Hydra: అన్ని జిల్లాలకు హైడ్రా.. ఆక్రమణలపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్! తెలంగాణలోని అన్ని జిల్లాల్లో హైడ్రా తరహా వ్వవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. త్వరలోనే చెరువుల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కబ్జాలపై ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై యాక్షన్ తీసుకుంటామన్నారు. By srinivas 03 Sep 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth: తెలంగాణలోని అన్ని జిల్లాల్లో హైడ్రా తరహా వ్వవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. జిల్లా్లనుంచి హైడ్రా తరహా చర్యలు చేపట్టాలనే డిమాండ్స్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే జిల్లాల్లోనూ ఇలాంటి సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలివ్వగా.. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల ఆక్రమణల మీద సీఎం రేవంత్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆక్రమణలకు సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా వరంగల్ మీద స్పెషల్ ఫోకస్ పెడతామని మహబూబాబాద్ సమీక్షలో స్పష్టం చేశారు. SPECIAL DRIVE చెరువుల ఆక్రమణలు క్షమించరాని నేరం. చెరువు ల ఆక్రమణలపైన రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్. అన్ని జిల్లాలో చెరువులు, నాలాల ఆక్రమణల జాబితా సిద్దం చేయాలి. హైడ్రా తరహా లో జిల్లా ల్లో కలెక్టర్లు ఒక వ్యవస్థ ను ఏర్పాటు చేసుకోవాలి. చెరువుల ఆక్రమణలో ఎంతటి వారున్నా… pic.twitter.com/E1XEo967kX — Bolgam Srinivas (@BolgamReports) September 3, 2024 పది సంవత్సరాల్లో భారీ ఆక్రమణలు.. నాలాల ఆక్రమణను ఊపేక్షించేది లేదని, గత పది సంవత్సరాల్లో ఆక్రమణలు బాగా జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని రేవంత్ చెప్పారు. ఖమ్మంలో మాజీ మంత్రి భారీగా ఆక్రమణలకు పాల్పడ్డారని, కాలువలు ఆక్రమించుకున్నాడని స్థానికులు చెప్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ మేరకు వాస్తవాలను పరిశీలించి కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, రెవెన్యు మంత్రికి ఆదేశాలు జారీ చేశారు. కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని త్వరలోనే ఆ కూల్చివేతలు చేపడతామని, పువ్వాడ అజయ్ ఆక్రమణలను తొలగించాలని హరీష్ రావు డిమాండ్ చేస్తారా అని ప్రశ్నించారు. 680 మందికి పునరావాసం.. 28 సెంటిమీటర్ల వర్షం కురిసినప్పటికీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. అయినా ప్రాణ నష్టం జరగడం బాధాకరం. జిల్లాలో 4గురు చనిపోయారు. అందులో ఇద్దరు ఈ జిల్లా వాసులు, మరో ఇద్దరు ఖమ్మం జిల్లా వాసులు. మహబూబాబాద్ జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 680 మందికి పునరావాసం కల్పించాం. సీతారామతండాలో వరద సమయంలో ప్రజలకు అండగా నిలబడ్డ ఎస్సై నగేష్ కి అభినందనలు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తాం. ఆకేరు వాగు వరద బారిన పడుతున్న 3 తండాలను ఒకే ప్రాంతానికి తరలించి అదర్శ కాలనీ నిర్మించాలని కలెక్టర్ కు తెలిపాం. పంట నష్టం జరిగిన ప్రతి ఎకరానికి పదివేల సాయం చేస్తామన్నారు. రాష్ట్రానికి రావాలంటూ ప్రధానికి లేఖ.. జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానికి లేఖ రాసినట్లు రేవంత్ తెలిపారు. జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి రాష్ట్రానికి రావాలని ప్రధానమంత్రి ని కోరుతున్నాం. వరదతో చేరిన బురదను తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. దోమల నివారణ చర్యలు తీసుకోవాలి. నష్టం జరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఇతర ప్రాంతాల నుంచి అధికారులను రప్పించుకోవాలి. కూలిపోయిన విద్యుత్ లైన్లను తక్షణమే పునరుద్దరించాలి. వరద ప్రమాద ప్రాంతాలు, ప్రమాదానికి కారణాలు, వాటిని ఎదుర్కొన్న తీరుపై బుక్ ను తయారు చేసుకోవాలి. వాటిని కలెక్టరేట్లలో ఉంచాలి హైడ్రా తరహా లో జిల్లాలో ఒక వ్యవస్థను కలెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలి. చెరువులను ఆక్రమించుకోవడం క్షమించరాని నేరం అని రేవంత్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్.. చెరువుల ఆక్రమణలపైన రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపడతామని సీఎం చెప్పారు. చెరువుల ఆక్రమణలో ఎంతటి వారున్నా వదిలి పెట్టమని, చెరువుల ఆక్రమణకు సహకరించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. చెరువులు, నాలాల ఆక్రమణల జాబితా సిద్దం చేయాలన్నారు. మాజీ మంత్రి ఆక్రమణ వల్లనే ఖమ్మంలో వరదలు వచ్చాయనే ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిపారు. ఆక్రమణల తొలగింపునకు పక్కా ప్రణాళిక ఉందని, అమెరికాలో జల్సాలో మునిగి తేలుతున్న ఆయన ప్రభుత్వంపైన విమర్శలు చేస్తున్నడంటూ కేటీఆర్ పై మండిపడ్డారు. ఇక వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా హరీష్ రావు ఖమ్మం పర్యటనకు పోయిండు. ఖమ్మం మాజీ మంత్రి ఆక్రమణలపైన తొలగింపునకు హరీష్ రావు సహకరిస్తారా? వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ పదేళ్లలో ఎప్పుడైనా పరామర్శకు వచ్చారా? మాసాయిపేటలో పసిపిల్లలు చనిపోతే కేసీఆర్ పరామర్శించలేదు. హైదరాబాద్ శివారులో పశు వైద్యురాలను హత్యచేస్తే వెళ్లి చూడలేదు. మానవత్వం లేని మనిషి కేసీఆర్. ప్రతిపక్ష నేత ఎక్కడున్నాడు? ఎందుకు మాట్లాడటం లేదు? స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు వరద బాధితులకు సాయం కోసం ముందుకు రావాలని కోరారు. #cm-revant #hydra #telangana-all-district మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి