America vs China Tariff War : అమెరికా, చైనా మధ్య సుంకాల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెకాకు చైనా మరో షాక్ ఇచ్చింది.అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ నుంచి విమానాలను ఖరీదు చేయవద్దు అని తమ ఎయిర్లైన్స్ సంస్థలకు చైనా ఆదేశాలిచ్చింది. రెండు దేశాల మధ్య వాణిజ్య అగాధం ఏర్పడడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విదేశీ వస్తువులపై అధిక స్థాయిలో సుంకాలు వసూల్ చేస్తున్న విషయం తెలిసిందే. చైనా దిగుమతులపై సుమారు 145 శాతం సుంకాలు వసూలు చేసేందుకు ట్రంప్ సర్కారు నిర్ణయించింది.
Also Read : నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!
అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని డ్రాగన్ దేశం తీవ్రంగా ఆక్షేపించింది. అగ్రరాజ్యం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు చైనా పేర్కొన్నది. దీంతో ప్రతీకారంగా అమెరికా వస్తువులపై 125 శాతం సుంకాన్ని వసూలు చేసేందుకు నిర్ణయించింది. అమెరికా కంపెనీ నుంచి విమాన పరికరాలు, విడిభాగాల కొనుగోలును నిలిపివేయాలని ఎయిర్‌లైన్స్ సంస్థలకు చైనా ఆదేశాలు జారీ చేసింది. దిగుమతి వస్తువులపై సుంకాలు పెరగడం వల్ల.. విమాన పరికాల ధర మరింత పెరిగినట్లు చైనా భావిస్తున్నది.
Also Read : HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!
అమెరికా వస్తువులపై 125 సుంకాలను విధిస్తూ ఇటీవల ఓ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఆ దేశం నుంచి విమానాల విడిభాగాలను దిగుమతి చేసుకోవద్దని పలు సంస్థలకు సూచించింది. ఈ నిర్ణయంతో బోయింగ్ విమానాల నిర్వహణ కూడా చైనా సంస్థలకు భారంగా మారనుంది. అదే సమయంలో ఇప్పటికే బోయింగ్ నుంచి విమానాలను లీజుకు తీసుకొని నిర్వహిస్తున్న సంస్థలను ఆదుకొనే దిశగా చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.
ఇది కూడా చదవండి: క్లీన్ షేవ్, గడ్డం.. చర్మానికి ఏది మంచిదో తెలుసా?
చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం దెబ్బకు బోయింగ్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇప్పటికే ఆ సంస్థ గత కొన్నేళ్లుగా తీవ్ర నష్టాల్లో కొనసాగుతోంది. ఆ సంస్థకు చైనా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. రానున్న 20 ఏళ్లలో ప్రపంచ విమానాల మార్కెట్‌లో 20శాతం వాటా చైనాదే అన్న అంచనాలున్నాయి. ఒక్క 2018లోనే 25శాతం బోయింగ్ విమానాలను బీజింగ్ సంస్థలు కొనుగోలు చేశాయి. కానీ, వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా గత కొన్నేళ్లుగా చైనా నుంచి ఎటువంటి కొత్త ఆర్డర్లు బోయింగ్‌కు లభించలేదు.దీంతో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య జరుగుతోన్న ట్రేడ్ వార్ ఎక్కడివరకు వెళ్తుందోనన్న ఆందోళన నెలకొంది. ట్రంప్ టారిఫ్‌లపై చైనా ప్రతిఘటించడంతో అమెరికాలో ఇతర దేశాల వస్తువులతో పోలిస్తే.. చైనా దిగుమతి వస్తువుల రేట్లు చాలా ఎక్కువగా ఉండనున్నాయి. ప్రతిఘటించని దేశాలకు 90 రోజుల విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే.
Also Read : సీఎం రేవంత్ కు తప్పిన పెను ప్రమాదం
Also Read : రాజాసింగ్ కు సీఎం రేవంత్ లేఖ.. ఎందుకో తెలుసా?