ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మరణించినట్లు అధికారులు తెలిపారు.పురంగెల్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
Breaking: ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మరణించినట్లు అధికారులు తెలిపారు. పురంగెల్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించారు.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, తిరుపతి మీదుగా తమిళనాడులో వెల్లూరు వరకు రైల్వేలైన్‌లో మరో అదనపు రైల్వేలైన్‌కు శ్రీకారం చుట్టింది. 104 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు కోసం రూ.1332 కోట్లు ఖర్చు చేయనుంది.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, తిరుపతి మీదుగా తమిళనాడులో వెల్లూరు వరకు రైల్వేలైన్‌లో మరో అదనపు రైల్వేలైన్‌కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.1332 కోట్లు ఖర్చు చేయనుంది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. మొత్తం 104 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్ డబ్లింగ్‌కు కేంద్రం ఆమెదం తెలిపిందని చెప్పారు.
'' ఈ ప్రాజెక్టు వల్ల 400 గ్రామాలు, 14 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. తిరుపతికి కనెక్టివిటీ పెరగుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 35 లక్షల పనిదినాలతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని'' అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
మరోవైపు PMKSYలో కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అండ్ వాటర్ మేనేజ్‌మెంట్ స్కీమ్‌కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2025-26 సంవత్సరానికి కూడా కమాండ్ ఏరియా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1600 కోట్లు ఖర్చు చేయనుంది.
Union cabinet approves modernization of Command Area Development and Water Management (M-CADWM) as a sub-scheme of Pradhan Mantri Krishi Sinchayee Yojana (PMKSY) for the period 2025-2026 with an initial total outlay of Rs.1600 crore. pic.twitter.com/SB3g4Mcqoq