Rohit Sharma: కోహ్లీ వల్ల కూడా కాలేదు.. రోహిత్‌ రికార్డులు అలా ఉంటాయి మరి!

వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో రోహిత్ శర్మ హాఫ్‌ సెంచరీ సాధించడంతో మరో రికార్డు వచ్చి పడింది. వరల్డ్‌కప్‌లో అత్యధిక సార్లు 50+ స్కోర్‌ చేసిన ప్లేయర్లలో రోహిత్‌ సెకండ్‌ ప్లేస్‌లో నిలిచాడు. 23 ఇన్నింగ్స్‌లలో రోహిత్‌ 12సార్లు 50+ స్కోరు చేశాడు. సచిన్‌ 44 ఇన్నింగ్స్‌లో 21 సార్లు 50+ రన్స్‌ చేశాడు.

New Update
Rohit Sharma: కోహ్లీ వల్ల కూడా కాలేదు.. రోహిత్‌ రికార్డులు అలా ఉంటాయి మరి!

వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. వరుస పెట్టి రికార్డులు సృష్టిస్తూ అదరగొడుతున్నాడు. 2019 ప్రపంచకప్‌లో రోహిత్ క్రియేట్ చేసిన రికార్డులు ఒక ఎత్తైతే.. ఈ ఏడాది(2023) ప్రపంచకప్‌లో మరో ఎత్తు. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై డకౌట్ మినాహాయిస్తే అఫ్ఘానిస్థాన్‌పై మ్యాచ్‌ నుంచి మొదలైన రోహిత్ రికార్డుల ఊచకోత ఇప్పటికీ కొనసాగుతోంది. తాజాగా ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లోనూ రోహిత్ దుమ్మురేపుతున్నాడు. అవుట్ ఫీల్డ్‌ స్లోగా ఉన్నా రన్స్‌ మాత్రం ఈజీగా చేస్తున్నాడు. పరిస్థితికి తగ్గట్లుగా బ్యాటింగ్ చేస్తూ మరో కొత్త రికార్డు సృష్టించాడు.


సచిన్‌.. రోహిత్ టాప్‌-2:
లక్నో వేదికగా ఇంగ్లండ్‌పై జరుగుతున్న మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ పూర్తి అయిన వెంటనే రోహిత్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది. వరల్డ్‌కప్‌లో 50+ స్కోర్స్‌లో రోహిత్ సచిన్‌ తర్వాతి స్థానంలో ఉన్నాడు. కోహ్లీ, సంగక్కర కంటే ముందున్నాడు. ఇప్పటివరకు వరల్డ్‌కప్‌లో 23 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ 12సార్లు 50కంటే ఎక్కువ స్కోర్ చేశాడు. అంటే ప్రతీ రెండు మ్యాచ్‌లకు ఒకసారి రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. క్రికెట్‌ గాడ్ సచిన్‌ 44 ఇన్నింగ్స్‌లలో 21 సార్లు 50+ స్కోర్ చేశాడు.


అటు సచిన్, రోహిత్ తర్వాతి స్థానంలో కోహ్లీ, షకీబ్‌, సంగక్కర ఉన్నారు. కోహ్లీ 32 ఇన్నింగ్స్‌లలో 12 సార్లు 50+ స్కోరు చేయగా.. షకీబ్‌ 34 ఇన్నింగ్స్‌లో 12 సార్లు 50+ స్కోరు చేశాడు. సంగక్కర 35 ఇన్నింగ్స్‌లో 12 సార్లు 50+ రన్స్ చేశాడు. మరోవైపు ఈ మ్యాచ్‌ ద్వారా రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌లో 18 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ లిస్ట్‌లో సచిన్‌ 34 వేల రన్స్‌తో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక ఓపెనర్‌గా రోహిత్‌ 50+ రన్స్‌ చేయడం ఇది 111వ సారి. సచిన్‌ 120 సార్లు ఓపెనర్‌గా 50+ చేశాడు. ఇక 100 బంతుల్లో 87 రన్స్ చేసిన రోహిత్ రషీద్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

Also Read:‘బుద్ధి ఉన్నొడు ఎవడైనా అతనికి బౌలింగ్‌ ఇస్తాడా’? పాకిస్థాన్‌ మాజీల తిట్ల దండకం!

Advertisment
Advertisment
తాజా కథనాలు