ICC World Cup: క్రికెట్ వరల్డ్ కప్ హిస్టరీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ వీరే.. సచిన్ ప్లేస్ ఎంతంటే..

ఐసిసి వరల్డ్ కప్ టోర్నమెంట్ పండుగకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఆయా దేశాలు తమ ప్లేయర్స్, టీమ్స్‌ని ప్రకటించేశాయి. ప్రపంచ కప్ కొట్టేందుకు ప్లేయర్స్ సైతం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు.

New Update
ICC World Cup: క్రికెట్ వరల్డ్ కప్ హిస్టరీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ వీరే.. సచిన్ ప్లేస్ ఎంతంటే..

ICC World Cup 2023: ఐసిసి వరల్డ్ కప్ టోర్నమెంట్ పండుగకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఆయా దేశాలు తమ ప్లేయర్స్, టీమ్స్‌ని ప్రకటించేశాయి. ప్రపంచ కప్ కొట్టేందుకు ప్లేయర్స్ సైతం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. ప్రపంచ కప్ వేదికపై తమ సత్తాని చాటేందుకు ఆయా దేశాల టీమ్స్ సంసిద్ధమయ్యాయి. అయితే, ప్రపంచ కప్‌లో ఆటగాళ్లు తాము నిలకడగా రాణించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన కీలక ప్లేయర్స్ గురించి ఇవాళ మనం తెలుసుకుందాం..

1) సచిన్ టెండూల్కర్ (భారతదేశం)

భారత బ్యాటింగ్ మాస్ట్రో సచిన్ టెండూలర్కర్.. వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యా్ట్స్‌మెన్‌గా నిలిచారు. 45 మ్యాచ్‌లు, 44 ఇన్నింగ్స్‌లలో.. 56.95 సగటుతో, 88.98 స్ట్రైక్ రేట్‌తో 2,278 పరుగులు చేశాడు. తన వరల్డ్ కప్ కెరీర్‌లో 6 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు చేశాడు. టోర్నీలో అత్యుత్తమ స్కోరు 152. సచిన్ ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు కూడా చేశాడు. టోర్నమెంట్ 1996, 2003 ఎడిషన్లలో వరుసగా 523 పరుగులు, 673 పరుగులతో అత్యధిక పరుగులు చేశాడు. 2003లో టెండూల్కర్ చేసిన 673 పరుగులే టోర్నీలో ఒక ఎడిషన్‌లో ఒక బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు.

2) రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)

ఆస్ట్రేలియన్ సూపర్ ప్లేయర్, మాజీ కెప్టెన్, ప్రపంచ కప్ విజేత రికీ పాంటింగ్ 46 ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడాడు. 45.86 సగటుతో 1,743 పరుగులు చేశాడు. 79 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. రికీ పాంటింగ్ తన వరల్డ్ కప్ కెరీర్‌లో 42 ఇన్నింగ్స్‌లలో 5 సెంచరీలు, 6 అర్ధశతకాలు సాధించాడు. 2003 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్‌పై 140* పరుగుల అత్యుత్తమ స్కోరు నమోదు చేశాడు.

3) కుమార సంగక్కర (శ్రీలంక)

దిగ్గజ శ్రీలంక వికెట్ కీపర్ కుమార సంగక్కర.. తన అద్భుతమైన బ్యాటింగ్ శైలితో, కవర్ డ్రైవ్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది క్రికెట్ల ప్రేమికుల హృదయాలను గెలుచుకున్నా. 37 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో సంగక్కర 56.74 సగటుతో, 86.55 స్ట్రైక్ రేట్‌తో 1,532 పరుగులు చేశాడు. సంగక్కర తన వరల్డ్ కప్ కెరీర్‌లో 5 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలను చేశారు. అత్యుత్తమ స్కోరు 124.

4) బ్రియాన్ లారా (వెస్టిండీస్)

'ది ప్రిన్స్ ఆఫ్ ట్రినిడాడ్' గా గుర్తింపు పొందిన లారా.. వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో కొంత వ్యక్తిగత కీర్తిని పొందాడు. 34 WC మ్యాచ్‌లలో 42.24 సగటుతో 86 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌ కలిగి ఉన్నాడు. మొత్తం 1,225 పరుగులు చేశాడు. లారా 33 ఇన్నింగ్స్‌లలో 2 సెంచరీలు, 7 అర్ధశతకాలు సాధించాడు. అత్యుత్తమ స్కోరు 116. 5

5. ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)

2007 ప్రపంచ కప్‌లో అరంగేట్రం చేసినప్పటి నుండి.. 'మిస్టర్ 360' తన అదిరిపోయే బ్యాటింగ్ స్టైల్‌తో తదుపరి మూడు ఎడిషన్‌లకు ప్రపంచ కప్‌లో నిప్పులు చెరిగారు. ఈ గ్లోబల్ ఈవెంట్‌లో 23 మ్యాచ్‌లలో డివిలియర్స్ 117 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 63.52 సగటుతో 1,207 పరుగులు చేశాడు. డివిలియర్స్ అత్యుత్తమ స్కోరు 162*. డివిలియర్స్ తన వరల్డ్ కప్ కెరీర్‌లో 4 సెంచరీలు, 6 అర్ధసెంచరీలు సాధించాడు.

6) క్రిస్ గేల్ (వెస్టిండీస్)

'యూనివర్స్ బాస్' క్రికెట్ అభిమానులను ఓ రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేస్తాడు. స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులను, టీవీల ముందు మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు అస్సలు బోర్ కొట్టనివ్వడు. ప్రపంచ కప్ కెరీర్‌లో 35 మ్యాచ్‌లు, 34 ఇన్నింగ్స్‌లలో గేల్ 35.93 సగటుతో, 90.53 స్ట్రైక్ రేట్‌తో 1,186 పరుగులు చేశాడు. 2 సెంచరీలు, 6 అర్ధశతకాలు సాధించాడు. అత్యుత్తమ స్కోరు 215, ఇది మొదటి ప్రపంచ కప్ డబుల్ సెంచరీ.

7) సనత్ జయసూర్య (శ్రీలంక)

హార్డ్-హిట్టింగ్ శ్రీలంక ఆల్ రౌండర్ 1996 ప్రపంచ కప్ గెలిచిన లంక లయన్స్ జట్టులో స్టార్ ప్లేయర్. 38 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో, జయసూర్య 34.26 సగటుతో, 90.66 స్ట్రైక్ రేట్‌తో 1,165 పరుగులు చేశాడు. 37 ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు, 6 అర్ధశతకాలు సాధించాడు. అత్యుత్తమ స్కోరు 120.

8) జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా)

ఇతర ప్రసిద్ధ ఆటగాళ్ల మాదిరిగానే, దిగ్గజ దక్షిణాఫ్రికా ఆల్-రౌండర్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 36 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో 32 ఇన్నింగ్స్‌లలో 45.92 సగటుతో, 74.40 స్ట్రైక్ రేట్‌తో 1,148 పరుగులు చేశాడు. వరల్డ్ కప్ కెరీర్‌లో 128* అత్యుత్తమ స్కోరుతో ఒక సెంచరీ మరియు 9 అర్ధసెంచరీలు కూడా చేశాడు.

9) షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)

బంగ్లాదేశ్‌కు వరల్డ్ కప్‌లో అత్యుత్తమ ట్రాక్ రికార్డ్ లేనప్పటికీ.. షకీబ్, జట్టు స్టార్ ఆల్ రౌండర్ టాప్ టెన్ స్కోరర్‌లలో ఒకడు. 29 WC మ్యాచ్‌లలో 45.84 సగటుతో, 82 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 1,146 పరుగులు చేశాడు. 29 ఇన్నింగ్స్‌లలో 2 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు సాధించాడు. అత్యుత్తమ స్కోరు 124*. అతని 2019లో షకీబ్ 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలతో 606 పరుగులు చేశాడు. ఇది టోర్నమెంట్ చరిత్రలో అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్‌లలో ఒకటి.

10) తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక)

డాషింగ్ శ్రీలంక ఓపెనర్ 2007 నుండి 2015 వరకు మూడు ప్రపంచ కప్‌లలో ఆడాడు. వరల్డ్ టోర్నమెంట్‌లలో 27 మ్యాచ్‌లు ఆడిన దిల్షాన్.. 52.95 సగటుతో 1,112 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 92 కంటే ఎక్కువగా ఉంది. దిల్షాన్ తన వరల్డ్ కప్ కెరీర్‌లో 4 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 25 ఇన్నింగ్స్‌లలో, అత్యుత్తమ స్కోరు 161*. దిల్షాన్ 2011 ప్రపంచ కప్‌లో తొమ్మిది మ్యాచ్‌లలో 500 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 2 అర్ధసెంచరీలతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Also Read:

Hyderabad CWC Meeting: ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న మోదీ ప్రభుత్వం.. కేంద్రంపై చిదంబరం ఫైర్..

Telangana Liberation day: రజాకార్లపై పోరాటానికి ముందు పాక్‌ ప్రధానికి నెహ్రు టెలిగ్రామ్‌.. నిజాం పీడ వదిలిన రోజు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Akshaya Tritiya Gold Offers : అక్షయ తృతీయ లో బంగారం కొంటున్నారా? ఇవికో మీకోసం ఆఫర్లే ఆఫర్లు

అక్షయ తృతీయ అనగానే మనకు గుర్తుకు వచ్చేది బంగారం కొనుగోళ్లు. ఈ రోజు బంగారం కొంటే సిరిసంపదలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. అందుకే ఎంతో కొంత పసిడిని కొనుగోలు చేస్తారు. వినియోగదారుల ఆసక్తిని గుర్తించి పలు సంస్థలు బంగారం కొనుగోళ్లలో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

New Update
Akshaya Tritiya

Akshaya Tritiya

Akshaya Tritiya Gold Offers : అక్షయ తృతీయ అనగానే మనకు గుర్తుకు వచ్చేది బంగారం కొనుగోళ్లు. ఈ పండుగ రోజు బంగారం కొంటే సిరిసంపదలు వస్తాయని చాలా మంది విశ్వసిస్తుంటారు. అందుకే కచ్చితంగా ఎంతో కొంత పసిడిని కొనుగోలు చేస్తుంటారు. ఈ కారణంగానే ఆరోజు దేశవ్యాప్తంగా బంగారం దుకాణాలు కిటకిటలాడుతాయి.వినియోగదారుల ఆసక్తిని గుర్తించి పలు సంస్థలు బంగారం కొనుగోళ్లలో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

దీనికి తోడు ఫోన్‌ ఫే, పేటీఎం వంటి యాప్స్‌ కూడా ఆఫర్లను ప్రవేశపెట్టాయి.ఫోన్ పేలో 24 క్యారెట్ల బంగారం కొంటే క్యాష్ బ్యాక్, క్యారట్ లేన్ స్టోర్లలో రీడీమ్ చేసుకుంటే డిస్కౌంట్లు పొందవచ్చు. పేటీఎంలో గోల్డెన్ రష్ ఆఫర్ కింద రివార్డ్ పాయింట్లు గెలుచుకోవచ్చు. అంతేకాదు, లీడర్‌బోర్డ్‌లో టాప్ ప్లేస్ లో ఉంటే 100 గ్రాముల పూల్ నుంచి బంగారం గెలుచుకునే అవకాశం కూడా ఉంది. 

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!


అసలే డిజిటల్‌ యుగం అందులోనూ షాపింగ్‌ చేసేంత సమయం లేని ఒత్తిడి. అందుకే  డిజిటల్ యుగంలో ట్రెండ్ మారింది. మొబైల్ ఫోన్ ఉంటే చాలు. దానినుంచే బంగారాన్ని కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. ఇక అక్షయ తృతీయ సందర్బంగా ఏప్రిల్ 30న వినియోగదారులను ఆకర్షించేందుకు ఫోన్ పే, పేటీఎం వంటి యాప్స్ అదిరిపోయే క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్లను కూడా ప్రకటించాయి. ప్రోత్సహకాలు కూడా అందిస్తున్నాయి.

 ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

ఫోన్ పే ఆఫర్లు

ఏప్రిల్ 30న అక్షయ తృతీయ రోజు ఫోన్ పే లో 24 క్యారెట్ల బంగారాన్ని కొనుగోలు చేస్తే 1 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అయితే వినియోగదారులు కనీసం రూ. 2,000 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలు చేయాలి. గరిష్టంగా రూ. 2,000 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చని సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30న మాత్రమే ఉంటుంది. ఒక్క లావాదేవీకి మాత్రమే క్యాష్ బ్యాక్ లభిస్తుంది. SIP ఆధారిత కొనుగోళ్లకు ఆఫర్ లేదు. ఏప్రిల్ 30న రాత్రి 11:59 గంటల వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

ఇక ఫోన్ పే కస్టమర్లు తమ గోల్డ్ ను క్యారట్ లేన్ స్టోర్లు లేదా వెబ్ సైట్లో రీడీమ్ చేస్తే ఈ కింది డిస్కౌంట్లు లభిస్తాయి.గోల్డ్ కాయిన్‌లపై 2 శాతం డిస్కౌంట్, అన్‌ స్టడెడ్ జ్యువెలరీపై 3 శాతం డిస్కౌంట్
స్టడెడ్ జ్యువెలరీపై 5 శాతం డిస్కౌంట్ కాగా, ఫోన్ పే లో ఎస్ఐపీ ద్వారా కనీసం రూ. 5 తో కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

పేటీఎం ఆఫర్లు


డిజిటల్ గోల్డ్ సేవింగ్స్‌ను ప్రోత్సహించడానికి పేటీఎం 'గోల్డెన్ రష్' క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్లో భాగంగా, పేటీఎం గోల్డ్ లో రూ. 500 లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే వినియోగదారులు లావాదేవీ విలువలో 5 శాతాన్ని రివార్డ్ పాయింట్లుగా పొందుతారు. ఇవి వారిని ఒక లీడర్‌బోర్డ్‌లో నిలుపుతాయి. లీడర్‌బోర్డ్‌లో టాప్ యూజర్లు మొత్తం 100 గ్రాముల గోల్డ్ ప్రైజ్ పూల్ నుంచి పసిడి గెలుచుకోవచ్చు. కాగా, పేటీఎం లో ఎస్ఐపీ ద్వారా రూ. 9 తో కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.  

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

వీటికి తోడు పలు బంగారు షాపులు సైతం ఆఫర్లు ప్రకటించాయి.లక్షకు చేరువలో పుత్తడి కదలాడుతుండటంతో కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ఆభరణ విక్రయ సంస్థలు అన్ని విధాలుగా ప్రయత్నాలను ప్రారంభించాయి. ఈ నెల 30న అక్షయ తృతీయ ఉండటంతో రిటైల్‌ దిగ్గజాలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. తనిష్క్‌, మలబార్‌ గోల్డ్‌, రిలయన్స్‌, క్యారట్‌లైన్‌, కల్యాణ్‌జ్యూవెల్లర్స్‌ వంటి దిగ్గజాలు ఈ ఆఫర్ల పట్టికలో ఉన్నాయి.

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

కల్యాణ్‌ జ్యూవెల్లర్స్‌..

అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్‌ జ్యూవెల్లరీ తయారీపై విధించే చార్జీలను 50 శాతం వరకు కోత పెట్టింది. ఇందుకోసం అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే మొత్తం కొనుగోలులో నాలుగోవంతు ముందస్తుగానే చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

తనిష్క్‌ అభరణాలు

టాటా గ్రూపునకు చెందిన ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్‌..అక్షయ తృతీయ సందర్భంగా ఆభరణాలపై ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 30 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్‌ కింద గోల్డ్‌ లేదా డైమండ్‌ ఆభరణాల తయారీపై చార్జీలను 20 శాతం వరకు తగ్గింపు కల్పిస్తున్నది.

రిలయన్స్‌ జ్యూవెల్స్‌..

రిలయన్స్‌ జ్యూవెల్స్‌ కూడా ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. బంగా రు ఆభరణాల తయారీపై 25 శాతం వరకు తగ్గింపు కల్పించిన సంస్థ..డైమండ్‌ జ్యూవెల్లరీపై 30 శాతం తగ్గింపునిచ్చింది. దీంతోపాటు పాత గోల్డ్‌పై 100 శాతం ఎక్సేంజ్‌ కూడా అందిస్తున్నది. ఈ ఆఫర్‌ వచ్చే నెల 5 వరకు అందుబాటులో ఉండనున్నది.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

క్యారట్‌లేన్‌ 

కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి క్యారెట్‌లైన్‌ ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. రూ.15 వేల నుంచి రూ.30 వేల లోపు బంగారాన్ని కొనుగోలు చేసిన వారికి 10 గ్రాముల వెండి నాణేన్ని, రూ.30 వేల నుంచి రూ.60 వేల లోపు బంగారంపై అరగ్రాము బంగారం నాణేన్ని, రూ.60 వేల నుంచి రూ.90 వేల లోపు కొనుగోళ్లపై అరగ్రాము గోల్డ్‌ కాయిన్‌ అందిస్తున్నట్టు ప్రకటించింది.

మలబార్‌ గోల్డ్‌..


మలబార్‌ గోల్డ్‌ కూడా గోల్డ్‌, డైమండ్ల ఆభరణాల తయారీపై విధించే చార్జీలను 25 శాతం వరకు డిస్కౌంట్‌ను ఇస్తున్నది.

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు