Virat Kohli: భయ్యా..ఇది రాసిపెట్టుకో.. విరాట్‌ కోహ్లీ నెక్ట్స్ బ్రేక్‌ చేయబోయే రికార్డు ఇదే..!

అక్టోబర్ 19న పూణే వేదికగా టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. భారత్ రన్ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ మరో 77 రన్స్ చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 26వేల రన్స్ పూర్తవుతాయి. మరోవైపు పూణే గడ్డపై కోహ్లీకి అద్బుతమైన రికార్డులున్నాయి. ఈ పిచ్‌పై 12 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ 69.27 యావరేజ్‌తో 762 రన్స్ చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, మూడు హాఫ్‌ సెంచరీలున్నాయి.

New Update
Virat Kohli: భయ్యా..ఇది రాసిపెట్టుకో.. విరాట్‌ కోహ్లీ నెక్ట్స్ బ్రేక్‌ చేయబోయే రికార్డు ఇదే..!

విరాట్ కోహ్లీ(Virat Kohli)తో మాములుగా ఉండదు.. కొడితే రికార్డులు బ్లాస్ట్ అవ్వాల్సిందే.. వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఇండియా మూడు మ్యాచ్‌లు ఆడితే..అందులో రెండు మ్యాచ్‌ల్లో విరాట్ సత్తా చాటాడు. ఆస్ట్రేలియాపై జరిగిన తొలి పోరులో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో ఉంటే ఆదుకున్నది విరాటే. రాహుల్‌తో కలిసి ఆస్ట్రేలియాకు విజయాన్ని దూరం చేశాడు కోహ్లీ. 200 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, ఇషాన్‌ కిషన్‌, శ్రేయర్‌ అయ్యర్ ముగ్గురూ కూడా డకౌట్ అయ్యారు. ఈ దశలో కోహ్లీ, రాహుల్ జట్టును ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇద్దరూ కలిసి ఏకంగా 164 రన్స్ పార్టనర్‌షిప్‌ నెలకోల్పారు. 116 బంతుల్లో 85 పరుగులు చేసిన విరాట్‌ హెజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కోహ్లీ సెంచరీ మీస్‌ అవ్వడంతో అభిమానులు కాస్త డీలా పడ్డా.. ఛేజింగ్‌లో తానెంటో మరోసారి ప్రపంచానికి చూపించాడని ఆనందపడ్డారు. ఇక ఎల్లుండు(అక్టోబర్ 19) బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ ఉండగా.. కోహ్లీ ఓ మైలురాయికు దగ్గరలో ఉన్నాడు..

మరో 77 పరుగులు చేస్తే:
కోహ్లీ మరో 77 రన్స్ చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 26వేల రన్స్ పూర్తి చేసుకున్న ప్లేయర్‌గా నిలుస్తాడు. ఈ జాబితాలో అందరికంటే ముందుగా క్రికెట్‌గాడ్‌ సచిన్ ఉన్నాడు. సచిన్ 34,357 రన్స్ చేశాడు. ఇక ఆ తర్వాత 28,016 రన్స్‌తో శ్రీలంక దిగ్గజం కుమారా సంగక్కర, 27,483 రన్స్‌తో ఆసీస్‌ గ్రేట్‌ రికీ పాంటింగ్‌, 28,957 రన్స్‌తో శ్రీలంక లెజెండరీ బ్యాటర్ జయవర్దనే ఉన్నారు. బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో కోహ్లీ ఈ మైల్‌స్టోన్‌ రీచ్‌ అవుతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


ఆ గ్రౌండ్‌లో కోహ్లీకి తిరుగేలేదు:
మరోవైపు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ జరగనున్న పూణేలో కోహ్లీకి మంచి రికార్డులున్నాయి. పూణే గడ్డపై 12 సార్లు బ్యాటింగ్‌ చేసిన కోహ్లీ 69.27 యావరేజ్‌తో 762 రన్స్ చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, మూడు హాఫ్‌ సెంచరీలున్నాయి. ఈ పిచ్‌పై పేస్‌ బౌలర్లపై కోహ్లీ స్టాట్స్‌ అద్భుతంగా ఉన్నాయి. వారిపై 88 స్ట్రైట్‌రేట్‌తో పాటు 55 యావరేజ్‌ని కలిగి ఉన్నాడు కోహ్లీ. అటు స్పిన్నర్లపైనా కోహ్లీ పరుగుల వరద పారించాడు. పూణే పిచ్‌పై స్పిన్నర్లపై 93.25 యావరేజ్‌తో బ్యాటింగ్‌ చేశాడు కోహ్లీ.

ALSO READ: హిట్‌మ్యాన్‌ని ఆపేదేవడు.. రోహిత్‌ను ఊరిస్తున్న మరో అరుదైన రికార్డు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు