Crime News: ప్రేమ వివాహం.. భర్త చేతిలో భార్య బలి..!

New Update
Crime News: ప్రేమ వివాహం.. భర్త చేతిలో భార్య బలి..!

Husband Killed his Wife: భార్య భర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పేవారు పెద్దలు . ఎందుకంటే ముక్కు ముఖం తెలియని వారు పెళ్లి అనే బంధంతో ఒక్కటై కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. ఇక ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ కలకాలం కలిసి ఉంటారు. ఇలా శరీరాలు రెండు అయినా మనసు మాత్రం ఒకటే అనే విధంగా భార్యాభర్తల బంధం ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే పెద్దలు చెప్పింది నిజమే అని చాలామంది పెళ్లి చేసుకున్న వారు. అయితే, ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన పెళ్లి అనే మాట వినిపిస్తే చాలు ఉలిక్కి పడుతున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే మన సొసైటిలో జరుగుతున్న ఘటనలు అలాంటివి మరి.

తాజాగా, తిరుపతి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యను అతి దారుణంగా హత్య చేసాడు ఓ భర్త. బత్తలవల్లం హరిజన వాడకు చెందిన కాటయ్య, గత ఎనిమిది సంవత్సరాల క్రితం ఇరకం పావనీ(26) ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్ధరు చిన్న పిల్లలు ఉన్నారు. అయితే, భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవని స్ధానికులు చెబుతున్నారు. అయితే, ఏం గొడవ జరిగిందో ఏమో తెలియదు కానీ.. నేడు ఉదయం కాటయ్య తన భార్యను అతి కిరాతకంగా చంపాడు. భార్యను హతమార్చిన సంఘటనతో ఒక్కసారిగా  గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

వెంటనే  గ్రామస్తుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న సిఐ శివకుమార్ రెడ్డి, ఎస్ఐ నాగార్జున్ రెడ్డి హత్య జరిగిన ఇంటి పరిసరాలను పరిశీలించారు. నిందితుడు కాటయ్యను పోలీసుల అదుపులో తీసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం వివాహిత మృతదేహాన్ని సత్యవేడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సిఐ మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. భార్య భర్తల మధ్య సరైన సత్సంబంధాలు లేవని గ్రామస్తలు తెలిపిన నేపధ్యంలో హత్యకు గల కారణాలు, కారకులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap News: ఏపీలో 2 నెలల పాటూ చేపల వేటపై నిషేధం..

ఆంధ్రప్రదేశ్‌లో చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. ఇది 61 రోజుల పాటు కొనసాగుతుంది. మత్స్య సంపదను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో మర బోట్లు, ఇంజిన్ బోట్లు వేటకు వెళ్లకూడదు.

New Update
fishing

fishing

ఏపీలో గత అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 15 నుంచి జూన్ 15 వరకు అంటే సుమారు 61 రోజుల పాటు చేపల వేట నిషేధం అమల్లో ఉంటుంది. మత్స్య సంపదను కాపాడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రెండు నెలల పాటూ చేపల వేటపై నిషేధం విధిస్తారు. ఈ రెండు నెలల సమయంలో చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టి వాటి సంతాన్నాన్ని అభివృద్ది చేస్తాయి. అందుకే రెండు నెలల పాటు వేటను ఆపేస్తారు.. ఈ సమయంలో మర బోట్లు, ఇంజిన్ బోట్లు వేటకు వెళ్లరాదు. అయితే స్థానికంగా కర్ర తెప్పలకు మాత్రం అనుమతి ఉంటుంది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటారు.

Also Read:ap: హమ్మయ్యా ఆంధ్ర రొయ్య అమెరికాకు.. కాకపోతే..!

ఈ రెండు నెలల పాటూ అధికారులు మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించకుండా చూస్తారు. మత్స్యకారులు నిబంధనలు తప్పితే వారిపై కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు ప్రభుత్వ పథకాలకు కూడా దూరం అవుతారు. కాబట్టి మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏపీలో మత్స్యకారులు వేట నిషేధం సమయంలో ఉపాధి కోల్పోతున్నందుకు ప్రభుత్వం వారికి అండగా నిలిచింది. 

Also Read:Bangladesh: నిప్పుతో గేమ్స్‌ వద్దు.. యూనస్‌కు హసీనా వార్నింగ్

గతంలో చేపల వేట నిషేధం 40 రోజులు ఉంటే.. దానిని 60 రోజులకు పెంచారు. గతంలో చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు బియ్యం ఉచితంగా అందించేవారు. ఆ తర్వాత ఆ స్థానంలో మత్స్యకార భరోసా వచ్చింది. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. ఆ తర్వాత బియ్యానికి బదులు రూ.2 వేల చొప్పున సాయం అందించింది.. దానిని రూ.4 వేలుకు పెంచారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం మత్స్యకార భరోసాను రూ.10 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం.. తాము అధికారంలోకి వస్తే చేపల వేట నిషేధ సమయంలో ఒక్కో మత్స్యకారునికి రూ.20 వేల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపింది.

అందుకు తగిన విధంగా ఈ ఏడాది బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించారు.. ఈ నెల కానీ, మే నెలల ో కానీ మత్స్యకారులకు భరోసా అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే సర్వే నిర్వహించి లబ్ధిదారుల్ని గుర్తిస్తామని చెబుతున్నారు అధికారులు.

Also  Read: America-South Korea: అమెరికా పొమ్మంటుంది... దక్షిణ కొరియా రమ్మంటోంది!

Also Read: America Earth Quake: అమెరికా.. శాన్ డియాగోలో 5.1 తీవ్రతతో భూకంపం

fishing-boat | fishing | 2 months | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment