Aspirin Tablet : ఆస్పిరిన్ టాబ్లెట్ గుండెపోటు ప్రమాదాన్ని ఎంత వరకు తగ్గిస్తుంది? ఈ రోజుల్లో గుండెపోటు మరణాలు అధికంగా ఉంటున్నాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో ఆస్పిరిన్ ముందువరుసలో ఉంటుంది. ఆస్పిరిన్‌లో రక్తాన్ని పలుచన చేసే గుణాలు, గుండెలోని ధమనులు రక్తం గడ్డకట్టే అవకాశం తగ్గిస్తుంది. ఆస్పిరిన్ గుండెపోటు, స్ట్రోక్ తర్వాత మాత్రమే వేసుకోవాలంటున్నారు. By Vijaya Nimma 02 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Aspirin Tablet : ఈ రోజుల్లో గుండెపోటు(Heart Attack) మరణాలు అధికంగా ఉంటున్నాయి. అయితే ముందుగానే గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో కొన్ని మాత్రలు పనిచేస్తాయి. అందులో ఆస్పిరిన్(Aspirin) ముందువరుసలో ఉంటుంది. అయితే ఆస్పిరిన్ టాబ్లెట్ ఎంత మోతాదులో వాడాలనే సందేహం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొందరు వైద్యులు చెబుతున్నదేంటంటే అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్(Cholesterol) ను నియంత్రించగలిగితే ఎప్పటికీ టాబ్లెట్‌లు వేసుకోవాల్సిన అవసరం ఉండదంటున్నారు. ఆస్పిరిన్ ఎలా పని చేస్తుంది..? ఆస్పిరిన్‌లో రక్తాన్ని పలుచన చేసే గుణాలు ఉన్నాయి. గుండెలోని ధమనులు రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. దీన్ని తగ్గించడంలో ఆస్పిరిన్ బాగా పనిచేస్తుంది. కానీ ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలో పూతలు, లేదా రక్తస్రావం కూడా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. అందుకే 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు గుండె జబ్బుల నివారణ కోసం ఆస్పిరిన్ తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందుతారని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. బేబీ ఆస్పిరిన్ బ్లడ్ ప్లేట్‌లెట్స్ గడ్డకట్టే ప్రక్రియను నెమ్మదిస్తుంది. రక్తాన్ని పలుచన చేస్తుంది. కానీ ఇది కొన్నిసార్లు సులభంగా రక్తస్రావం అయ్యేలా చేస్తుంది. ముక్కు నుంచి రక్తస్రావం(Bleeding), చిగుళ్ళలో రక్తస్రావం, గాయాలు అయ్యేందుకు కాస్త సమయం పట్టవచ్చు. అధ్యయనం ఏం చెబుతోంది..? మూడు క్లినికల్ ట్రయల్స్ నుంచి వచ్చిన డేటా గుండె జబ్బులను నివారించడానికి ఆస్పిరిన్ తీసుకున్న వారు, తీసుకోని వారి మధ్య గణనీయమైన తేడాను చూపించలేదని అంటున్నారు. ఈ పరిశోధన US, UK, ఆస్ట్రేలియాతో సహా 10 దేశాలలో 47 వేలకుపైగా రోగులపై జరిపించారు. కొన్ని టాబ్లెట్స్ మాత్రమే అంతర్గత రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతాయని గత కొన్నేళ్లుగా చేస్తున్న పరిశోధనలో తేలింది. అయితే ఆస్పిరిన్ గుండెపోటు లేదా స్ట్రోక్ తర్వాత మాత్రమే వేసుకోవాలని వైద్యులు అంటున్నారు. ఆస్పిరిన్‌కు బదులుగా ఏం వాడాలి..? అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర, అధిక కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం ఆస్పిరిన్ కాకుండా స్టాటిన్ ఫార్ములా ఉన్న టాబ్లెట్స్ వేసుకోవచ్చు. కార్డియాలజిస్టులు కూడా క్లోపిడోగ్రెల్ ఆస్పిరిన్ కంటే ఎక్కువ ప్రయోజనకరమని సూచిస్తున్నారు. క్లోపిడోగ్రెల్ రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: వేసవిలో కడుపును చల్లగా ఉంచే మిల్లెట్ పెరుగన్నం గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #cholesterol #heart-attacks #aspirin-tablet మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి