Hyderabad : అమెరికాలో హైదరాబాద్‌ యువకుడు మృతి!

హైదరాబాద్‌ కాటేదాన్‌ కు చెందిన ఓ యువకుడు అమెరికాలోని చికాగోలో మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన అక్షిత్‌రెడ్డి (26) ఉన్నత చదువుల కోసం 3 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లాడు. గత శనివారం స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లిన అక్షిత్‌ నీట మునిగి చనిపోయాడు.

New Update
Hyderabad : అమెరికాలో హైదరాబాద్‌ యువకుడు మృతి!

Hyderabad Youth Dies In USA : హైదరాబాద్‌ (Hyderabad) కాటేదాన్‌ కు చెందిన ఓ యువకుడు అమెరికా (America) లోని చికాగోలో ఈతకు వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటన 21 వ తేదీనే జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుని మృతదేహం 27 వ తేదీ నగరానికి చేరుకోవడంతో ఆదివారం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన గోపాల్ రెడ్డి, సమంత దంపతులు సుమారు 25 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని కాటేదాన్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. వారికి ముగ్గురు సంతానం. వారిలో ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు కాగా కుమారుడు అక్షిత్‌రెడ్డిని (26) ఉన్నత చదువుల కోసం 3 సంవత్సరాల క్రితం అమెరికా పంపించారు. షికాగోలో ఎమ్మెస్ పూర్తి చేసిన అక్షిత్‌ అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే హైదరాబాద్‌ లో తల్లిదండ్రులు అక్షిత్‌ కు పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే, గత శనివారం అక్షిత్‌రెడ్డి తన ఇద్దరు స్నేహితులతో కలిసి లేక్‌ మిశిగన్‌‌లో సరదాగా ఈతకు వెళ్లాడు. ఒకరు ఒడ్డునే ఉండిపోగా మిగతా ఇద్దరూ నీటిలోకి దిగి చెరువు మధ్యలో ఉన్న రాయి వరకూ వెళ్లారు. అక్కడి నుంచి తిరిగొచ్చే క్రమంలో అక్షిత్‌రెడ్డి అలసిపోయి నీట ముగిపోయాడు. అతడి స్నేహితుడు కూడా నీట మునిగిపోగా స్థానికులు కాపాడారు. ఈ క్రమంలో పోలీసులు అక్షిత్‌రెడ్డి మృతదేహాన్ని వెలికి తీశారు. శనివారం అతడి మృతదేహం హైదరాబాద్‌కు చేరుకోగా ఆదివారం అడ్డాకులలో అంత్యక్రియలు నిర్వహించారు.

Also read: ఒలింపిక్స్ లో భారత రోవర్‌ బల్‌రాజ్‌ సంచలనం!


Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మియాపూర్‌లో దారుణం.. మద్యం మత్తులో భార్య, అత్తను ఏం చేశాడంటే?

హైదరాబాద్‌ మియాపూర్‌లో మద్యం మత్తులో మహేష్ భార్య, అత్తను దారుణంగా కత్తితో దాడి చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేష్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మహేష్ భార్య, అత్తపై దాడి చేశాడు.

New Update
attack

Miyapur

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో భార్య, అత్తను దారుణంగా కత్తితో దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మియాపూర్‌లోని జనప్రియ నగర్‌లో ఉంటున్న మహేష్, శ్రీదేవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మహేష్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే వీరి మధ్య గత కొంత కాలం నుంచి గొడవలు వస్తున్నాయి. ఈ క్రమంలో మద్యంలో మత్తులో మహేష్ భార్య, అత్తపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అయితే ప్రస్తుతం భార్య శ్రీదేవి ఆరోగ్యం నిలకడగా ఉందని, శ్రీదేవి తల్లి మెడపై తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి: Holiday Culture: హాలీడే కల్చర్‌ తో ఉత్పాదకత తగ్గిపోతుందన్న సీఈవో..మండిపడుతున్న నెటిజన్ల

కనికరం లేకుండా చంపేసి..

ఇదిలా ఉండగా.. మెదక్‌లో మరో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య అత్యంత దారుణంగా హతమార్చింది. కూతురితో కలిసి కనికరంలేకుండా చంపేసి కాటికి పంపించారు. వొద్దని తండ్రి వేడుకుంటున్నా ఏ మాత్రం జాలిచూపకుండా అదిమిపట్టి గొంతు పిసికి చంపేశారు. ఆ తర్వాత ఆరోగ్యం బాగోలేదని నమ్మించే ప్రయత్నం చేశారు.

ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..

కానీ గ్రామస్థులు రంగంలోకి దిగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడగా అమానుషమైన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నామాపూర్‌ లో ఆదివారం ఈ ఘటన జరిగింది.  గొల్ల జోగయ్య (51) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 

ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్‌!

కొంతకాలంగా మద్యానికి బానిసైన జోగయ్య.. రోజూ తాగొచ్చి ఇంట్లో గొడవపడేవాడు. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అలాగే తాగిన జోగయ్య.. గట్టిగా మందలిస్తే భార్య, బిడ్డను కొట్టేవాడు. దీంతో విసుగు చెందిన భార్య నాగమ్మ తన ఇంట్లో చిన్న కూతురి సహాయంతో జోగయ్యను చంపేసింది. మద్యం మత్తులో ఉన్న జోగయ్య కూతురు అతని కాళ్లు పట్టుకోగా నాగమ్మ మెడకు చీర బిగించి ఊపిరాడకుండా చేసి చంపేసింది. 

Advertisment
Advertisment
Advertisment