాతో సంప్రదింపులు ప్రారంభించారని పర్యాటక శాఖ మంత్రి హరీన్ ఫెర్నాండో తెలిపారు. అసలేం జరిగిందంటే: అటు శ్రీలంక బోర్డును నడిపిస్తున్నది జయ్ షానేనని అర్జున రణతుంగ చేసిన వ్యాఖ్యలు అటు క్రికెట్ సర్కిల్స్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ హాట్‌టాపిక్‌గా మారాయి. జయ్ షా ఒత్తిడి కారణంగా శ్రీలంక క్రికెట్ నాశనమవుతోందని.. భారత్‌లో ఉంటూ జయ్ షా శ్రీలంక క్రికెట్‌ను నాశనం చేస్తున్నాడంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. కేంద్ర హోం మంత్రి కొడుకు కావడంతో జయ్ షా ఇంత పవర్‌ఫుల్‌గా మారాడని చెప్పుకొచ్చారు. ఇక 1996లో ప్రపంచకప్ విజేతైన శ్రీలంక జట్టుకు నాయకత్వం వహించింది అర్జున రణతుంగనేనన్న విషయం తెలిసిందే. ఇక 2019లో జింబాబ్వేపై ఐసీసీ నిషేధం విధించింది. ఈ ఆఫ్రికన్ దేశం తర్వాత గత నాలుగేళ్లలో నిషేధించబడిన రెండో పూర్తి సభ్యదేశంగా శ్రీలంక నిలిచింది. శ్రీలంక లాగానే జింబాబ్వే క్రికెట్‌లో కూడా ప్రభుత్వ జోక్యం పెరిగింది. Also Read: మరువలేని జ్ఞాపకాలు.. ‘ధోనీ…’ చెవుల్లో ఇంకా మోగుతున్న రవిశాస్త్రి కామెంటరీ! #jay-shah #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి