Dengue Fever: హైదరాబాద్ ప్రజలకు GHMC అలర్ట్.. డెంగీ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచన!

హైదరాబాద్ లో భారీగా డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక ప్రకటన చేసింది. ఒళ్ళు నొప్పులు, దురద, తలనొప్పి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలని తెలిపింది. ఇంకా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని.. దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలని సూచించింది.

New Update
Dengue Fever: హైదరాబాద్ ప్రజలకు GHMC అలర్ట్.. డెంగీ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచన!

Dengue Fever: హైదరాబాద్ ప్రజలకు GHMC అధికారులు డెంగీపై పలు సూచనలు చేస్తున్నారు. డెంగీ జ్వరం రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమైన విషయం తెలిసింది. ఈ కాలంలో డెంగీ జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఈ జ్వరం అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే.. మంచి ఆరోగ్యకరమైన ఆహారం కూడా తీసుకోవాలంటోపాటు.. ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ జ్వరం నుంచి కాపాడుకోవచ్చని వారు అంటున్నారు. అంతేకాకుండా ఇంటి పరిసరాలలో కొన్ని శుభ్రతలు కూడా పాటించాలని హెచ్చరిస్తున్నారు. డెంగీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాం.

డెంగీ జ్వరం లక్షణాలు:

డెంగీ జ్వరం వచ్చే ముందు ఒళ్ళు నొప్పులు, దురద, తలనొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించి.. సమయానికి మందులు వేసుకుంటే ఈ జ్వరాన్ని రాకుండా  అదుపు చేయవచ్చు.

తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు:

  • ఇంట్లో పాత్రలు, కుండల్లో నీరు చేరకుండా చూసుకోవాలి.దీనివల్ల దోమల ఎక్కువగా వస్తాయి బట్టి తగిన చర్యలు తీసుకోవాలి.
  • దోమల అభివృద్ధి చెందకుండా ఉంటే డెంగీ జ్వరం రాదు.
  • చిన్నారులు, వృద్దులు చెడు పరిసరాలకు వెళ్లకుండా ఉండాలి. ఈ విషయాలపై అప్రమత్తంగా ఉంటే డెంగీ జ్వరాని తగ్గించుకోవచ్చని డాక్టర్లతోపాటు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఈ 7 టిప్స్ పాటిస్తే మీ ఆఫీస్ లో మీరే కింగ్.. అవేంటో ఓ లుక్కేయండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు