Dog..IAS Officer: కుక్క కోసం ఉద్యోగం పోగొట్టుకున్న ఐఏఎస్ అధికారిణి! ఢిల్లీలో ఓ ఐఏఎస్ అధికారిణి..తన పెంపుడు కుక్కను వాకింగ్ చేయించేందుకు మైదానంలోని క్రీడాకారులందరినీ బయటకు పంపించేసింది. ఆమె పేరు రింకూ దుగ్గా. ఆమె తన పెంపుడు కుక్కను త్యాగరాజ్ స్టేడియంలో వాకింగ్ కు తీసుకుని వెళ్లారు. ఆ సమయంలో ఆమె వెంట ఆమె భర్త కూడా ఉన్నారు. By Bhavana 28 Sep 2023 in నేషనల్ New Update షేర్ చేయండి ప్రస్తుత కాలంలో సమాజంలో హోదాలో ఉన్నాం కదా అని ఎలా పడితే అలా ప్రవర్తిస్తే కుదరదు అన్న విషయాన్ని మరిచిపోయినట్లున్నారు ఓ ఐఏఎస్ (IAS)అధికారిణి. ఆమె చేసిన ఓ పని వల్ల ఏకంగా ఆమె ఉద్యోగాన్నే కోల్పోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో ఓ ఐఏఎస్ అధికారిణి..తన పెంపుడు కుక్కను వాకింగ్ చేయించేందుకు మైదానంలోని క్రీడాకారులందరినీ బయటకు పంపించేసింది. ఆమె పేరు రింకూ దుగ్గా. ఆమె తన పెంపుడు కుక్కను త్యాగరాజ్ స్టేడియంలో వాకింగ్ కు తీసుకుని వెళ్లారు. ఆ సమయంలో ఆమె వెంట ఆమె భర్త కూడా ఉన్నారు. కుక్కతో వాకింగ్ చేయించేందుకు గానూ మైదానంలో ఉన్న క్రీడాకారులను ముందుగానే గ్రౌండ్ నుంచి పంపి వేశారు. ఎప్పుడైనా కానీ స్టేడియం సాయంత్రం ఏడు గంటల వరకు క్రీడాకారులకు అందుబాటులో ఉంటుంది. అయితే రింకూ మాత్రం తన అధికార బలాన్ని ఉపయోగించి గ్రౌండ్ మొత్తాన్ని కూడా ఖాళీ చేయించింది. ఆ తరువాత దంపతలిద్దరూ కలిసి కుక్కతో గ్రౌండ్ అంతా వాకింగ్ చేశారు. ఇలా తమ వ్యక్తిగత అవసరాల కోసం పబ్లిక్ ప్లేస్ ను ఉపయోగించడం పెద్ద దుమారాన్ని రేపింది. దీని గురించి మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆమెను వెంటనే రాజీనామా చేయాలని తెలిపింది. దీంతో ఆమె రాజీనామా చేయక తప్పలేదు. ప్రభుత్వ అధికారుల ప్రాథమిక నిబంధనలు, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం రింకూ మాత్రమే కాదు ఆమె భర్త సంజీవ్ ఖిర్వార్ కూడా బాధ్యత గల పదవిలోనే ఉన్నారు. ఆయన ప్రస్తుతం లద్దాఖ్ లో విధులు నిర్వహిస్తున్నారు. #delhi #dog #ias-officer #job-lost మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి