World cup 2023: ఆడడానికి వచ్చారా.. మెక్కడానికి వచ్చారా? ఏకంగా 8 కేజీల మటన్ తింటారా? అఫ్ఘాన్‌పై ఓటమిని తట్టుకోలేకపోతున్నారు పాక్ మాజీ ఆటగాళ్లు. తమ జట్టు ప్లేయర్ల ఫిట్‌నెస్ ఏ మాత్రం బాలేదని పాకిస్థాన్ లెజెండరీ ప్లేయర్ వసీం అక్రమ్ విమర్శించాడు. పాక్ ఆటగాళ్ల ఫీల్డింగ్ స్కిల్స్ చూస్తుంటే రోజుకు 8 కేజీల మటన్ తింటున్నట్టు ఉందంటూ కామెంట్స్ చేశారు. వారి ఫిట్‌నెస్ లెవల్స్ చాలా దారుణంగా ఉన్నాయంటూ కామెంట్స్ చేశారు. అసలు ఫిట్‌నెస్ టెస్ట్ ఎందుకు జరపడంలేదో తనకు అర్థంకావడం లేదన్నాడు వసీం. By Trinath 24 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి పాకిస్థాన్(Pakistan) ప్లేయర్లకు ఒళ్లు వంగడంలేదు. ఫీల్డింగ్ విషయంలో పాకిస్థాన్ ప్లేయర్లపై జరిగే ట్రోలింగ్ ప్రపంచంలో మరే ఇతర జట్టుపైనా జరగదు. ఇది అనధిగా ఆ జట్టు పాటిస్తున్న సంప్రదాయం. స్లాపీ ఫీల్డింగ్‌లో పాక్ జట్టు పీహెచ్‌డీ చేసింది. దశాబ్దాలుగా అదే డాక్టరేట్ పట్టా పట్టుకోని గ్రౌండ్‌లోకి దిగుతోంది. అఫ్ఘాన్‌పై మ్యాచ్‌లోనూ అదే చేసింది. దారుణ ఫీల్డింగ్ ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణం. అసలు బాల్ ఇలా కూడా ఆపుతారా.. డైవ్ ఇలా కూడా చేస్తారా అనిపించేలా ఉంటుంది పాక్ ఫీల్డింగ్. పసికూన అఫ్ఘాన్‌పై పాక్ ఓడిపోవడంతో ఆ జట్టు ఫ్యాన్స్ తల ఎత్తుకోలేకపోతున్నారు. నిత్యం సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే పాక్ క్రికెట్ సపోర్టర్స్‌లో చాలా మంది అఫ్ఘాన్‌పై ఓటమి తర్వాత అకౌంట్లు డియాక్టివేట్ చేసుకున్నారని సమాచారం. మరోవైపు పాక్ మాజీ ప్లేయర్లు మరింత అవమానంగా ఫీల్ అవుతున్నారు. Ha ha ha ha .. Pakistan fielding is my god. While the world is getting better the Pakistan fielding is taking me back to the 90s. Shaheen Shah Afridi this time. But even the inner fielding has been really bad. Afghanistan is coasting here #AFGvsPAK #PAKvsAFG pic.twitter.com/66JwOecTCj — Aadit Kapadia (@ask0704) October 23, 2023 8 కేజీల మటన్ తింటారా? ఇండియాపై ఓటమి తర్వాత పాక్‌జట్టుపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడగా.. అఫ్ఘాన్‌పై ఓటమి తర్వాత వారి కోపం రెట్టింపు అయ్యింది. ఆ జట్టు లెజెండరీ ప్లేయర్, మాజీ కెప్టెన్ వసీం అక్రమ్(Wasim Akram) ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై నిప్పులు కక్కారు. రోజుకు 8 కేజీల మటన్ తింటే ఫీల్డింగ్ ఇంత దారుణంగానే ఉంటుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్ల ఫిట్‌నెస్ లేవల్స్ చాలా దారుణంగా ఉన్నాయంటూ కామెంట్స్ చేశారు. Well played pakistan 😂 Noice fielding 😉 Congratulations afghanistan ❣️#PAKvsAFG #AFGvPAK #CWC2023 pic.twitter.com/mjOXzNR0Qv — Ojhashivam (@Ojhashivam72) October 23, 2023 అసలు ఫిట్‌నెస్ టెస్ట్ ఎందుకు జరపడంలేదో తనకు అర్థంకావడం లేదన్నాడు వసీం. వ్యక్తిగతంగా ఎవరి గురించి అయినా కామెంట్ చేస్తే ఫీల్ అవుతారని.. కానీ చాలా మంది ఫిట్‌నెస్‌ని గమనిస్తే రోజుకు 8 కేజీల మటన్ తింటున్నట్టు ఉందని అభిప్రాయపడ్డాడు వసీం. Mere sath Milke haso Sab Pakistan ki fielding sabse acchi hai 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🚩#AFGvPAK #PAKvsAFG #AjayJadeja #Chepauk pic.twitter.com/7ilOgGyKdG — CricketMania (@Cricket__Mania_) October 23, 2023 డబ్బులు తీసుకుంటున్నారు కదా: క్రికెటర్లు జీతం తీసుకుంటున్నారని.. ఫ్రీగా ఏమీ దేశానికి ఆడడంలేదనంటూ చురకలంటించాడు వసీం అక్రమ్. కోచ్‌గా మిస్బా ఉన్నప్పుడు చాలా ప్రమాణాలు ఉన్నాయని.. అందుకే ఆటగాళ్లు మిస్బాను అసహ్యించుకున్నారన్నారు. కానీ.. మిస్బా క్రైటీరియా జట్టుకు పనిచేసిందని చెప్పారు వసీం. ఫీల్డింగ్ అంటేనే ఫిట్‌నెస్ గురించి అని.. మనం ఎంత ఫిట్‌గా ఉన్నామో అది మైదానంలోనే తెలుస్తుందన్నాడు. ఇక 283 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్ఘాన్ కేవలం రెండు వికెట్లే కోల్పోయి టార్గెట్‌ని ఛేజ్ చేసింది. అది కూడా ఓవర్ మిగిలి ఉండగానే టార్గెట్‌ని రీచ్ అయ్యింది. ఈ వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌కి ఇది వరుసగా మూడో ఓటమి. పాకిస్థాన్ తన తదుపరి మ్యాచ్ శుక్రవారం చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. Also Read: అంత ఆవేశం ఎందుకు భయ్యా.. నంబర్-1 ర్యాంకును చేజేతులా వదులుకుంటున్న గిల్! #icc-world-cup-2023 #pakistan-vs-afghanistan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి