PAK vs NZ: ఫకర్‌ దెబ్బకు కివీస్‌ ఫసక్‌.. ఆసక్తికరంగా మారిన సెమీస్‌ రేస్!

న్యూజిలాండ్‌పై పాకిస్థాన్‌ ఘన విజయం సాధించింది. డక్‌వర్త్‌లుయిస్‌ పద్ధతిలో 21 పరుగుల తేడాతో గెలిచింది. 401 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ 25.1 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 200 రన్స్ చేసింది. ఫకర్‌ జమాన్‌ 81 బంతుల్లోనే 126 రన్స్ చేశాడు.

New Update
PAK vs NZ: ఫకర్‌ దెబ్బకు కివీస్‌ ఫసక్‌.. ఆసక్తికరంగా మారిన సెమీస్‌ రేస్!

ICC WORLD CUP 2023: వరల్డ్‌కప్‌లో సెమీస్‌ రేస్‌ ఇంట్రెస్టింగ్‌గా మారింది. న్యూజిలాండ్‌పై పాకిస్థాన్‌ గెలవడంతో దాయాది జట్టు పాయంట్ల పట్టికలో ఐదో స్థానానికి దూసుకొచ్చింది. అఫ్ఘానిస్థాన్‌ ఆరో ప్లేస్‌కు పడిపోయింది. అటు న్యూజిలాండ్‌ నాలుగో స్థానానికి దిగజారింది. ఆస్ట్రేలియా మూడో ప్లేస్‌కు వెళ్లింది. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌కు మరో మ్యాచ్‌ మాత్రమే మిగిలి ఉండగా.. ఆస్ట్రేలియాకు మరో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్‌కు, న్యూజిలాండ్‌కు ఆస్ట్రేలియాకు 8 పాయింట్లు ఉన్నాయి. ఇక ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఇండియా సెమీస్‌ స్పాట్‌ను ఫిక్స్‌ చేసుకున్నాయి. న్యూజిలాండ్‌పై పాకిస్థాన్‌ డక్‌వర్త్‌లుయిస్‌ పద్ధతిలో గెలిచింది.


రఫ్పాడించిన రచిన్, కేన్‌:
ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌(Newzealand) 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోరును సాధించింది. రచిన్ రవీంద్ర(Rachin Ravindra), కేన్‌ విలియమ్‌సన్‌ దుమ్మురేపారు. రచిన్‌ సెంచరీతో చెలరేగితే.. గాయం తర్వాత కంబ్యాక్‌ ఇచ్చిన కేన్ మావా 5 పరుగుల తేడాతో సెంచరీ మిస్‌ అయ్యాడు. 94 బంతుల్లో రచిన్ రవీంద్ర 108 రన్స్ చేశాడు. ఈ వరల్డ్‌కప్‌లో రచిన్‌కు ఇది మూడో సెంచరీ. రచిన్ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉంది. అటు కేన్‌ మావా 79 బంతుల్లో 95 రన్స్ చేశాడు. విలియమ్‌సన్‌ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, రెండు సిక్సులు ఉన్నాయి. ఇక మిగిలిన బ్యాటర్లు కూడా వందకు పైగా స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేయడంతో కివీస్‌ భారీ స్కోరు చేసింది. ముఖ్యంగా గ్లెన్‌ ఫిలిప్స్‌ ఆఖరిలో వేగంగా రన్స్‌ చేశాడు. దీంతో కివీస్‌ 400 రన్‌ మార్క్‌ను దాటింది.


ఫకర్‌ వారెవ్వా:
లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన పాకిస్థాన్‌(Pakistan) ఆదిలోనే అబ్దుల్లా వికట్‌ను కోల్పోయినా.. మరో ఓపెనర్‌ ఫకర్ జమాన్‌ ఇరగదీశాడు. కెప్టెన్‌ బాబర్‌ ఓవైపు స్ట్రైక్‌ రొటేట్ చేస్తూ అదిరే సపోర్ట్ ఇవ్వగా.. ఫకర్ చెలరేగిపోయాడు. 61 బంతుల్లోనే సెంచరీ చేసిన ఫకర్‌ పాకిస్థాన్‌ నుంచి వరల్డ్‌కప్‌లో తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. మధ్యలో రెండు సార్లు వర్షం అడ్డు పడింది. దీంతో మ్యాచ్‌ నిర్వహించడం సాధ్యం కాదని అంపైర్లు తేల్చారు. డక్‌వర్త్‌లుయిస్‌ పద్ధతిలో పాక్‌ను విజేతగా ప్రకటించారు. 25 ఓవర్లలో కేవలం ఒక్క వికెటే కోల్పోయిన పాకిస్థాన్‌ ఏకంగా 200 రన్స్ చేసింది. మ్యాచ్‌ జరిగి ఉంటే పాకిస్థాన్‌ గెలిచి ఉండేదని.. వరల్డ్‌కప్‌లో రికార్డు ఛేజింగ్‌ నమోదయ్యేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 81 బాల్స్‌లోనే 126 రన్స్ చేసిన ఫకర్‌ నాటౌట్‌గా నిలిచాడు. ఫకర్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా 11 సిక్సులు ఉన్నాయి.


Also Read: ఒంపు సొంపులతో పిచ్చెక్కిస్తున్న రచిన్‌ గర్ల్‌ఫ్రెండ్‌! హాట్‌ ఫొటోలు చూడండి

Advertisment
Advertisment
తాజా కథనాలు