AP: హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు లైన్ క్లియర్! ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు మోక్షం లభించింది. జాతీయ రహదారి విస్తరణకు పనులకు ఉన్న అడ్డంకులు తొలగనున్నాయి. హైవేపై టోల్ వసూలు బాధ్యత నుంచి జీఎమ్మార్ సంస్థ మరికొద్ది కాలంలో వైదొలగనుంది By Bhavana 27 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Ap: ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు మోక్షం లభించింది. జాతీయ రహదారి విస్తరణకు పనులకు ఉన్న అడ్డంకులు తొలగనున్నాయి. హైవేపై టోల్ వసూలు బాధ్యత నుంచి జీఎమ్మార్ సంస్థ మరికొద్ది కాలంలో వైదొలగనుంది. ఆ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, జీఎమ్మార్ మధ్య ఒప్పందం కుదిరింది. నూతన కాంట్రాక్టర్ ఎంపికయ్యే వరకు, జులై ఒకటి నుంచి ఎన్‌హెచ్‌ఐఏనే టోల్ వసూలు చేయనున్నట్లు సమాచారం. మొదట్లో రెండు వరుసల్లో ఉన్న హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని బీవోటీ పద్ధతిన విస్తరించడానికి 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. జీఎమ్మార్ సంస్థ రూ.1740 కోట్లకు టెండర్ వేసి, పనులను సొంతం చేసుకుంది. యాదాద్రి - భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు 181.50 కిలోమీటర్ల పొడవున రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించింది. 2012 డిసెంబరులో పనులను పూర్తి చేసి, తెలంగాణలో పంతంగి, కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలను నిర్వహిస్తోంది. 2025 జూన్‌తో టోల్ వసూళ్ల గడువు ముగుస్తోంది. అయితే, ఈలోపే జీఎమ్మార్ నుంచి హైవే నిర్వహణను తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించడం గమనార్హం. Also read: నటుడు పృథ్వీ పై వరకట్న వేధింపుల కేసు కొట్టివేత! #vijayawada #hyderabad #highway మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి