World cup 2023: పాక్‌ క్రికెట్‌ను వెంటాడుతోన్న శని.. కివీస్‌తో మ్యాచ్‌కు ముందు మరో షాక్‌..!

వరల్డ్‌కప్‌లో సెమీస్ చేరుకోవాలనుకుంటే రేపు(నవంబర్ 4) న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌ పాకిస్థాన్‌కు కీలకం. బెంగళూరులో జరగనున్న ఈ మ్యాచ్‌కు వాన ముప్పు పొంచి ఉంది. రెండు గంటల పాటు మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారొచ్చని తెలుస్తోంది.

New Update
World cup 2023: పాక్‌ క్రికెట్‌ను వెంటాడుతోన్న శని.. కివీస్‌తో మ్యాచ్‌కు ముందు మరో షాక్‌..!

పాకిస్థాన్‌ క్రికెట్‌ టీమ్‌ను శని వెంటాడుతున్నట్లు అనిపిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో పాక్‌ టీమ్‌కు ఏదీ కలిసిరావడంలేదు. షెడ్యూల్‌లో గందరగోళం నుంచి మొదలైన బ్యాడ్‌ లక్‌ ఇప్పటికీ కొనసాగుతోంది. దీనికి తోడు ఆ జట్టు ఘోర వైఫల్యాలు సెమీస్‌ అవకాశాలను కష్టం చేశాయి. సెమీస్‌కు కచ్చితంగా చేరుతుందని అంతా భావించిన పాకిస్థాన్‌ ఇప్పుడు తీవ్రంగా కష్టపడుతోంది. సెమీస్‌కు చేరాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌లు గెలవడంతో పాటు ఇతర జట్ల మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి వచ్చింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాకిస్థాన్‌ ఐదో స్థానంలో ఉంది. ఏడు మ్యాచ్‌లు ఆడిన పాక్‌ మూడు విజయాలు సాధించింది. 6 పాయింట్లతో ఉన్న పాక్‌కు నెగిటివ్‌ రన్‌రేట్ ఉంది. ఇదే సమయంలో రేపు(అక్టోబర్ 4)న న్యూజిలాండ్‌తో పోరుకు రెడీ అయ్యింది. కివీస్‌తో మ్యాచ్‌కు గెలవాలని పట్టుదలగా ఉన్న పాకిస్థాన్‌కు బ్యాడ్‌ న్యూస్ అందింది.

వరుణుడు ముంచేస్తాడా?
బెంగళూరులో మ్యాచ్‌ అంటే సీజన్‌తో సంబంధం లేకుండా వరుణుడుపై ఓ లుక్కేయాల్సి ఉంటుంది. రేపు(అక్టోబర్ 4) ఉదయం 10గంటల 30నిమిషాలకు మ్యాచ్‌ మొదలవుతుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడి నుంచి ముప్పు పొంచి ఉంది. 'అక్యూవెదర్(Accuweather)' ప్రకారం.. రేపు పగటిపూట వర్షం పడే అవకాశం 68 శాతం ఉంది. మ్యాచ్‌ సమయంలో వర్షం పడే అవకాశం ఉంది. రెండు గంటల పాటు మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారొచ్చని తెలుస్తోంది. మ్యాచ్‌ జరగడం అయితే పక్కా కానీ ఓవర్లను కుదించవచ్చు.

కివీస్‌కూ కీలకమే:
అటు న్యూజిలాండ్‌ పరిస్థితి కూడా అంత గొప్పగా లేదు. టోర్నీలో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన కివీస్‌ ఆ తర్వాత బొక్క బోర్లా పడిన తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. గత మూడు మ్యాచ్‌ల్లోనూ న్యూజిలాండ్‌ ఓడిపోయింది. ఇక చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఘోరంగా ఆడింది. ఏకంగా 190 పరుగుల తేడాతో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో కివీస్‌ ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించింది. రేపటి మ్యాచ్‌లో గెలుపు ఇరు జట్లకు చాలా కీలకం.

పాకిస్థాన్ ప్లేయంగ్‌-11(అంచనా):
అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజం (c), మహ్మద్ రిజ్వాన్ (wk), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, అఘా సల్మాన్, షాహీన్ అఫ్రిది, ఉసామా మీర్, మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రవూఫ్.

న్యూజిలాండ్ ప్లేయంగ్‌-11(అంచనా):
డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (c&wk), కేన్ విలియమ్సన్/కైల్ జామిసన్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌతీ.


Also Read: బాల్స్‌ మారుస్తున్నారా? బీసీసీఐ చీట్ చేస్తుందా? మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు