life Style: ఆఫీస్‌లో ఓవర్ టైమ్ చేస్తున్నారా? మీ చిట్టి గుండెకు ఏం అవుతుందో తెలిస్తే ఫ్యూజులు అవుటే..! చాలా మంది సరైన నిద్ర, ఆహరం, శ్రద్ధ చూపకుండా గంటల కొద్ది ఆఫీస్ లో పని చేస్తూ ఉంటారు. కానీ దాని వల్ల ఆరోగ్యానికి చాలా నష్టం జరుగుతుందనే విషయం మర్చిపోతున్నారు. ఎక్కువ సమయం పని చేసినప్పుడు లేదా వర్క్ టెన్షన్ ఎక్కువైనప్పుడు శరీరంలో ఒత్తిడి పరిగి అది గుండె పై ప్రభావం చూపుతుంది. గుండె ఆరోగ్యం పై ప్రభావం చూపే అంశాలు ఇవే.. By Archana 19 Oct 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి life Style: ఈ బిజీ లైఫ్ లో చాలా మంది గంటల తరబడి పని చేస్తూ వారు ఆహరం, ఆరోగ్యం పై అశ్రద్ధ పెడుతుంటారు. జీవితంలో సక్సెస్ అవ్వడానికి చేయాల్సిన సమయం కంటే ఎక్కువ సమయం కష్టపడుతున్నామని అనుకుంటారు కానీ దాని వల్ల మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యనికి కూడా ప్రమాదం ఉంటుంది అనే విషయం మర్చిపోతారు. చేసే పని ఎక్కువైనప్పుడు శరీరం ఒత్తిడికి లోనై అది గుండె పై ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. గుండె ఆరోగ్యం పై ప్రభావం చూపే అంశాలు ఇవే.. ఒత్తిడి పెరగడం ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఎక్కువ సమయం వర్క్ చేస్తూ ఉంటాము. ఆలా అధిక పని చేస్తున్నప్పుడు శరీరం ఒత్తిడికి లోనై అది గుండె పై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. బాగా ఒత్తిడికి గురైనప్పుడు మన శరీరంలో విడుదలయ్యే స్ట్రెస్ హార్మోన్స్ కార్టిసాల్, అడ్రెనలిన్ శరీరంలో రక్తపోటు, కొవ్వు స్థాయిలను పెంచి గుండె సంబందిత వ్యాధులకు దారి తీస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం పనిలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ శరీరానికి వ్యాయామం చాలా అవసరం. జీవన శైలి రోగాలు రాకుండా ఉండాలి అంటే మన దినచర్యలో కాస్త తప్పనిసరిగా శారీరక శ్రమ పై కేటాయించాలి. లేదంటే మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. నిద్రలేమి చాలా పనిలో పడిపోయి నిద్రకు సరైన సమయం కేటాయించారు కానీ ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. సరైన నిద్ర లేకపోతే బ్రెయిన్ కూడా సరిగ్గా పని చేయదు అలాగే ఏ పని శ్రద్ధ చూపలేము అంతే కాదు నిద్రలేమి వల్ల గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. సరైన ఆహరం తీసుకోలేకపోవడం కొన్ని సార్లు పనిలో పడి ఆహరం పై అశ్రద్ధ చూపుతారు. ఏది పడితే అది తింటూ ఉంటారు దాని వల్ల శరీరంలో కొవ్వులు, క్యాలరీలు పెరిగిపోయి గుండె పై ప్రభావం చూపే ఊబకాయం వంటి జీవన శైలి వ్యాదులకు దారి తీస్తుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం కొన్ని ఆఫీస్ అనుకున్న సమయంలోనే పని పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో స్నేహితులతో, ఫ్యామిలీతో సమయం గడపలేరు దాని వల్ల కొందరి మెంటల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అయ్యి స్ట్రెస్ కి లోనవుతారు. అందుకే వర్క్ లైఫ్, వ్యక్తిగత జీవితం రెండింటికి సరైన సమయం కేటాయించేలా చూసుకోవాలి. Also Read: Vitamin B12: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే విటమిన్ B12 లోపం ఉన్నట్లే జాగ్రత్త .. ? #lifestyle #heart-health #stress #how-stress-effects-heart-health మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి