Elections : ఓటేసేందుకు సొంతూళ్లకు చేరుకుంటున్న నగరవాసులు

తెలంగాణ, ఏపీలో మే 13న ఎన్నికల జరగనున్న వేళ నగరవాసులు ఓటేసేందుకు సొంతూళ్లకు బయలుదేరారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో.. బస్టాండ్, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక బస్సలు, రైళ్లకు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేశారు అధికారులు.

New Update
Elections : ఓటేసేందుకు సొంతూళ్లకు చేరుకుంటున్న నగరవాసులు

Home Town : తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రాల్లో మే 13న ఎన్నికల(Elections) జరగనున్న వేళ నగరవాసులు ఓటేసేందుకు తమ సొంతూళ్లకు బయలుదేరారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో.. బస్టాండ్(Bus Stand), రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. నగరవాసులు ఒక్కసారిగా తరలిరావడంతో.. బస్సులు, రైళ్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. ఇప్పటికే టీఎస్‌ఆర్టీసీ.. తెలంగాణ, ఏపీకి అదనంగా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఇక విజయవాడ రహదారిపై ఓటేసేందుకు వెళ్తున్న వాహనాలతో రద్దీ నెలకొంది. అర్ధరాత్రి ఎల్బీ నగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొన్ని కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది.

Also Read: నేడు తెలంగాణకు ప్రియాంకా గాంధీ.. షెడ్యూల్ ఇదే..!

ప్రయాణికులు సొంతుళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల వేళ దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణ మధ్య నడిచే రైళ్లకు 22 రైళ్లకు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేసి నడిపిస్తోంది. మే 10 నుంచి 14వరకు అదనపు కోచ్‌ సేవలు అందించనుంది. మరోవైపు ప్రయాణికుల రద్దీతో ప్రైవేట్ టావెల్స్ నిర్వాహకులు రెట్టింపు ధరలతో దోచుకుంటున్నారు. హైదరాబాద్‌లో దాదాపు 10 లక్షల మంది తెలంగాణ, ఏపీ ఓటర్లు ఉన్నారు.

Also Read: ప్రభాస్ అభిమానులు ఈ పార్టీ వైపే ఉన్నారు.. అందుకోసమే రంగంలోకి దిగాను..!

Advertisment
Advertisment
తాజా కథనాలు