Keshav Maharaj: 'జై హనుమాన్‌' పాకిస్థాన్‌ను ఓడించిన 'బజరంగబలి' భక్తుడి పోస్ట్ వైరల్!

ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విన్నింగ్‌ షాట్‌ కొట్టి సఫారీలను గెలిపించాడు మహారాజ్‌. మ్యాచ్‌ తర్వాత 'జై శ్రీ హనుమాన్‌' అని మహారాజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.

New Update
Keshav Maharaj: 'జై హనుమాన్‌' పాకిస్థాన్‌ను ఓడించిన 'బజరంగబలి' భక్తుడి పోస్ట్ వైరల్!

Keshav Maharaj: హనుమాన్‌ భక్తులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కనిపిస్తారు. అమెరికా అధ్యక్షుడైనా.. ఆఫ్రికా క్రికెటర్‌ అయినా.. యూరోప్‌లో బిలియనీర్‌ అయినా బజరంగబలిని నమ్ముకున్న వాళ్లు కనిపిస్తారు. గొప్ప విజయాలు సాధించిన ఎందరికో హనుమాన్‌ ఆరాధ్య దైవం. హనుమాన్‌ చాలా మందికి స్ఫూర్తి. చాలా మందికి ఫేవరెట్‌ గాడ్‌ కూడా. అ లిస్ట్‌లోకే వస్తాడు దక్షిణాఫ్రికా క్రికెటర్‌ మహారాజ్‌. వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్థాన్‌పై సౌతాఫ్రికా విజయం సాధించిన విషయం తెలిసిందే.

అంతా హనుమాన్‌ దయ:
పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా (Pak vs SA) మధ్య జరిగిన మ్యాచ్‌ ఈ ప్రపంచకప్‌ (World Cup 2023) థ్రిల్లర్స్‌లో ఒకటి. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌ క్రికెట్ ఫ్యాన్స్‌కు అసలైన మజాను అందించింది. ఇరు జట్ల మధ్య దోబూచులాడిన మ్యాచ్‌ చివరకు సఫారీలనే వరించింది. ఈ మ్యాచ్‌లో విన్నింగ్‌ షాట్ కొట్టి దక్షిణాఫ్రికాను గెలిపించాడు మహారాజ్‌. దీంతో ఒక్కసారిగా అతని పేరు క్రికెట్ సర్కిల్స్‌లో మార్మోగుతోంది. ఒత్తిడి తట్టుకుంటూ బలమైన పాక్‌ బౌలర్లను ఎదుర్కొన్నాడు మహారాజ్‌.

Also Read: ENG vs SL: అవ్వా..అవ్వా.. ఇది ఛాంపియన్‌ జట్టంట.. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఆశలు ఆవిరి!  


మ్యాచ్‌ విన్నింగ్‌ షాట్‌ కొట్టిన తర్వాత మహారాజ్‌ (Maharaj) గట్టిగా గర్జించాడు. ఇక మ్యాచ్‌ ముగిసిన తర్వాత మహారాజ్‌ సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఈ పోస్ట్ భారతీయుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది. మ్యాచ్‌ విజయం తర్వాత 'హనుమాన్‌'ను గుర్తు చేసుకున్నాడు మహారాజ్‌. దేవుడిని నమ్ముతానని చెప్పుకొచ్చాడు. ఐడెన్ మర్క్‌రమ్‌, షంసీని అభినందిస్తూ పోస్ట్ పెట్టాడు. ఈ మ్యాచ్‌లో ఈ ఇద్దరూ అద్భుతంగా ఆడారు. 'దేవుడిని విశ్వసిస్తున్నాను 🙏🕉️ గొప్ప ఫలితం ఇది. @shamsi90 & @aidenmarkram ప్రదర్శనలు అద్భుతం' అని క్యాప్షన్ పెట్టాడు. ఈ మ్యాచ్‌ విజయంతో పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. ఆరు మ్యాచ్‌లు ఆడిన దక్షిణాఫ్రికా ఐదు మ్యాచ్‌ల్లో విక్టరీ కొట్టింది. ఓడిపోయిన మ్యాచ్‌ నెదర్లాండ్స్‌పై కావడం విడ్డూరం. అటు పాకిస్థాన్‌ ఆరు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది.

#cricket #icc-world-cup-2023 #pak-vs-sa #keshav-maharaj
Advertisment
Advertisment
తాజా కథనాలు