Pregnancy: గర్భధారణ సమయంలో డెంగీ వస్తే దాని లక్షణాలు ఎలా ఉంటాయి? దేశంలో గర్భధారణ సమయంలో డెంగీ కారణంగా ప్రసూతి మరణాల రేటు 15.9శాతంగా ఉంది. గర్భిణీలకు డెంగీ సోకితే అది జీర్ణ అవయవాలలో రక్తస్రావం, ముక్కు నుంచి రక్తం కారడం లాంటి వాటికి కారణమవుతుంది. ఇవి గర్భిణీ ఆరోగ్యంతో పాటు శిశువు ఆరోగ్యంపైనా ప్రతీకూల ప్రభావాన్ని చూపుతుంది. By Vijaya Nimma 17 Jul 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Pregnancy: గర్భధారణ సమయంలో డెంగీ జ్వరం వస్తే తల్లితో పాటు పిండంపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, గర్భధారణ సమయంలో డెంగీ కారణంగా ప్రసూతి మరణాల రేటు 15.9శాతం ఉన్నట్లు నివేదించింది. ఏడిస్ దోమ ద్వారా సంక్రమించే డెంగీ జ్వరం అనేక సవాళ్లను కలిగిస్తుంది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ తల్లి ఆరోగ్యాన్ని నెగిటివ్‌గా ప్రభావితం చేస్తుంది. గర్భాశయం లోపల అభివృద్ధి చెందుతున్న పిండానికి ప్రమాదం కలిగిస్తుంది. పెరుగుతున్న కేసులు: సీజనల్ వ్యాధిగా పేరొందిన డెంగీ జ్వరం చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇది పిల్లలు, వృద్ధులు, గర్భిణీలను సులభంగా ప్రభావితం చేస్తుంది. గర్భిణీలు ముఖ్యంగా ఇన్ఫెక్షన్లకు గురవుతారు. ఎందుకంటే వారి రోగనిరోధక వ్యవస్థ గర్భధారణ సమయంలో హెచ్చుతగ్గులకు గురవుతుంది. గర్భిణీలలో ఏదైనా ఆరోగ్య సమస్య పుట్టబోయే బిడ్డను కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి డెంగీ జ్వరం చాలా వేగంగా విస్తరిస్తున్నందున గర్భిణీలు దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. గరిష్ట ఉష్ణోగ్రత: అధిక ఉష్ణోగ్రతలు తరచుగా 104°F (40°C) కంటే ఎక్కువగా ఉండడంతో పాటు తీవ్రమైన తలనొప్పులు వస్తాయి. అలాగే నుదుటిపైన విపరీతమైన నొప్పి, కళ్ల వెనుక నొప్పి కూడా వస్తుందని చెప్పారు. అలాగే కండరాలు, కీళ్లలో తీవ్రమైన అసౌకర్యం ఉంటుంది. డెంగీ సాధారణ లక్షణాలలో ఒకటి వ్యాధి ప్రారంభ దశలో వాంతులు, వికారం. ఇక దద్దుర్లు సాధారణంగా కీళ్లపై ప్రారంభమవుతాయి. అది శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. కొంతమంది వ్యక్తులు చిగుళ్ళలో రక్తస్రావం, ముక్కు నుంచి రక్తస్రావం లేదా శరీరం గాయపడిన ప్రాంతాల నుంచి తేలికపాటి రక్తస్రావం లక్షణాలను అనుభవించవచ్చు. గర్భిణీలకు కడుపు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తస్రావం, జీర్ణ అవయవాలలో రక్తస్రావం, ముక్కు నుంచి రక్తస్రావం మొదలైన వాటికి కారణమవుతుంది. ఇవి గర్భిణీఆరోగ్యంపై ప్రభావం చూపినప్పుడు, శిశువు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. గర్భిణీలకు ప్రమాదాలు: పొత్తి కడుపు నొప్పి నిరంతర వాంతులు ద్రవం చేరడం శ్లేష్మ రక్తస్రావం నీరసం అశాంతి కాలేయ విస్తరణ తక్కువ ప్లేట్‌లెట్స్ డెంగీ హెమరేజిక్ ఫీవర్ గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: మీకు రోజంతా నీరసంగా అనిపిస్తుందా? అయితే ఇదే కారణం! #pregnancy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి