Heat : బాబోయ్ ఏం ఎండలు రా ఇవి... తట్టుకోలేకపోతున్నాం..వడదెబ్బతో అల్లాడుతున్న ప్రజలు!

ఎండల వేడి తార స్థాయికి చేరడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు ఎండలు ఇలాగే తీవ్రంగా ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో చాలా చోట్ల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి

New Update
Heat Alert: దేశంలోని పలు ప్రాంతాల్లో 48 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..రెడ్‌ అలర్ట్ జారీ!

Telangana : తెలంగాణలో ఎండలు(Heat) రోజురోజుకి రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. పోయిన సంవత్సరం మే చివరి వారంలో నమోదు అయిన ఉష్ణోగ్రతలు(Temperatures)..ఈ ఏడాది మే మొదటి వారంలోనే నమోదు అవుతున్నాయి. సూర్యుడు రోజురోజుకి తన ప్రతాపాన్ని చూపించి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాడు. ఆదివారం జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 47.1 డిగ్రీ సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.

అంతేకాకుండా జగిత్యాల లోని కొన్ని ప్రాంతాల్లో 46.8, అల్లీపూర్‌ లో 46.7, కరీంనగర్‌ లో 46.7 ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ విభాగం తెలిపింది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదు అయినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఎండల వేడి తార స్థాయికి చేరడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు ఎండలు ఇలాగే తీవ్రంగా ఉంటాయని వాతావరణశాఖ(IMD) హెచ్చరించింది. దీంతో చాలా చోట్ల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో వడగాల్పులు కూడా తీవ్రంగా వీచే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.

అయితే రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ...పలుచోట్లు తేలిక పాటి నంఉచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణశాఖాధికారులు వివరించారు. మంగళ, బుధ, గురు వారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని అధికారులు వివరించారు.

దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉంటే ఆదివారం కాసిన ఎండవేడి తట్టుకోలేక రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలోని కామచెరువులో సుమారు రెండు టన్నుల చేపలు వడదెబ్బతో మృతి చెందాయి. దీంతో మత్స్యకారులు రోడ్డున పడి తీవ్రంగా నష్టపోయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన చేపలను రక్షిచుకునేందుకు బోరు మోటారు సహాయంతో చెరువులోకి నీటి వదులుతున్నారు.మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని, నష్ట పరిహారం అందిచాలని వేడుకుంటున్నారు.

Also read: ఆరోగ్య నిధి గుమ్మడి గింజలు..వీటిని ఎలా జాగ్రత్త చేసుకోవాలంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు