USA: అమెరికాలో హైదరాబాదీ మృతి..

ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన చికాగో మిస్సౌరీ ప్రాంతంలో జరిగింది. ఇతని మృతదేహాన్ని హైదరాబాద్‌కు పంపించేందుకు భారత రాయబార కార్యాలయం ప్రయత్నాలు చేస్తోంది.

New Update
USA: అమెరికాలో హైదరాబాదీ మృతి..

హైదరాబాద్ కు చెందిన కిరణ్ కుమార్ రాజ్ చికాగో మిస్సౌరీ ప్రాంతంలో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. మిస్సౌరీలోని సెయింట్ లూయిస్‌లో యువకుడు గల్లంతు ఘటనలో తెలంగాణకు చెందిన విద్యార్థి కిరణ్ కుమార్ రాజు శ్రీనాథరాజు (20) ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను చికాగోలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. కిరణ్ స్వస్థలం ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండలంలోని చిన్నకోరుకొండి అని తెలుస్తోంది.

అయితే ఈ మరణంపై మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కిరణ్ కుమార్ ఎలా చనిపోయారు.. నది ద్గరగకు అతనొక్కరే వెళ్ళారా...ఎవరూ ఎందుకు కాపాడలేకపోయారు అన్న వివరాలు తెలియలేదు. వీటిపై భారత రాయబార కార్యాలయం వివరాలను సేకరిస్తోంది. అంతేకాదు కిరణ్ మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు ఏర్పట్లు కూడా చేస్తోంది.

Also Read:Telangana: చంద్రబాబు లెటర్ పై సీఎం రేవంత్ రెడ్డి సానుకూల స్పందన

Advertisment
Advertisment
Advertisment