BREAKING: తెలంగాణలో భారీగా IPSల బదిలీలు

తెలంగాణలో భారీగా IPSల బదిలీలు జరిగాయి. దీనికి సంబంధించిన జీవోను  రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. టెక్నికల్‌ సర్వీసెస్‌ అదనపు డీజీగా వి.వి.శ్రీనివాసరావు, డీఐజీ కోఆర్డినేషన్‌గా గజారావు భూపాల్ ను నియమించింది.

New Update
BREAKING: తెలంగాణలో భారీగా IPSల బదిలీలు

IPS Transfers In Telangana: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీలు చేస్తోంది. తాజాగా తెలంగాణలో భారీగా IPSల బదిలీలు జరిగాయి. తెలంగాణలో మరో 23 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది రాష్ట్ర సర్కార్. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

ALSO READ: మా తప్పు అదే.. అందుకే ఓడిపోయాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

* సాంకేతిక సర్వీసుల అదనపు డీజీపీగా వీవీ శ్రీనివాసరావును నియమించింది. పోలీసుల నియామక బోర్డు చైర్మన్‌గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది.
* ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ డీఐజీగా రెమా రాజేశ్వరి
* మల్టీజోన్‌-7 డీసీపీగా జోయల్‌ డెవిస్‌
* సౌత్‌ ఈస్ట​ జోన్‌ డీసీపీగాజానకీ దరావత్‌
* నిర్మల్‌ ఎస్పీగా జానకీ షర్మిల
* రామగుండం సీపీగా ఎల్‌ఎస్‌ చౌహాన్‌
* మల్కాజ్ గిరి డీసీపీగా పద్మజ
* నిర్మల్‌ ఎస్పీగా జానకీ షర్మీల
* ఖమ్మం సీపీగా సునీల్‌ దత్‌
* సీఐడీ ఎస్పీగా రాజేంద్ర ప్రసాద్‌
* ట్రాన్స్‌కో ఎస్పీగా ఉదయ్‌ కుమార్‌ రెడ్డి
* ఆదిలాబాద్‌ ఎస్పీగా గౌష ఆలం
* మాదాపూర్‌ సీడీపీగా వినిత్‌
* ములుగు ఎస్పీగా శబరీష్‌
* మేడ్చల్‌ డీసీపీగా నితికాపంత్‌
* సిద్దిపేట ఎస్పీగా బీ అనురాధ
* ఎల్బీనగర్‌ డీసీపీగా ప్రవీణ్‌కుమార్‌

IPS బదిలీల జీవో కాపీ..

Advertisment
Advertisment
తాజా కథనాలు