Drugs in Hyderabad: పబ్బుల్లో డ్రగ్స్.. తొలిసారి స్నిపర్ డాగ్స్, క్లూస్ టీంతో పోలీసుల ఎటాక్.. ఏం దొరికాయంటే?

ప్రభుత్వ ఆదేశాలతో డ్రగ్స్ కు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. వీకెండ్ వేళ ఆదివారం రాత్రి పలు పబ్ ల్లో సోదాలు చేశారు. తొలిసారిగా స్నిపర్ డాగ్స్, క్లూస్ టీమ్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు.

New Update
Drugs in Hyderabad: పబ్బుల్లో డ్రగ్స్.. తొలిసారి స్నిపర్ డాగ్స్, క్లూస్ టీంతో పోలీసుల ఎటాక్.. ఏం దొరికాయంటే?

Telangana Police Checked Pubs for Drugs: డ్రగ్స్ వాడకం, సరఫరాపై ఉక్కుపాదం మోపుతామన్న ప్రభుత్వ ప్రకటన మేరకు పోలీస్ లు యాక్షన్ ప్లాన్ చేపట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) లోని పలు పబ్బుల్లో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిందన్న వార్తలు కొద్ది రోజులుగా వినిపిస్తున్న నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం రాత్రి పలు పబ్బుల్లో ఆకస్మికంగ తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లోని పలు పబ్బులపై ఏక కాలంలో దాడులు నిర్వహించారు హైదరాబాద్ పోలీసులు. మొదటిసారిగా పబ్బుల్లో స్నిపర్ డాగ్స్ (Sniffer Dogs) తో తనిఖీలు చేసి సంచలనం సృష్టించారు.
ఇది కూడా చదవండి: Bigg Boss Finals: బిగ్‌బాస్‌ ఫైనలిస్ట్ అభిమానుల రచ్చ.. కొట్టుకున్న అభిమానులు.. పగిలిన బస్సు అద్దాలు

తద్వారా డ్రక్స్ నియంత్రణపై తాము ఎంత సీరియస్ గా ఉన్నామనే విషయాన్ని స్పష్టం చేశారు. న్యూఇయర్ వేడుకలు మరో పది రోజుల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు నిర్వహించిన ఈ దాడులు పబ్ నిర్వాహకులకు చెమటలు పట్టించాయని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10, 36, 45 లోని పబ్బులలో దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దాడులకు సంబంధించిన వివరాలను జూబ్లీహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిధిలోని సుమారు 17కుపైగా పబ్ లలో సోదాలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ సోదాల్లో తమకు పబ్ లలో ఎలాంటి డ్రగ్స్, ఇతర అనుమానాస్పద ప్రదార్థాలు లభించలేదని వివరించారు. మొదటి సారి స్నిపర్ డాగ్స్, క్లూస్ టీంతో తనిఖీలు చేసినట్లు చెప్పారు. భవిష్యత్ లోనూ ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయన్నారు. డ్రగ్స్ అమ్మకాలు జరిపేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు