/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rohit-sharma-2-jpg.webp)
ICC WORLD CUP 2023: అభిమానుల అతి కొన్నిసార్లు అనర్థాలకు దారితీస్తుంది. క్రికెటర్లు చాలా హూందాగా.. స్పోరిటివ్‌గా ఉంటారు కానీ ఫ్యాన్స్ అలానే ఉండరు కదా.. కొంతమంది ఫ్యాన్స్ మంచిగానే నడుచుకుంటారు.. ఇంకొంతమంది మాత్రం అడ్డదిడ్డంగా అడుగులేస్తుంటారు. ఇండియా ఓడిపోతే ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను దూషించడం, వారి భార్యలను కూడా టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టడం.. ఇంకొందమంది అయితే ఏకంగా పసిపిల్లలను కూడా తిడుతూ, అసభ్యంగా వాగుతుంటారు. ఇక ఇవేవీ కాకుండా మరికొందరు ఉంటారు. వారే ఫేక్‌గాళ్లు. అవును..! ప్రపంచంలో ఏం జరిగినా వారికేమీ పట్టదు.. వాళ్లకి నచ్చింది జరగకపోతే ఫేక్స్ క్రియేట్ చేసి పైశాచిక ఆనందం పొందుతుంటారు. ఫేక్స్ క్రియేట్ చేస్తూ వాటిని స్ప్రెడ్ చేస్తూ సోషల్‌మీడియాలో జల్సాలు చేస్తుంటారు. వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత ఈ బ్యాచ్ మళ్లీ రంగంలోకి దిగింది.
What a catch by Travis head 👏🏼 #WCFINAL pic.twitter.com/4wGY0Ldr7m
— حیدریم قلندرم مستم 🇵🇸 (@OhNineO9) November 19, 2023
రోహిత్ శర్మ నాటౌటా?
వరల్డ్‌కప్ ఫైనల్‌లో మ్యాచ్‌ను మలుపు తిప్పింది ట్రావిస్ హెడ్. బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ సత్తా చూపించాడు. రోహిత్ శర్మ(Rohit Sharma) 47 పరుగుల వద్ద ఔటైన తర్వాత ఇండియా ఏ దశలోనూ భారీ స్కోరు వైపు కదలలేకపోయింది. మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో రోహిత్ శర్మ క్యాచ్‌ను హెడ్ కళ్లుచెదిరే రీతిలో అందుకున్నాడు. బ్యాక్‌కి రన్నింగ్ చేస్తూ హెడ్(Head) అద్భుతమే చేశాడు. రోహిత్ ఔటైన తర్వాత వెంటనే శ్రేయస్ అయ్యర్ ఔట్ అవ్వడం.. ఇక ఆ తర్వాత రాహుల్ స్లోగా బ్యాటింగ్ చేయడం.. ఇండియా 240 పరుగులకే సరిపెట్టుకోవడంతో ఆసీస్ విజయం ఈజీ అయ్యింది. అయితే హెడ్ క్యాచ్ చీటింగ్ అంటూ సోషల్‌మీడియాలో కొన్ని ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి.
అది ఔటే:
ఎవరు క్రియేట్ చేశారో తెలియదు కానీ.. క్యాచ్ చేసినప్పుడు హెడ్ తన చేతిని నేలకు టచ్ చేశాడని ఒక ఫొటోని హైలేట్ చేస్తూ పలువురు పోస్టులు పెడుతున్నారు. అయితే ఇదంతా ఫేక్. వీడియోలో హెడ్ స్పష్టంగానే క్యాచ్ చేసినట్లు తేలింది. ఈ రిప్లైని స్క్రీన్‌పై కూడా ఎక్కువసార్లే చూపించారు. ఇక ఇదే సమయంలో సోషల్‌మీడియా ప్రచారానికి పూర్తి విరుద్ధంగా నిజం బయటపడింది. ట్రావిస్ హెడ్ క్యాచ్‌తో సహా నిజమైన ఫుటేజీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అధికారికంగా తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది.
CLICK HERE TO WATCH REAL FOOTAGE OF HEAD CATCH
Also Read: ద్రవిడ్ వెళ్ళిపోతున్నాడు.. తరువాతి కోచ్ అతనేనా?
WATCH: