Rohit Sharma: రోహిత్ శర్మ వల్లే గెలుస్తున్నాం.. ఎందుకో తెలుసుకోండి..!

ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇస్తున్న మెరుపు ఆరంభాలతో జట్టు విజయాల బాటపడుతోంది. ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న రోహిత్ శర్మ వేగంగా పరుగులు చేస్తుండడంతో తర్వాత బ్యాటింగ్‌కి వస్తున్న ప్లేయర్లపై ఒత్తిడి తగ్గుతోంది. దీంతో వారు స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేసుకుంటూ జట్టును గెలిపిస్తున్నారు.

New Update
Rohit Sharma: రోహిత్ శర్మ వల్లే గెలుస్తున్నాం.. ఎందుకో తెలుసుకోండి..!

టీమిండియా ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడితే ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లోనూ ఘన విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. భారత్‌ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో జట్టుకు గెలుపునకు కారణం అయ్యాడు రోహిత్ శర్మ. అదేంటి కోహ్లీ 80లు, 90లు, 100లు కొడితే రోహిత్‌ ఎలా గెలిపించినట్టు అని అనుకుంటున్నారా? కళ్లకు కనపడే గణాంకాలు కాదు.. మ్యాచ్‌ను ఫస్ట్ నుంచి చూసి.. గేమ్‌ని అర్థం చేసుకుంటే అసలు విషయాలు తెలుస్తాయంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌. ఈ వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మకు 100కు 100 మార్కులు ఇవ్వాల్సిందేనంటున్నారు. ఎందుకు మీరు కూడా తెలుసుకోండి.

రోహిత్‌ వల్లే గెలుస్తున్నాం:
అఫ్ఘాన్‌పై మ్యాచ్‌లో సెంచరీతో మెరిశాడు రోహిత్. 63 బంతుల్లోనే సెంచరీ చేసిన రోహిత్ జట్టు గెలుపునకు కారణం అయ్యాడని అందరూ అంగీకరించేదే.. ఇక పాకిస్థాన్‌పై మ్యాచ్‌లో రోహిత్‌ వీరవీహారం చేశాడు. యమ స్ట్రాంగ్‌గా ఉన్న పాకిస్థాన్‌ బౌలర్లను ఉతికి ఆరేశాడు. 63 బంతుల్లో 86 రన్స్ చేసిన రోహిత్ సెంచరీ చేజార్చుకున్నా అప్పటికీ పాక్‌ ఓటమి ఫిక్స్‌ ఐపోయింది. సరే ఈ రెండు మ్యాచ్‌లు అంటే రోహిత్ భారీగా రన్స్ చేశాడు కాబట్టి అతడి వల్లే గెలిచాం అని అనుకుందాం... మరి బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో ఎక్కువ రన్స్ చేసింది కోహ్లీ కదా.. మరి రోహిత్ వల్ల గెలుస్తున్నామని విశ్లేషకులు ఎలా అంటున్నారని ఆలోచిస్తున్నారా?


సెహ్వాగ్‌ను గుర్తుకు తెస్తున్నాడు:
ఏ జట్టుకైనా మంచి ఆరంభం ముఖ్యం. బ్యాటింగ్‌లో ఓపెనర్లు అదరగొడితే విజయం ఈజీ అవుతుంది. ఇక రోహిత్ శర్మ ప్రస్తుతం జట్టులో సెహ్వాగ్‌ పాత్ర పోషిస్తున్నాడు. సెహ్వాగ్‌ దూకుడుగా బ్యాటింగ్‌ చేసేవాడు. 100కు పైగా స్ట్రైక్‌ రేట్‌తో హిట్టింగ్‌ చేసేవాడు. దీంతో తర్వాత బ్యాటింగ్‌ దిగిన వారిపై ఒత్తిడి తగ్గుతుంది. అప్పుడు వారు స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేసేవాళ్లు. ప్రస్తుతం రోహిత్ కూడా అదే చేస్తున్నాడు. మంచి స్టార్ట్ ఇస్తున్నాడు. వేగంగా పరుగులు చేస్తున్నాడు. దీంతో తర్వాత దిగుతున్న బ్యాటర్లకు చాలా ఫ్రీగా బ్యాటింగ్ చేస్తున్నారు. స్ట్రైక్ రొటెట్ చేస్తూ ఆడుతున్నారు. చాలా బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ని ఫినీష్ చేస్తున్నారు. బంగ్లాదేశ్‌పై రోహిత్ చేసిన 48 రన్స్‌తో పాటు కివీస్‌పై చేసిన 46 రన్స్‌తో జట్టుకు అద్భుతమైన స్టార్ట్ లభించింది. ఆ స్టార్ట్‌తోనే కోహ్లీ చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయగలిగాడు. ఒత్తిడి లేకుండా ఆడే అవకాశం రావడంతో ఛేజింగ్‌లో దుమ్మురేపాడు. ఇలా ఇండియా గెలుపునకు రోహిత్‌ కారణం అవుతున్నాడంటున్నారు క్రికెట్ పండితులు.

Also Read: ‘విరాట్‌.. ఇంత స్వార్థం పనికిరాదు..’ ట్విట్టర్‌లో ఏకిపారేస్తున్న నెటిజన్లు!

Advertisment
Advertisment
తాజా కథనాలు