IceLand: ఐస్‌లాండ్‌లో వరుసగా బద్దలవుతున్న అగ్ని పర్వతాలు..ఎగజిమ్ముతున్న లావా

800 ఏళ్ళ తర్వాత అక్కడి అగ్ని పర్వతాలు ఒళ్ళు విరుచుకున్నాయి. బారీగా లావాను విరజిమ్ముతూ భయపెడుతున్నాయి. అక్కడ ప్రవహిస్తున్న లావాకు మొత్తం ఐస్ లాండే కరిగిపోతుందా అన్నట్టు ఉంది పరిస్థితి.

New Update
IceLand: ఐస్‌లాండ్‌లో వరుసగా బద్దలవుతున్న అగ్ని పర్వతాలు..ఎగజిమ్ముతున్న లావా

Volcano Erupted:ప్రకృతి సౌందర్యానికి ఆలవాలం ఐస్ లాండ్. ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ట ప్లేస్. తక్కువ జనాభా ఉండి..మంచు, అగ్నిపర్వాలతో చాలా అందంగా ఉంటుందీ దీవి. నార్తర్న్ లైట్స్‌ కూడా ఐస్ లాండ్ ప్రసిద్ధి. రాత్రి వేళల్లో ఇక్కడి ఆకాశంలో కనిపించే అద్భుతాలను చూడ్డానికి జనాలు ఎక్కెడెక్కడి నుంచే వస్తారు. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన పర్వతాలు, వేడి నీటి బుగ్గలు , లావెంటర్ తోటలు ప్రత్యేక ఆకర్షణ.

అయితే ఇవన్నీ ఇప్పుడు బుగ్గిపాలయి పోతున్నాయి. ఐస్ లాండ్లో వరుసగా అగ్ని పర్వతాలు బద్దలు అవ్వడంతో అక్కడి ప్రదేశాలన్నీ లావాలో మునిగితేలుతున్నాయి. 800 ఏళ్ళ క్రితం పేలిన సిలింగర్ ఫెల్ అనే అగ్నిపర్వతం ఇప్పుడు మళ్ళీ ఒళ్ళు విరుచుకోవడంతో...లావా ఎగజిమ్ముతోంది. ఈ లావా సమీప ప్రాంతాలన్నింటినీ ముంచేస్తోంది. గ్రిండ్‌వాక్‌కు ఉత్తరాన ఉన్న సిలింగర్‌ఫెల్‌ అగ్నిపర్వతం విస్ఫోటన కావడం వల్ల భారీగా లావా నింగిలోకి ఉప్పొంగింది.డిసెంబర్​ నుంచి ఇప్పటివరకు మూడుసార్లు అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దీంతో దగ్గర ఉన్న పల్లెలను, పట్టణాలను ఖాళీ చేయించారు అధికారులు. మొత్తం 3, 800 మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Also Read:జేఈఈ ఫైనల్ కీ విడుదల

ఈ ఏడాదిలో ఇది రెండవసారి...

సిలింగర్ ఫెల్ అగ్నిపర్వతం పేలడం ఇది రెండవసారి. ఈ ఏడాది మొదట్లో అంటే జనవరిలో ఇది ఒకసారి బద్ధలయ్యింది. ఇప్పుడు మళ్ళీ పగిలింది. ఈ అగ్ని పర్వతం నుంచి లావా భారీగా బయటకు రావడం ఇది ఆరవసారి. ప్రస్తుతం సుమారు 80 మీటర్ల (260 అడుగులు) ఎత్తు వరకు లావా ప్రజ్వరిల్లుతోంది. అయితే దీనివలన గ్రిండావిక్‌కు ఏం ప్రమాదం లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు.

ఆగిపోయిన టూరిజం...

సిలింగర్ ఫెల్ అగ్ని పర్వతం పేలడంతో అక్కడి జన జీవనం స్థంభించి పోయింది. ప్రస్తుతం అక్కడ శీతాకాలం నడుస్తోంది. పూర్తిగా మంచుతో కప్పబడి ఉంది. లావా విరజిమ్మడంతో పర్వతం దగ్గర ప్రాంతాల ప్రజలను ఇప్పటికే ఖాళీ చేయించారు. మరోవైపు లావా ఉప్పొంగి పలు పట్టణాలకు వెళ్లే వేడి నీటి పైప్ లైన్లను మొత్తం తగలెట్టేసింది. దీంతో చాలా పట్టనాలకు నీటి సరఫరా ఆగిపోయింది. వేడి నీరు లేకపోవడం వలన స్కూళ్ళు, జిమ్ములు, స్విమ్మింగ్ పూల్స్ అన్నీ మూసేశారు. దాంతో పాటూ డిసెంబర్ నుంచి ఇక్కడ అగ్ని పర్వతాలు వరుసగా బద్ధలు అవుతుండడంతో పర్యాటకం కూడా ఆగిపోయింది. పదేపదే లావా ఉప్పొంగుతుండడంతో టూరిస్టులను అనుమతించడం లేదు.

ఐస్ లాండ్ అంతం అవుతుందా...

ఇక్కడ వరుసగా అగ్ని పర్వతాలు పేలుతుండడం...అది కూడా 800 ఏళ్ళు స్థబ్దుగా ఉన్న పర్వతాలు కూడా మళ్ళీ యాక్టివ్ అవడం ఆందోళన కలిగిస్తోంది. వరుసగా మూడు నెలల నుంచి ఆగకుండా ఇలా అగ్ని పర్వతాలు బద్దలవ్వడం ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ఐస్ లాండ్ మొత్తం అంతం అవుతుందా అనే అనుమానాలను కలిగిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం శాస్త్రజ్ఞులు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఐస్ లాండ్‌లో అగ్ని పర్వతాల కింద ఉన్న భూమి ఒత్తిడికి గురవుతుందని...దీనివలన పర్వతాలు బద్దలు అవుతున్నాయని వారు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు