JNTUHలో భారీ జాబ్ మేళా.. 100 కంపెనీల్లో 10000+ జాబ్స్.. టెన్త్ నుంచి ఎంటెక్ వారికి.. జేఎన్టీయూ హైదరాబాద్ లో ఈ నెల 10, 11 తేదీల్లో భారీ జాబ్ మేళా జరగనుంది. 100కు పైగా కంపెనీల్లో 10 వేల ఉద్యోగాల భర్తీకి ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. టెన్త్, ఆపై అన్ని రకాల విద్యార్హతలు కలిగిన వారు ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చు. By Nikhil 07 Aug 2024 in తెలంగాణ ట్రెండింగ్ New Update షేర్ చేయండి నిరుద్యోగులకు జేఎన్టీయూ హైదరాబాద్ శుభవార్త చెప్పింది. ఈ నెల 10, 11 తేదీల్లో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళాలో 100కు పైగా కంపెనీలు పాల్గొనున్నాయి. ఈ కంపెనీల్లో పది వేలకు పైగా ఉద్యోగాలకు ఈ జాబ్ మేళా ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇది కూడా చదవండి: Telangana: గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు ఆన్ లైన్ క్లాసులు – టీ-సాట్ ఆధ్వర్యంలో నిర్వహణ అర్హతలు: టెన్త్, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, బీటెక్/ఎంటెక్, డిగ్రీ, పీజీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చని జేఎన్టీయూ తెలిపింది. 2016 నుంచి 2024 వరకు పాసైన వారందరికీ అవకాశాలు ఉంటాయని ప్రకటనలో పేర్కొంది. విభాగాలు: ఈ జాబ్ మేళాలో IT, ITES, మేనేజ్మెంట్, ఫార్మా, కోర్, బ్యాంకింగ్, FMCG, రిటైల్ రంగాలకు సంబంధించిన ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. జాబ్ మేళా నిర్వహించు చిరునామా: జేఎన్టీయూ, కూకట్ పల్లి, హైదరాబాద్ Note: ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ లింక్: https://www.bharatudyog.org/jsaf #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి