Walnut Benefits: వాల్‌నట్‌తో ఇంట్లోనే ఫేస్ స్క్రబ్‌ను ఇలా తయారు చేసుకోండి.. తేడా గమనించండి! వాల్‌నట్ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. చర్మాన్ని, ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. ఈ స్క్రబ్ చర్మాన్ని శుభ్రపరచి వడదెబ్బ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఫేస్ స్క్రబ్‌ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Vijaya Nimma 05 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Walnut Benefits: వాల్‌నట్ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. చర్మానికి కూడా చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుందని నిపుణులు అంటున్నారు. దీనితో ఇంట్లోనే స్క్రబ్‌ను తయారు చేసుకోసుకుని ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాంటి వారు వాల్‌నట్‌లను ఉపయోగించవచ్చని చర్మ నిపుణులు అంటున్నారు. వాల్‌నట్‌ల వాడకం చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దాని ఫేస్ స్క్రబ్‌ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. వాల్‌నట్‌తో స్క్రబ్ తయారీ విధానం: ఈ స్క్రబ్ చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడటమే కాకుండా వడదెబ్బ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఒక గిన్నెలో వాల్‌నట్ పౌడర్, పెరుగు, తేనె మిక్స్ చేసి, ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై రాయాలి. ఆ తర్వాత 15 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంలోని మురికి తొలగిపోయి ముఖం మెరిసిపోతుంది. అయితే ఒకసారి ఈ స్క్రబ్ ప్యాచ్ టెస్ట్ చేయించుకోవాలని గుర్తుంచుకోవాలి. వాల్‌నట్‌తో తయారు చేసిన ఈ స్క్రబ్‌ను వారానికి 1-2 సార్లు ఉపయోగించవచ్చని నిపుణులు అంటున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: వేసవిలో మీ చేతులు, కాళ్లు నల్లగా మారుతున్నాయా? వీటిని ఉపయోగించండి! #walnut-benefits మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి