pregnancy kit: ప్రెగ్నెన్సీ కిట్‌ని ఎలా ఉపయోగించాలి?..ఈ తప్పులు చేయొద్దు

మహిళలు సకాలంలో గర్భధారణను గుర్తించడం చాలా ముఖ్యం.ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ గర్భధారణను గుర్తించడానికి సులభమైన మార్గం. ఉదయం నిద్రలేచిన వెంటనే మూత్రాన్ని తీసుకోవాలి. దానిని శాంపిల్‌పై ఉంచాలి. పింక్ లైన్ కనిపిస్తే గర్భవతి కాదని, రెండు గులాబీ గీతలు కనిపిస్తే గర్భవతి అని అర్థం.

New Update
pregnancy kit: ప్రెగ్నెన్సీ కిట్‌ని ఎలా ఉపయోగించాలి?..ఈ తప్పులు చేయొద్దు

Pregnancy Kit: ప్రెగ్నెన్సీపై చాలామంది మహిళలకు అపోహలతో పాటు కాస్త ఉత్కంఠ కూడా ఉంటుంది. ప్రతిసారీ పీరియడ్స్ మిస్ అవడం అంటే గర్భం దాల్చడం కాదు. అనేక ఇతర కారణాల వల్ల కూడా పీరియడ్స్ మిస్ అవుతాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్‌ ఎలా చేసుకోవాలి. కిట్‌ను ఎలా ఉపయోగిస్తున్నామో కూడా ముఖ్యం. పీరియడ్స్‌ మిస్‌ కావడం చాలా మందితో కనిపిస్తుంది. PCOD, PCOS వల్ల కూడా ఇలా జరుగుతుంది. అంటే పీరియడ్స్ సక్రమంగా ఉండవు. సకాలంలో గర్భధారణను గుర్తించడం చాలా ముఖ్యం. ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా ఇంట్లోనే ప్రెగ్నెన్సీని సులువుగా నిర్ధారించుకోవచ్చు. కానీ చాలా మంది మహిళలకు దీన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు.

ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్:

ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ అనేది గర్భధారణను గుర్తించడానికి సులభమైన, చౌకైన మార్గం. దీని ద్వారా చేసే పరీక్ష 99 శాతం కచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా ఎవరి సహాయం లేకుండా ఈ పరీక్షను మీరే చేసుకోవచ్చు.

టెస్ట్‌ ఎలా చేసుకోవాలి?

1. ఉదయం నిద్రలేచిన వెంటనే వాష్‌రూమ్‌కి వెళ్లి ప్లాస్టిక్ కంటైనర్‌లో మూత్రాన్ని తీసుకోవాలి. కొద్దిగా మూత్రం సరిపోతుంది.
2. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌లో డ్రాపర్ ఉంటుంది. దానితో కంటైనర్ నుంచి మూత్రం చుక్కలను తీసుకొని దానిని శాంపిల్‌పై ఉంచాలి.
3.గర్భధారణ ఫలితం రావడానికి ఐదు నిమిషాలు పడుతుంది. పరీక్ష కిట్‌పై క్రమంగా గులాబీ గీతలు కనిపించడం ప్రారంభిస్తాయి. పింక్ లైన్ కనిపిస్తే మీరు గర్భవతి కాదనిఅర్థం.
4.టెస్ట్ కిట్‌పై రెండు గులాబీ గీతలు కనిపిస్తే మీరు గర్భవతి అని అర్థం.
5. కిట్‌లో చాలా సార్లు రెండు గీతలు కనిపిస్తాయి. కానీ వాటి రంగు భిన్నంగా ఉంటుంది. గులాబీ రంగుతో పాటు నీలిరంగు గీత కనిపిస్తుంటుంది.అలా జరిగితే టెస్ట్‌ ఫెయిల్‌ అయినట్టు, మరో కిట్‌తో మళ్లీ ప్రయత్నించాలి.

శ్రద్ధగా చేయాలి:

ఒకేసారి రెండు లేదా నాలుగు ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌లను కొనుగోలు చేయవద్దు. అంతేకాకుండా వాటిని ఎక్కువ రోజులు నిల్వ చేయవద్దు. ఎందుకంటే దానికి గడువు తేదీ కూడా ఉంటుంది. దీని వల్ల ఫలితం సరిగా ఉండదు. టెస్ట్ కిట్‌ను ఒకసారి మాత్రమే ఉపయోగించాలి.

ఇది కూడా చదవండి: ఈ ‘టీ’ని ట్రై చేయండి..ఎన్నో రోగాలు మాయం

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు