TS News: పాతబస్తీలో దారుణం.. నడిరోడ్డుపై చెట్టు కూలీ 12 మంది పాతబస్తీ శాలిబండ పోలీసు స్టేషన్ పరిధిలోని షంశీర్ గంజ్‌లో రోడ్డు పక్కనే ఉన్న ఓ భారీ వృక్షం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. By Vijaya Nimma 22 Jul 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad: పాతబస్తీ శాలిబండ పోలీసు స్టేషన్ పరిధిలోని షంశీర్ గంజ్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే ఉన్న ఓ భారీ వృక్షం కుప్పకూలింది. ఆ చెట్టు ప్రధాన రహదారిపై విరిగి పడింది. దీంతో ఆ చెట్టు కింద పలు వాహనాలు ఇరుక్కుపోయాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆలోపే స్థానికులు చెట్టు కొమ్మలను తొలగించి గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో మొత్తం 12 మందికి గాయపడినట్లు, పలు వాహనాలు ధ్వంసమైయ్యాయని పోలీసులు తెలిపారు. ప్రమాదం గురించి తెలుసుకున్న బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చెట్టు కూలడంతో షంశీర్ గంజ్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. రోడ్డుపై విరిగి పడ్డ భారీ చెట్టు.. 12 మందికి తీవ్ర గాయాలు హైదరాబాద్ - పాతబస్తీ శాలిబండ పిఎస్ పరిధి షంశీర్ గంజ్‌లో ఒక్కసారిగా భారీ చెట్టు కూలింది.. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న 12 మందికి తీవ్రంగా గాయాలవగా.. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. pic.twitter.com/TPtYRfOT21 — Telugu Scribe (@TeluguScribe) July 22, 2024 Also Read: అందమైన ముఖం కోసం ఈ కూరగాయను.. ఇలా వాడి చూడండి! #hyderabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి