World Cup 2023: న్యూజిలాండ్‌కు పట్టిన దరిద్రం అదే.. ఆ గండం దాటితేనే సెమీస్‌కు..! కివీస్ సెమీస్ అవకాశాలకు వరుణుడు గండం పెట్టేలా ఉన్నాడు. బెంగళూరు వేదికగా శ్రీలంకపై జరగనున్న మ్యాచ్‌కు వాన ముప్పు పొంచి ఉంది. వర్షంతో మ్యాచ్ రద్దయితే కివీస్‌కు సెమీస్ అవకాశాలు లేనట్లే! By Trinath 09 Nov 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి WORLD CUP 2023 NZ vs SL: క్రికెట్‌లో కొన్ని టీమ్స్‌కు బ్యాడ్ లక్ ఎక్కువగా ఉంటుంది. దక్షిణాఫ్రికాతో పాటు న్యూజిలాండ్ ఈ లిస్ట్‌లో తొలి రెండు స్థానాల్లో ఉంటాయి. ఇది హిస్టరీ చెబుతున్న నిజం. అయితే ప్రతీసారి బ్యాడ్ లక్ కారణంగానే ఆ జట్లు కప్ సాధించడంలేదన్నది నిజం కాదు. వారి సెల్ఫ్ మిస్టెక్స్ కూడా అందులో ఉంటాయి. 2019 ప్రపంచకప్ ఫైనల్‌లో అంపైర్ తప్పిదం కారణంగా న్యూజిలాండ్ (New Zealand) క్రికెట్ విశ్వవిజేతగా నిలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఈ వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ ఊహించని విధంగా ఆడింది. మొదటి నాలుగు గ్రూప్ మ్యాచ్‌ల్లో గెలిచిన కివీస్ తర్వాత అనూహ్యంగా వరుస పెట్టి నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది. సెమీస్ రేస్‌లో ఒక టైమ్‌లో భారత్‌తో సమానంగా నిలిచిన కివీస్.. ఇప్పుడు సెమీస్ బెర్త్ కోసం తీవ్రంగా కష్టపడే స్టేజీకి వచ్చింది. ఈ క్రమంలోనే మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. బెంగళూరు.. ప్చ్: బెంగళూరు వేదికగా పాకిస్థాన్‌పై ఆడిన మ్యాచ్‌లో కివీస్ ఓడిపోయింది. డక్ వర్త్ లుయిస్ పద్ధతిలో పాకిస్థాన్ గెలిచింది. 400 రన్స్ టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన పాక్‌కు ఓపెన్ ఫకర్ జమాన్ అదిరే ఆరంభాన్ని ఇవ్వడంతో పాటు రికార్డు సెంచరీ బాదాడు. మధ్యలో వర్షం పడడంతో మ్యాచ్ జరిగే ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో డక్ వర్త్ లుయిస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో పాక్‌ను విజేతగా ప్రకటించారు. మ్యాచ్ మొత్తం జరిగి ఉంటే తమ టీమే గెలిచి ఉండేదని కివీస్ అభిమానులు వాపోతున్నారు. జమాన్ అవుటైన తర్వాత పాక్ మిడిలార్డర్ ఏమంత గొప్పగా లేదని గుర్తు చేస్తున్నారు. అయితే ఇవాళ(నవంబర్ 9) కూడా బెంగళూరులోనే మ్యాచ్ జరగనుండడంతో పాటు వర్షం పడే అవకాశం కూడా ఉంది. Kane Williamson to me is the most graceful captain the game has ever seen. pic.twitter.com/PuDMiVcP6V — تلمیذ (@uncletaz92) November 4, 2023 మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత దాదాపు 27 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉండడంతో కివీస్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ నివేదిక ప్రకారం 70 శాతం కంటే ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్ వాష్ అవుట్ అవుతుందానన్న భయం కూడా కివీస్ శిబిరంలో నెలకొంది. అదే జరిగితే కివీస్ సెమీస్ ఛాన్సులు గల్లంతైనట్లే.. ఎందుకంటే కివీస్ తర్వాత స్థానంలో ఉన్న అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌కు న్యూజిలాండ్‌తో సమానమైన పాయింట్ల ఉన్నాయి. ఆ రెండు టీమ్‌లకు మరో మ్యాచ్ మిగిలి ఉంది. Also Read: జీవిత పాఠాలు నేర్పిన మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్.. ఎలానో తెలుసుకోండి! WATCH: #bengaluru #icc-world-cup-2023 #newzealand-vs-srilanka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి