IND vs ENG: గెలుస్తారా.. బోర్లా పడుతారా? ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే? By Trinath 29 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి వరల్డ్‌కప్‌లో ఐదు మ్యాచ్‌లో దుమ్మురేపిన ఇండియా ఆరో మ్యాచ్‌లో తడపడింది. లక్నో వేదికగా ఇంగ్లాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోర్ సాధించలేకపోయింది. అవుట్ ఫీల్డ్ స్లోగా ఉండడంతో పరుగులు రావడం కూడా కష్టమైంది. 30 యార్డ్ సర్కిల్ బయట బాల్ కదలడమే గగనమైపోయింది. 50 ఓవర్లలో టీమిండియా 9 వికెట్లకు 229 రన్స్ చేయగలిగింది. Runs - 87 Balls - 101 Fours - 10 Sixes - 3 SR - 86.14 Rohit Sharma played another impressive innings to rescue India from a difficult situation. 🔥#RohitSharma #India #INDvsENG #ODIs #WorldCup pic.twitter.com/GEKsXOcGG1 — Wisden India (@WisdenIndia) October 29, 2023 ఫస్ట్ టైమ్ ఫస్ట్ బ్యాటింగ్: ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ భారత్ ముందుగా బౌలింగే చేసింది. ఈ ఐదు మ్యాచ్‌ల్లోనూ ఇండియా ఛేజ్ చేసి గెలిచింది. ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో మాత్రం తొలి సారి బ్యాటింగ్‌కు దిగింది. న్యూజిలాండ్‌పై ఆడిన టీమ్‌తోనే మార్పులు లేకుండా బరిలోకి దిగింది. ఓపెనర్లుగా రోహిత్, గిల్ ఈసారి మంచి స్టార్ట్ ఇవ్వలేదు. ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో స్కోరు బోర్డు స్లోగా కదిలింది. జట్టు స్కోరు 26 రన్స్ వద్ద ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో గిల్ 9 రన్స్ చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ 9 బాల్స్ ఆడి డకౌట్‌గా వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయర్ అయ్యార్ 16 బంతుల్లో నాలుగే రన్స్ చేసి వికెట్ గిరాటేసుకున్నాడు. చాలా నిర్లక్ష్యపు షాట్ అది. ఈ వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై జరిగిన తొలి వన్డేలోనూ అయ్యర్ ఇలానే వికెట్ ఇచ్చుకున్నాడు. అప్పుడు విమర్శలొచ్చినా.. ఇప్పటికీ తీరు మారలేదని తెలుస్తోంది. ఆదుకున్న రోహిత్, రాహుల్: ఈ వరల్డ్‌కప్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న రోహిత్ జట్టును మరోసారి ఆదుకున్నాడు. వరుస పెట్టి వికెట్లు పడుతున్నా రోహిత్ మాత్రం ఇంగ్లండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మరో ఎండ్‌లో రాహుల్ కూడా రోహిత్‌కు చక్కటి సహకారం అందించాడు. ఈ ఇద్దరు కలిసి 91 రన్స్ పార్టనెర్‌షిప్ జోడించిన తర్వాత రాహుల్ అనవసర షాట్‌కు యత్నించి విల్లే బౌలింగ్‌లో బెయిర్‌స్టో చేతికి చిక్కాడు. ఆ తర్వాత సెంచరీవైపు వెళ్తున్న రోహిత్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. 100 బంతుల్లో 87 రన్స్ చేశాడు హిట్‌మ్యాన్. ఇందులో 10 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ కూడా పరిస్థితికి తగ్గట్లుగా బ్యాటింగ్ చేయడంతో టీమిండియా 200 పరుగుల మార్క్ దాటింది. అటు బుమ్రా కూడా విలువైన పరుగులు చేయడంతో 50 ఓవర్లలో 9 వికెట్లకు భారత్ 229 రన్స్ చేసింది. Also Read: రోహిత్‌కి సెంచరీల పిచ్చి లేదు..రికార్డుల కోసం ఆడడు.. ప్రూఫ్స్ ఇవే..! #cricket #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి