VIRAL VIDEO: సింగిల్‌ హ్యాండ్‌తో భారీ సిక్సర్‌.. ఇన్నాళ్లు ఈ వజ్రాన్ని ఎందుకు పక్కన పెట్టారు భయ్యా!

బెంగళూరు చిన్నస్వామి వేదికగా న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ ఫకర్‌ జమాన్‌ సింగిల్‌ హ్యాండ్‌తో కొట్టిన సిక్సర్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.

New Update
VIRAL VIDEO: సింగిల్‌ హ్యాండ్‌తో భారీ సిక్సర్‌.. ఇన్నాళ్లు ఈ వజ్రాన్ని ఎందుకు పక్కన పెట్టారు భయ్యా!

PAK VS NZ: పాకిస్థాన్‌ సెమీస్‌ అవకాశాలు సజీవంగా ఉంచాడు ఓపెనర్‌ ఫకర్‌ జమాన్. వరల్డ్‌కప్‌లో ఫకర్‌ జమాన్‌ గత మ్యాచ్‌లోనే రీఎంట్రీ ఇచ్చాడు. బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌తో తిరిగి జట్టులోకి వచ్చిన ఫకర్‌.. న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కళ్లెదుట భారీ లక్ష్యం ఉన్నా.. ఏ మాత్రం ఒత్తిడికి లోను కాకుండా ఫకర్ ఆడిన తీరు క్రికెట్‌ అభిమానులను ఫిదా చేసింది. 50 ఓవర్లలో న్యూజిలాండ్‌ 401 పరుగులు చేయగా.. టార్గెట్‌ ఛేజింగ్‌లో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ వర్షం కురిసే సమయానికి 25.1 ఓవర్లలో కేవలం ఒక్క వికెటే కోల్పోయి 200 రన్స్ చేసింది. దీంతో డక్ వర్త్‌లుయిస్‌ పద్ధతిలో పాక్‌ను విజేతగా ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో ఫకర్‌ కొట్టిన ఓ సిక్సర్‌ ప్రస్తుతం క్రికెట్‌ సర్కిల్స్‌లో చర్చనీయాంశమవుతోంది.

View this post on Instagram

A post shared by ICC (@icc)


సింగిల్‌ హ్యాండ్‌ సిక్సర్:
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన న్యూజిలాండ్‌ వర్సెస్‌ పాక్‌ మ్యాచ్‌లో పరుగులు వర్షం కురిసింది. 81 బంతుల్లో 126 రన్స్ చేసిన ఫకర్‌(Fakhar Zaman) ఈ మ్యాచ్‌లో ఏకంగా 11 సిక్సలు బాదాడు. ప్రతీసిక్స్‌ ఓ వజ్రామే. అయితే ఇందులో ఓ సిక్సర్‌ని సింగిల్‌ హ్యాండ్‌తో కొట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన టిమ్ సౌతీ బౌలింగ్‌లో ఈ సిక్స్ కొట్టడం విశేషం.

పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌లో 9వ ఓవర్‌లో సైతీ వేసిన స్లో లెంగ్త్‌ డెలవరీని ఫకర్‌ స్టాండ్స్‌లోకి పంపాడు. సింగిల్‌ హ్యాండ్‌తో స్లాగ్-స్వీప్ ఆడాడు. షాట్‌ మిస్‌ టైమ్‌ ఐనట్టు అనిపించినా బౌండరీ రోప్‌ను మాత్రం దాటింది. ఈ మ్యాచ్‌లో 61 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఫకర్ వరల్డ్‌కప్‌ హిస్టరీలో పాకిస్థాన్‌ నుంచి వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అటు కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఫకర్‌ అద్భుతమైన ఆటగాడని లెక్కలు చెబుతున్నాయి. గత బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లోనూ హాఫ్‌ సెంచరీతో మెరిశాడు ఈ స్టార్‌ ఓపెనర్.


Also Read: ఫకర్‌ దెబ్బకు కివీస్‌ ఫసక్‌.. ఆసక్తికరంగా మారిన సెమీస్‌ రేస్!

Advertisment
Advertisment
తాజా కథనాలు