Hiccup: పిల్లలకు ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి?..తగ్గాలంటే ఎలా?

చిన్న పిల్లలకు తరచూ ఎక్కిళ్లు సాధారణం. ఎక్కిళ్లు వచ్చినప్పుడు కంగారు పడకుండా నాలుకపై తేనె వేయాలి, లేదా పటిక బెల్లం ముక్కను నోట్లో ఉంచినా తగ్గిపోతాయి. ఎక్కిళ్లు మరీ ఎక్కువైతే సొంత వైద్యం కాకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.

New Update
Hiccup: పిల్లలకు ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి?..తగ్గాలంటే ఎలా?

Hiccup: పుట్టిన తర్వాత మొదటి కొన్ని నెలల పాటు పిల్లలకు తరచూ ఎక్కిళ్లు వస్తూ ఉంటాయి. శిశువు పెరుగుతున్న కొద్దీ ఎక్కిళ్ళు తగ్గడం మొదలవుతుంది. సాధారణంగా ఎక్కిళ్లు వచ్చినప్పుడు ఎవరో గుర్తుకు తెచ్చుకుంటున్నారని పెద్దలు చెబుతుంటారు. కానీ ఈ సమస్య కొనసాగితే అది ఇబ్బందికి దారి తీస్తుంది. ఎక్కిళ్లు పిల్లలకు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. అలాంటి పరిస్థితిలో ఏమి చేయాలో తల్లిదండ్రులకు అర్థం కాదు. కాసేపటి తర్వాత ఎక్కిళ్లు వాటంతట అవే ఆగిపోతాయి.

చిన్న పిల్లలలో ఎక్కిళ్లు రావడానికి కారణం:

చిన్నపిల్లలు పాలు కడుపునిండా తాగిన తర్వాత ఎక్కిళ్లు రావడం సహజం. కాబట్టి పాలు తాగిన తర్వాత బిడ్డను భుజం మీద ఉంచి సున్నితంగా తట్టండి లేదా వీపుపై మసాజ్ చేయండి. చాలా సందర్భాల్లో బిడ్డ పాలు ఎక్కువగా తాగితే ఎక్కిళ్లు వస్తాయి. అలాంటి సమయంలో కంగారు పడకుండా సంయమనంతో వ్యవహరించాలి. ఎక్కిళ్లు మరీ ఎక్కువ అయితే వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి.

ఇంటి చిట్కాలు:

పిల్లలకి నిరంతరం ఎక్కిళ్లు వస్తుంటే చెంచా సహాయంతో నాలుకపై కొంచెం తేనెను పూయండి. ఐదేళ్లు దాటిన పిల్లలు అయితే నేరుగా నోట్లో తేన వేయవచ్చు. దీని వల్ల ఎక్కిళ్ల నుంచి కొంచెం కొంచెంగా ఉపశమనం లభిస్తుంది.

పటిక బెల్లం:

శిశువుకు 6 నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే శిశువు నోటిలో చిన్న చక్కెర ముక్కను వేయండి. అది మెల్లగా కరిగేకొద్దీ ఎక్కిళ్లు తగ్గుముఖం పడతాయి.

చిన్నపిల్లల్లో తల్లిపాలు తాగడం వల్ల ఎక్కిళ్లు రావడం సర్వసాధారణం. కానీ తరచుగా రావడం వల్ల మీ పిల్లల నిద్రకు అంతరాయం కలిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎక్కిళ్లు వచ్చినా, పొరపోయినా ఇంట్లో సొంత ప్రయోగాలు చేయకుండా ఆస్పత్రికి తీసుకెళ్లడం లేదా వైద్యుల సూచనలు తీసుకుంటే ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఉదయాన్నే టిఫిన్‌కు బదులు అన్నం తింటే ఏమవుతుంది?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">

Advertisment
Advertisment
తాజా కథనాలు