PAK vs AFG: చెన్నై బీచ్‌లో కొట్టుకుపోయిన పాకిస్థాన్ పరువు.. ఘోరంగా పసికూనల చేతిలో..! ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టుకు ఘోర అవమానం ఇది. పసికూన అఫ్ఘాన్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయింది. ఈ ఏడాది ప్రపంచకప్ సంచలనాలకు అడ్డాగా మారింది. ఈ వరల్డ్‌కప్‌లో ఇది మూడో పెను సంచలనం. పాక్ సెట్ చేసిన 283 పరుగుల టార్గెట్‌ని అఫ్ఘాన్ ఈజీగా ఛేజ్ చేసింది. అఫ్ఘాన్ 49 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 286 రన్స్ చేసింది. By Trinath 23 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ప్రపంచకప్‌లో మరో పెను సంచలనం నమోదైంది. అఫ్ఘానిస్థాన్(Afghanistan) చేతిలో పాకిస్థాన్(Pakistan) ఓడిపోయింది. ఈ ప్రపంచకప్‌లో నమోదైన మూడో సంచలనం ఇది. ఇదే అఫ్ఘాన్ చేతిలో ఇంగ్లండ్ ఓడిపోగా.. నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా పరాజయం పాలైన విషయం తెలిసిందే. తాజాగా దాయాది పాకిస్థాన్‌కు మట్టికరిపించింది అఫ్ఘాన్. ఏకంగా 8 వికెట్ల తేడాతో గెలిచింది. Mark my words this afghanistan team will go a long way by the next world cup and i wont be surprised if they win a few more in this world cup as well! Havent seen this kind of talent in a long time as each of them are in their early 20's! #PAKvsAFG — Kris Srikkanth (@KrisSrikkanth) October 23, 2023 రాణించిన నూర్ అహ్మద్: ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 రన్స్ చేసింది. పాక్ ఓపెనర్ షాఫీక్ రాణించాడు. 75 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేసి నూర్ అహ్మద్ బౌలింగ్‌లో LBW అయ్యాడు. అటు మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ నిరాశ పరిచాడు. 22 బంతుల్లో 17 పరుగులు చేసి అజ్మతుల్లా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ బాబర్ అజామ్ తన సత్తా చూపించాడు. ఓవైపు వికెట్లు పడుతున్న నిలకడగా బ్యాటింగ్ చేశాడు. ఎక్కువగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత నూర్ అహ్మద్ పాక్‌ని మరోసారి దెబ్బకొట్టాడు. డేంజర్‌గా మారిన బాబర్‌ని అవుట్ చేశాడు. 92 బంతులు ఆడిన బాబర్ 74 రన్స్ చేశాడు. ఇందులో ఒక సిక్సర్, 4 ఫోర్లు ఉన్నాయి. అటు ఎన్నో ఆశలు పెట్టుకున్న రిజ్వాన్ ఈ మ్యాచ్‌లో పూర్తిగా నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులే చేసి నూర్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఇలా ముగ్గురు కీలక బ్యాటర్ల వికెట్లను నూర్ అహ్మద్ పడగొట్టాడు. లోయర్ మిడిలార్డర్‌లో షకీల్, షాదాబ్, ఇఫ్తికార్ విలువైన పరుగులు చేశారు. షాదాబ్ ఖాన్, ఇఫ్తికార్ తలో 40 పరుగులు చేశారు. అటు అఫ్ఘాన్ బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు తియ్యగా.. నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు, నబీ, అజ్మతుల్లా తలో వికెట్ తీశారు. రఫ్ఫాడించిన అఫ్ఘాన్: 283 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్ఘానిస్థాన్‌కు ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. అసలు వికెట్ పడనివ్వకుండా పరుగులు చేస్తూ పాక్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. సింగిల్స్ రొటేట్ చేస్తూ వీలుదొరికినప్పుడల్లా ఫోర్లు కొట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. తొలి వికెట్‌కు 21.1 ఓవర్లలోనే 130 పరుగులు జోడించిన తర్వాత ఫస్ట్ వికెట్ పడింది. షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో గుర్బాజ్ అవుట్ అయ్యాడు. 53 బంతుల్లో 65 రన్స్ చేసిన గుర్బాజ్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. మరో ఓపెనర్ జడ్రాన్ 87 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 113 బంతుల్లో 87 రన్స్ చేశాడు జడ్రాన్. ఇందులో 10 ఫోర్లు ఉన్నాయి. జడ్రాన్ అవుట్ అయ్యే సమయానికి అఫ్ఘాన్ స్కోరు 33.3 ఓవర్లలో 190 పరుగులు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన రెహ్మత్ షాకు కెప్టెన్ షాహీది జత కలిశాడు. ఇద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ జట్టు స్కోరును టార్గెట్ వైపు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే రెహ్మత్ అర్థం సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. Also Read: అంత ఆవేశం ఎందుకు భయ్యా.. నంబర్-1 ర్యాంకును చేజేతులా వదులుకుంటున్న గిల్! #icc-world-cup-2023 #pakistan-vs-afghanistan #pak-vs-afg మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి