Tea Prices: హైదరాబాద్‌లో సామాన్యుడు 'టీ' తాగలేడా? ధరలు ఎంత పెంచారో తెలుసా.? హైదరాబాద్‌లో 'టీ' ధరలు సామాన్యుడికి మంట పెడుతున్నాయి. చిన్నచిన్న షాపుల్లోనూ కనీసం రూ.20 లేనిదే 'టీ' దొరకని పరిస్థితి దాపరించింది. కరోనా తర్వాత షాపుల్లో టీ ధరలు 3 నుంచి 4 రెట్లు పెరిగినట్లు సామాన్యులు వాపోతున్నారు. By Trinath 21 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Hyderbad Tea Prices: జగిత్యాల జిల్లా కుస్తాపూర్ విలేజ్‌కు చెందిన అజయ్ హైదరాబాద్‌కు కొత్త.. జాబ్‌కు కొత్త.. బీటేక్ పూర్తి చేసి ఈ మధ్యే ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు.. మార్నింగ్ నుంచి అదే పనిగా కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేస్తున్నాడు. అతను వర్క్ చేసే ఆఫీస్‌లో ఛాయ్(టీ, కాఫీ) అందుబాటులోనే ఉంటుంది. అయితే వర్క్ మధ్యలో ఒక 15 మినిట్ గ్యాప్ ఇచ్చి కొలిగ్స్‌తో బయటకు వెళ్లి టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అజయ్‌ను కూడా తన కొలిగ్స్ అలానే ఛాయ్ తాగి వద్దాం అని వెంటబెట్టుకొని వెళ్లారు. ఆఫీస్ దగ్గర చిన్న టీ షాప్ ఉంది. అక్కడంతా 'టీ' తాగారు. అందులో ఒకరు బిల్ కట్టాడు. కొలిగ్స్‌లో కొంతమంది పక్కనున్న బడ్డి కొట్టులో సిగరేట్ తాగాతుండగా.. అజయ్‌కి ఆ బ్యాడ్ హ్యాబిట్ లేకపోవడంతో టీ షాప్‌లో మెను చూశాడు. అజయ్‌కు మైండ్ బ్లాక్ అయ్యింది. ఒక చిన్న కప్పు టీ 20 రూపాయలని ఉంది. ఇక బెల్లం టీ, అల్లం టీ, వంకయ్ టీ అని ఏవో వివిధ రకాలు ఉన్నాయి. అవి 30 రూపాయలకంటే ఎక్కువే ఉన్నాయి. అజయ్‌కి వెంటనే తన అన్నయ్య గుర్తొచ్చాడు. కరోనాకు ముందు అలా.. తర్వాత ఇలా: అజయ్ రావడానికి ఆరేళ్ల క్రితమే అతని అన్నయ్య సుమంత్ హైదరాబాద్‌కు వచ్చాడు. అతనికి సినిమాలంటే పిచ్చి. సినీ ఇండస్ట్రీలోకి ఎలాగైనా వెళ్లాలని హైదరాబాద్ వచ్చాడు. వారికి పేద కుటుంబం కావడంతో కృష్ణనగర్‌లోని తన ఫ్రెండ్స్‌తో ఓ ఇరుక గదిలో ఉండేవాడు. కొన్నిసార్లు తినడానికి ఏమీ లేక టీ తాగి, ఒక బన్ను ముక్కతో కడుపునింపుకోని నిద్రపోయేవారిమని సుమాంత్ ఎన్నోసార్లు అజయ్‌కు చెప్పాడు. నిజానికి ఇదే విషయాన్ని పలువురు సినీ ప్రముఖులు సైతం అనేక సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు. అంటే టీ, బన్ను అన్నది ఎంతోమంది ఆకలిని తీర్చే ఫుడ్. వాటితోనే కడుపు నింపుకొనే రోజులు ఉండేవి. ఇప్పుడా రోజులు లేవు.. కరోనా తర్వాత టీ, కాఫీ ధరలు అమాంతం పెరిగాయి. 3-4 రెట్లు పెరిగిన ధరలు హైదరాబాద్‌లో కరోనాకు ముందు ఒక కప్పు టీ రూ.5 నుంచి రూ.10 వరకు ఉండేది. ఇప్పుడా ధర రూ.20కు చేరింది. కొన్ని చోట్ల రూ.25కు అమ్ముతున్నారు. చిన్నచిన్న షాపుల్లో సైతం కనీసం15రూపాయలు జేబులో ఉంటే కానీ టీ తాగలేని దుస్థితి. ఇది లక్షలు సంపాదించేవారికి చిన్న విషయంలా అనిపించినా.. 'టీ'తోనే కడుపునింపుకొనే ఎంతో మందికి ఇది భారమే. ఇదే విషయాలను ఆలోచిస్తూ అలా ఉండిపోయాడు అజయ్. ఇంతలోనే సిగరేట్ బ్యాచ్ పొగను ఊదడం ఆపేశారు. ఆ కంపుకు ఈ లోకంలోకి వచ్చి అజయ్ మళ్లీ ఆఫీస్‌కు వెళ్లి తన పనిలో నిమగ్నమయ్యాడు. అజయ్ ఆలోచించింది ముమ్మాటికి నిజమే. టీ సామాన్యులకు భారం అవ్వడం నిజంగా బాధాకరం. Also Read: ‘మోదీ శని టీమిండియాకు తగిలింది..’ రాహుల్ గాంధీ సెటైర్‌తో సభలో నవ్వులు..! WATCH: #viral-news #tea-prices #rates-hike మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి