Telangana: ఆ మాటను నేను ఎప్పటికీ ఒప్పుకోను.. సాయిచంద్ భార్య భావోద్వేగం.. తన గానం, తన గాత్రం, తన వాగ్ధాటితో తెలంగాణ ఉద్యమాన్ని మరింత రగిల్చిన ఉద్యమ కారుడు, కళాకారుడు సాయి చంద్ లేరనే వార్తను ఇప్పటికీ తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. అలాంటి ఆయనే లోకంగా, ఆయనే సమస్తంగా భావించి జీవించిన ఆయన కుటుంబం ఎలా మర్చిపోతుంది. అందుకే ఆయన జీవించే ఉన్నారనే తాము భావిస్తున్నామంటున్నారు సాయిచంద్ భార్య రజిని. By Shiva.K 27 Sep 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana-State-Warehouse-Corporation Chairperson: తన గానం, తన గాత్రం, తన వాగ్ధాటితో తెలంగాణ(Telangana) ఉద్యమాన్ని మరింత రగిల్చిన ఉద్యమ కారుడు, కళాకారుడు సాయి చంద్ లేరనే వార్తను ఇప్పటికీ తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. అలాంటి ఆయనే లోకంగా, ఆయనే సమస్తంగా భావించి జీవించిన ఆయన కుటుంబం ఎలా మర్చిపోతుంది. అందుకే ఆయన జీవించే ఉన్నారనే తాము భావిస్తున్నామంటున్నారు సాయిచంద్ భార్య రజిని. తాజాగా ఆర్టీవీతో మాట్లాడిన తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ చైర్‌పర్సన్ రజినీ.. తన భర్త, దివంగత నేత సాయిచంద్ గురించి కీలక వివరాలు తెలిపారు. 'సాయిచంద్ లేడు అనే మాట ఎప్పటికీ ఒప్పుకోను.. తను ఒక సోల్జర్ మాదిరిగా బోర్డర్‌లో ఉండి సంవత్సరానికి, రెండు సంవత్సరాలకు ఒకసారి తిరిగి వస్తాడు అనే ఆలోచనలోనే నేను ప్రస్తుతం జీవిస్తున్నాను. నా పిల్లలకి కూడా అదే చెబుతున్నాను. వారి ముందు నేను స్ట్రాంగ్‌గా ఉంటేనే వారు కూడా బాధపడకుండా ఉంటారు. అందుకే నేను స్ట్రాంగ్ ఉమెన్‌గా ఉంటాను.' అని చెప్పారు సాయి చంద్ భార్య రజని. 'సాయి చంద్ బాధ్యతలు ఏవైతే నాకు ఇచ్చారో వాటిని తప్పక నిలబెడతాను. ఎందుకంటే నేను తనతో 20 సంవత్సరాలు ప్రయాణం చేశాను. ఆ 20 సంవత్సరాలలో సాయిచంద్ కి ఒకటే లక్ష్యం ఉండేది. నా చుట్టూ ఉన్నవారికి ఏ ఆపద రాకుండా.. నేను వారికి అండగా ఉండాలి. వారికి సహాయం చేయాలి. ఇదే సాయిచంద్ లక్ష్యం. ఆయన లక్ష్యాన్ని ఆయన భార్యగా నేను నిలబడెతాను. సాహిత్యం పుట్టినరోజు సందర్భంగా సాహిత్యం చారిటబుల్ ట్రస్ట్ ని ఇటీవలు ఓపెన్ చేశాం. ఆ ట్రస్టు ద్వారా సహాయం చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం. తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ చైర్మన్‌గా నేను నా బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తూ.. పదవిని కాపాడుకుంటాను.' అని చెప్పుకొచ్చారు రజని. 'సాయిచంద్ మరణించారు అన్న వార్తను వినగానే నాకసలు ఏమీ అర్థం కాలేదు. నాతో ఎవరేం మాట్లాడారో అర్థం కాలేదు. నేను ఎవరితో ఏం మాట్లాడానో కూడా నాకు గుర్తులేదు. ఒక 15 రోజుల వరకు నాకసలు ఏమీ అర్థం కాలేదు. ఇంకా సాయిచంద్ లేరు అన్నది మాత్రం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. ఇప్పటికీ కూడా నాలోని పాత రజిని చచ్చిపోయింది. ఎప్పుడైతే సాయిచంద్ మరణించారో ఆ క్షణం నుంచి నేను ఇప్పటివరకు కూడా ఇంకా ఎప్పటికీ కూడా మానో స్థైర్యాన్ని కోల్పోలేదు. ఏది ఏమైనా గానీ నేను స్ట్రాంగ్ గా ఉంటాను. నా పిల్లల భవిష్యత్తు కోసం స్ట్రాంగ్ ఉమెన్ గా నా జీవితంలో పోరాడుతాను' చెప్పారు రజిని. Also Read: Minister Harish Rao: త్వరలోనే తెలంగాణ ప్రజలకు శుభవార్త.. కీలక వివరాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు AP Assembly Updates: కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. కీలక బిల్లులకు ఆమోదం! Breaking: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా #telangana-news #telangana #sai-chand మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి