Mental Health Tips: మీరు ఎప్పుడూ ఏదో టెన్షన్ తో ఉంటారా? అయితే.. ఈ 8 టిప్స్ మీ కోసమే!

మనలో చాలా మంది చిన్న విషయానికి టెన్షన్ పడుతుంటారు. ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతుంటారు. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మెంటల్ ఫ్రీగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

New Update
Mental Health Tips: మీరు ఎప్పుడూ ఏదో  టెన్షన్ తో ఉంటారా? అయితే.. ఈ 8 టిప్స్ మీ కోసమే!

Tips to Boost Your Mental Health: నేటి ఉరుకుల పరుగులు జీవితంలో..చాలా మంది ఒత్తిడికి లోనవుతున్నారు. భోజనం చేయడానికి కూడా సమయం దొరకనంత బిజీగా మారుతున్నారు. దీనికి తోడు మానసిక ఒత్తిడి అనేది చాలా మంది ఇబ్బంది పెడుతుంది.ఉద్యోగం, కుటుంబ బాధ్యతలతోపాటుగా చిన్న చిన్న సమస్యలను సదరు వ్యక్తిని మానసికంగా హింసిస్తున్నాయి. దీంతో ప్రతి చిన్న విషయానికే టెన్షన్ పడుతున్నారు. ఆలోచన తక్కువ..ఒత్తిడి ఎక్కువ అనే పరిస్థితిల్లోకి నెట్టబడుతున్నారు. దీంతో మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. చిన్న విషయానికే టెన్షన్ పడే వ్యక్తులు ఈ టిప్స్ ఫాలో అవుతే..ఎంత పెద్ద సమస్య అయినా తేలిగ్గా తీసుకుంటారు. ఆ టిప్స్ ఏంటో చూద్దామా.

1. మీ ఇంద్రియాలను మీ ఆధీనంలోనే ఉంచుకోండి:
మీరు ఏదైనా ఆలోచిస్తుంటే మీ మనస్సు మరో చోటికి మళ్లుతుంది. ఎందుకంటే ఆలోచిస్తున్న వ్యక్తి తన ఇంద్రియాలను కోల్పోతాడు. అందుకే టెన్షన్ నుంచి బయటపడాలంటే వాస్తవికతను గుర్తించడం నేర్చుకోవాలి.

2. తెలివిగా ఆలోచించండి:
టెన్షన్ పెట్టే విషయాలకు దూరంగా ఉండాలి. వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి. సమస్యను తెలివిగా ఆలోచిస్తే పరిష్కరం దొరుకుతుంది.

3. లోతుగా శ్వాస తీసుకోండి:
ఒత్తిడికి గురి చేసే ఆలోచనలు మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టినప్పుడు..నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకోండి. ఇలా చేస్తే మానసిక ప్రశాంతతోపాటు ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుది.

4. ప్రశాంతంగా ఉండండి:
సమస్యలు సర్వసాధారణం. ఇలా వస్తాయి..అలా పోతుంటాయి. ఈ సమయంలో మనం ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం.

5. రాయడం అలవాటు చేసుకోండి:
రోజూ ఏదోకటి రాయడం అలవాటు చేసుకోండి. దీంతో మీ మదిలో ఆందోళన కలిగించే ఆలోచనలు రాకుండా మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇలాంటి సమయాల్లోనే మనలోని కవులు కూడా బయటకు వస్తుంటారు.

6. భవిష్యత్తు గురించి ఎక్కువగా టెన్షన్ పడకండి:
చాలా మంది తమ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతుంటారు. అలాంటివారు వర్తమానంలో బతకడం అలవాటు చేసుకోవాలి. రేపటి గురించి ఇవాళ చింతించాల్సిన అవసరం లేదు.

7. స్నేహితులతో గడపండి:
ఒంటరిగా ఉంటే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మీకు ప్రియమైన వారితో గడపండి. కుటుంబం, స్నేహితులతో సమయాన్ని కేటాయించండి.

8. వ్యాయామం చేయండి:
ఒత్తిడికి బెస్ట్ మెడిసిన్ వ్యాయామం. ప్రతిరోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది.

ఇది కూడా చదవండి: నాడు పాత్రలు కడిగిన వ్యక్తి.. నేడు 100 రెస్టారెంట్లకు యజమాని.. సక్సెస్ సీక్రెట్స్ ఇవే!

Advertisment
Advertisment
తాజా కథనాలు