Dengue Encephalitis: భయపెడుతున్న డెంగీ మెదడువాపు.. జాగ్రత్తగా లేకపోతే అంతే సంగతి..! డెంగీ మెదడువాపుతో హైదరాబాద్‌లో గోపి అనే జూనియర్ డాక్టర్ చనిపోవడం కలవర పెడుతోంది. డెంగీ వైరస్ మెదడు వరకు చేరితే దాన్నే ఎన్సెఫాలిటిస్ అంటారు. కొన్నేళ్లుగా ఈ కేసులు సంఖ్య లేదు..కానీ తాజాగా జీడిమెట్లలోని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో రెండు కేసులు నమోదయ్యాయి. By Trinath 01 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి దోమ.. చూడడానికి చిన్నదేనైనా అవి తీసుకొచ్చే, మోసుకొచ్చే రోగాలు అన్నీఇన్నీ కావు. నిజానికి హైదరాబాద్‌లో వర్షాలు కురవడం మొదలు పెట్టిన మరుక్షణం నుంచే డెంగీ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతుంది. ఆస్పత్రులన్నీ జనంతో కిక్కిరిసిపోయి ఉంటాయి. బెడ్లు కూడా ఖాళీ ఉండని పరిస్థితులుంటాయి. అయితే ఈ సారి గతంతో పోల్చితే డెంగీ(Dengue) కేసులు అంతగా నమోదుకాలేదు. అయితే సీజన్ ముగిసిన తర్వాత కేసులు రికార్డవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అందులోనూ ఈ సారి డెంగీ మెదడువాపు కేసులు రిజిస్టర్ అవ్వడం.. ఒక డాక్టర్ ఈ వ్యాధికి మృతి చెందడం కలవర పెడుతోంది. ఏంటీ డెంగీ మెదడువాపు? డెంగీ ఎన్సెఫాలిటిస్(మెదడువాపు) ఏడెస్ దోమల కాటు ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. ఇది కూడా డెంగీనే.. కానీ డెంగీ వైరస్ మెదడుకు చేరుకుంటే డెంగీ ఎన్సెఫాలిటిస్ అంటారు. తీవ్రమైన తలనొప్పి, గందరగోళం, మూర్ఛతో పాటు నాడీకి సంబంధించి ఏదైనా తీవ్రమైన సమస్య వస్తుంది. ఈ వైరస్ బెయిన్‌లోకి వెళ్లిన కాసేపటికే మెదడులోని ప్రధాన భాగాలు వాచిపోతాయి. అందుకే డెంగీ మెదడువాపుకు తక్షణ చికిత్స అవసరం. ఆలస్యం చేస్తే ప్రాణాలు పోతాయి. డెంగీతో పాటు ఇలాంటి తీవ్రమైన లక్షణాలను ఎదుర్కొంటుంటే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. సకాలంలో వైద్య చికిత్సతో బతికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. హైదరాబాద్‌లో డాక్టర్ మృతి: నిజానికి కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఒక్క మెదడువాపు కేసు కూడా నమోదు కాలేదు. తాజాగా జీడిమెట్లలోని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో రెండు కేసులు నమోదయ్యాయి. మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతున్న జూనియర్ డాక్టర్ గోపి డెంగీ మెదడువాపుతో మరణించాడు. మరో 16ఏళ్ల టీనేజర్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కోలుకున్నట్లు సమాచారం. ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు వైద్యాధికారులు మాత్రం డెంగీ మెదడువాపు కేసులు తమ దృష్టికి రాలేదని చెబుతున్నారు. తీవ్రమైన డెంగీ కేసులు ఒక్క శాతం మాత్రమే రికార్డువుతున్నాయంటున్నారు. అటు తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాస్ దీనిపై స్పందించారు. డెంగీ వైరస్‌లో ఎలాంటి మార్పులు రాలేదన్నారు. చాలా ఏళ్లుగా డెంగీ మెదడువాపు కేసులు కనిపించలేదన్నారు శ్రీనివాస్‌రావు. అయితే కొన్ని తీవ్రమైన కేసులు నమోదైన విషయం నిజమేనన్నారు. దీనికి 'లాంగ్ కోవిడ్' కూడా కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. Also Read: Healthy Teeth Tips: ఇలా చేస్తే మౌత్‌వాష్‌లు అస్సలు అక్కర్లేదు - Rtvlive.com #hyderabad #dengue #dengue-encephalitis మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి