World Cup 2023: టీమిండియాకు వెరీ బిగ్‌ షాక్‌.. గాయంతో టోర్నమెంట్‌కే ఆ స్టార్‌ దూరం?

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయం మునుపటి కంటే తీవ్రంగా కనిపిస్తోంది. దీంతో ఇంగ్లండ్‌తో మ్యాచే కాదు.. తర్వాత జరగనున్న శ్రీలంక, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లకు కూడా పాండ్యా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యాకు గ్రేడ్-ఎ లిగమెంట్ టియర్ ఉంది. అంటే హార్దిక్ కోలుకోవడానికి దాదాపు 2 వారాలైనా పడుతుంది.

New Update
World Cup 2023: టీమిండియాకు వెరీ బిగ్‌ షాక్‌.. గాయంతో టోర్నమెంట్‌కే ఆ స్టార్‌ దూరం?

World Cup 2023: ఇప్పటివరకు అంతా హ్యాపీగానే గడిచింది. మ్యాచ్‌లన్నీ గెలుస్తున్నాం.. అది కూడా లక్‌తో కాదు.. కంప్లీట్ డామినేషన్‌తో. ఐదు మ్యాచ్‌లు ఆడితే అన్నిటిలోనూ మనదే విక్టరీ.. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడే అభిమానుల్లో కాస్త టెన్షన్ మొదలైంది. బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) గాయపడ్డ విషయం తెలిసిందే. బాల్ వేసిన వెంటనే బ్యాటర్‌ కొట్టిన స్ట్రైట్ డ్రైవ్‌ను ఆపేందుకు ప్రయత్నించిన పాండ్యా గాయపడ్డాడు. వెంటనే మైదానాన్ని వీడాడు. తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా ఆడలేదు. అయితే తర్వాతి మ్యాచ్‌లకు పాండ్యా వస్తాడని భావిస్తే అది జరిగే పరిస్థితి లేదని తెలుస్తోంది.

World Cup 2023 పాండ్యా

గాయం తీవ్రత ఎక్కువే:
హార్దిక్ పాండ్యాకు గ్రేడ్-ఎ లిగమెంట్ టియర్ ఉంది. అంటే హార్దిక్ కోలుకోవడానికి దాదాపు 2 వారాలైనా పడుతుంది. ఆదివారం ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్‌కు పాండ్యా అందుబాటులో ఉండడం లేదని ఇప్పటికే అర్థమైంది. అయితే నవంబర్‌-2న శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌కు పాండ్యా వస్తాడని అంతా భావించారు. కానీ అది కూడా జరిగే అవకాశం లేదట. అంతేకాదు.. నవంబర్‌-5న దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌ టైమ్‌కు కూడా పాండ్యా అందుబాటులో ఉండడంలేదని సమాచారం. హార్దిక్‌ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాడు. ఎన్‌సీఏ లో గడుపుతున్నాడు. నితిన్ పటేల్ నేతృత్వంలోని వైద్య బృందం పాండ్యాను చూసుకుంటుందని బీసీసీఐ (BCCI) వర్గాలు తెలిపాయి.

కనిపిస్తున్న ఆల్‌రౌండర్‌ లేని లోటు:
పాండ్యా లేకపోవడం టీమిండియాకు పెద్దదెబ్బగానే చెప్పాలి. ఎందుకంటే పాండ్యా బ్యాట్‌, బాల్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ టీమిండియాకు కీలక ఆటగాడు. పాండ్యా లేకపోవడం వల్ల అతని స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) జట్టులోకి వస్తున్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ పాండ్యా లాగా 3-D ప్లేయర్ కాదు. కేవలం 1-D ప్లేయరే. దీంతో పాండ్యా లేని లోటు భర్తీ చేయడం కష్టంగానే కనిపిస్తోంది.

Also Read: అబ్బా.. ఏమన్నా ఆడాడా భయ్యా.. ‘నేనేమో ఒక్క పరుగు తియ్యడానికి 40 బంతులు ఆడాను’!

Advertisment
Advertisment
తాజా కథనాలు