ENG vs SL: అవ్వా..అవ్వా.. ఇది ఛాంపియన్‌ జట్టంట.. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఆశలు ఆవిరి!

ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఫ్లాప్‌ షో కొనసాగుతోంది. శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌ ఓడిపోయింది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్‌కు ఇది నాలుగో ఓటమి. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 156 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. శ్రీలంక157 టార్గెట్‌ను కేవలం రెండు వికెట్లు కోల్పోయి 25.4 ఓవర్లలో ఛేదించింది.

New Update
ENG vs SL: అవ్వా..అవ్వా.. ఇది ఛాంపియన్‌ జట్టంట.. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఆశలు ఆవిరి!

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్‌ ఘోర పరాజయాల పరంపరను కొనసాగిస్తోంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లీష్‌ టీమ్‌ చిత్తుచిత్తుగా ఓడింది. ఇంగ్లండ్‌పై లంకేయులు 8 వికెట్ల తేడాతో విజయం సాధించారు. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 156 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. శ్రీలంక 157 టార్గెట్‌ను 2 వికెట్లు కోల్పోయి 25.4 ఓవర్లలోనే ఛేదించింది.


తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు అంత గొప్ప ఆరంభం ఏమీ ఇవ్వలేదు. 100కు పైగా స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేసిన మలాన్‌ 28 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. జట్టు స్కోరు 45 దగ్గర మలాన్‌ వికెట్‌ని కోల్పోయింది ఇంగ్లండ్‌. మలాన్‌ అవుటైన కాసేపటికే మరో ఓపెనర్‌ బెయిర్‌స్టో కూడా అవుట్ అయ్యాడు. 31 బంతుల్లో 30 రన్స్ చేసిన బెయిర్‌స్టో రజితా బౌలింగ్‌లో ధనుంజయ్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాత రూట్‌ కేవలం 3 పరుగులకే రన్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన బెన్‌ స్టోక్స్‌ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే మరో ఎండ్‌ నుంచి అసలు సహాకారమే కరువైంది. బట్లర్‌, లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రీస్‌ వోక్స్‌, ఆదిల్‌ రషీద్‌, మార్క్‌ వుడ్ వరుస పెట్టి పెవిలియన్‌కు క్యూ కట్టారు. అటు చాలా స్లోగా బ్యాటింగ్ చేసిన స్టోక్స్‌ 73 బంతుల్లో 43 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమారా 3 వికెట్లతో సత్తా చాటాడు.


ఇక సెమీస్ కష్టమే:

ఇంగ్లండ్‌ 155 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన శ్రీలంక ఆడుతూ పాడుతూ టార్గెట్‌ని రీచ్‌ అయ్యింది. ఓపెనర్ నిస్సాంక 83 బంతుల్లో 77 పరుగులు చేయగా.. సదీరా 54 బంతుల్లో 65 రన్స్ బాదాడు. ఈ మ్యాచ్‌ ఓటమితో ఇంగ్లండ్ సెమీస్‌ ఛాన్స్‌ దాదాపుగా లేనట్టే అనుకోవాలి. ప్రస్తుత పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్‌ 9వ స్థానంలో ఉంది. ఇంగ్లండ్‌ ఖాతాలో కేవలం రెండు పాయింట్లే ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ కూడా దారుణంగా ఉంది. మైనస్‌ 1.632 రన్‌రెట్‌ను కలిగి ఉంది. ఇంగ్లండ్‌ కంటే బంగ్లాదేశ్‌, అఫ్ఘాన్‌ పరిస్థితి బెటర్‌గా ఉంది.

Also Read: టీమిండియాకు వెరీ బిగ్‌ షాక్‌.. గాయంతో టోర్నమెంట్‌కే ఆ స్టార్‌ దూరం?

Advertisment
Advertisment
తాజా కథనాలు