Health News: పండ్లు తింటున్నారా? అయితే మీ లైఫ్‌ రిస్కులో పడినట్టే.. ఎలాగంటే?

మార్కెట్‌లో విక్రయించే పండ్లలో 30శాతం కంటే ఎక్కువ ఫ్రుట్స్‌కు పురుగుమందులు వాడుతున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. క్యాన్సర్, ఆస్తమా లాంటి వ్యాధుల కేసుల పెరుగుదలకు పండ్లపై మితిమీరి వాడే రసాయనాలే కారణమని తెలుస్తోంది. అందుకే హైబ్రిడ్ పండ్ల వాడకాన్ని తగ్గించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

New Update
Health News: పండ్లు తింటున్నారా? అయితే మీ లైఫ్‌ రిస్కులో పడినట్టే.. ఎలాగంటే?

Health News: కూరగాయలు, పండ్లను ఆరోగ్యకరంగా భావిస్తారు. సీజన్‌కు తగ్గట్టుగా మార్కెట్‌లో పండ్లు దొరుకుతాయి. చాలామంది రోజూ పండ్లను తింటారు. అయితే ఈ పండ్లతో హానికరమైన రసాయనాలను కడుపులో వెళ్తాయని పరిశోధనలో తేలింది. ఎంటమాలజీ శాస్త్రవేత్త, ఇందిరాగాంధీ అగ్రికల్చరల్ కాలేజ్, ఛత్తీస్‌గఢ్- గజేంద్ర చంద్రాకర్ చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.

పండ్లను తోట నుంచి నగరానికి తీసుకొచ్చి మార్కెట్‌లో విక్రయించాల్సి వస్తోంది. వాటిని మార్కెట్ లో నిల్వ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో పండ్ల జీవితకాలాన్ని పొడిగించడానికి, అవి త్వరగా చెడిపోకుండా నిరోధించడానికి డిడిటి, ఎథెరియల్, జిబ్రాలిక్ లాంటివి ఉపయోగిస్తుంటారు. ఇలా ప్రమాదకరమైన రసాయనాలతో నిల్వ ఉంచి మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తారు. ఇక పండ్లను పెంచడానికి ఉపయోగించే హానికరమైన రసాయనాలు చర్మ రుగ్మతలు, మధుమేహం, పిసిఒడి రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతాయి.

చిన్న వయసులోనే కళ్లద్దాలు రావడం, తక్కువ ఏకాగ్రత, అధిక ఒత్తిడి, ఆకలి లేకపోవడం, కళ్ళ చుట్టూ నల్లాటి వలయాలు, క్యాన్సర్, ఆస్తమా లాంటి వ్యాధులు ఈ రసాయానలతో వస్తాయి. పండ్లు ఎక్కువ కాలం ఉండేలా వాటికి ఇంజెక్షన్లు వేస్తారు. ద్రాక్షపై డైక్లోస్-26 అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. ద్రాక్ష మనుగడ సాగించడానికి డిడిటిని ఉపయోగిస్తారు.

ఇక మార్కెట్ లో విక్రయించే వందలాది పండ్లలో 30శాతం కంటే ఎక్కువ పురుగుమందులు ఉంటాయి. నిర్ణీత పరిమితికి మించి పురుగుమందుల వాడకం ప్రధాన వ్యాధులకు కారణం అవుతోంది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

  • పండ్లను తినడానికి ముందు కనీసం మూడు గంటలు నీటిలో ఉంచండి.
  • సీజనల్ ఫ్రూట్స్ తినడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
  • హైబ్రిడ్ పండ్ల వాడకాన్ని తగ్గించండి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: నిద్రలేమి బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ఇదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు