Bigg Boss 7:శివాజీని టార్గెట్ చేసిన హౌస్మేట్స్..

గత వారం శివాజీ మాట్లాడిన మాటలు ఎఫెక్ట్ చూపించడం మొదలైంది. ఈ వారం నామినేషన్లలో అందరూ అతనినే టార్గెట్ చేసినట్లుకనిపిస్తోంది. అంతలా సపోర్ట్ చేసిన అర్జున్ సైతం శివాజీని నామినేట్ చేసినట్లు తెలుస్తోంది.

New Update
Bigg Boss 7:శివాజీని టార్గెట్ చేసిన హౌస్మేట్స్..

బిగ్‌బాస్ సీజన్ 7 ఈ వారం నామినేషన్ల ప్రోమో అంటే ఇవాల్టి ఎపిసోడ్ ది రిలీజ్ అయ్యింది. నామినేషన్లలో భాగంగా నరకం అనే కాన్సెప్ట్‌ పెట్టారు బిగ్‌బాస్. ఇందులో హౌస్‌మేట్స్ తాము నామినేట్ చేయాలి అనుకునే ఇద్దరి మొహం మీద ఎరుపు రంగు పూయాలి. ఇందులో దాదాపు అందరూ శివాజీని టార్గెట్ చేశారు. ప్రియాంక , అమర్ నామినేషన్లు వేస్తారని తెలుసు కానీ సర్ప్రైజింగ్ గా అర్జున్ కూడా శివాజీనే నామినేట్ చేసినట్టు కనిపిస్తోంది. ఏదైతే జరగకూడదో అనుకున్నానో అదే జరిగింది అంటూ అర్జున్‌ శివాజీపై అసహనం వ్యక్తం చేశాడు. మరోవైపు శివాజీ కూడా అర్జున్‌ మీద ఫైర్ అయ్యాడు. ఇంత అయ్యాక ఫ్రెండ్‌గా ఉండలేనంటూ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ తీసేశాడు. గౌతమ్, శివాజీ మధ్య ఎప్పటిలానే వార్ నడిచింది. నాగార్జున కొన్ని విషయాల్లో క్లారిటీ ఇచ్చినా సరే.. గౌతమ్ శివాజీ మీద తన అభిప్రాయాన్ని మాత్రం మార్చుకోలేదు. ఇక ప్రియాంక అయితే శివాజీ తనని సపోర్ట్ చేస్తూనే.. అంతకంటే ఎక్కువ నెగిటివ్ చేస్తున్నారు చెప్పి నామినేట్ చేసింది. ఇక శోభ కూడా ఎప్పటిలాగే తన యాటిట్యూడ్ చూపించింది. మొత్తానికి ఈ ప్రోమో చూస్తుంటే ఎక్కువ మంది హౌస్‌ మేట్స్ శివాజికి నామినేట్ చేశారని అర్థమవుతోంది. ఇక మొత్తానికి ఈ వారం ప్రశాంత్ తప్ప అందరూ నామినేషన్లలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వారం నామినేషన్ల నుంచి సేవ్ అయిన వారు టికెట్‌ టూ ఫినాలే ఆడతారు.

Also Read:ఆంధ్రలో తప్పిన రైలు ప్రమాదం..విరిగిన రైలు పట్టా.

ఇక లాస్ట్ వీక్ అశ్విని, రతిక ఎలిమినేట్ అయిపోయారు. ప్రశాంత్‌ ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ ఎవరి కోసం వాడనని చెప్పేశాడు. పధ్నాలగవ వారం వరకూ ప్రశాంత్ ఎవ్వరి కోసమూ ఉపయోగించనని చెప్పాడు. ప్రశాంత్ ఆ పాస్‌ను రతిక కోసం ఉపయోగించనందకు రతికకు సారీ చెప్పాడు. మరోవైపు శివాజీ రతికకు కాఫీ ఇద్దామనుకున్నానని కానీ ఇలా ఎలిమినేట్ అవ్వడం షాకింగ్‌గా ఉందని చెప్పాడు. రెండోసారి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రతికి ఏమీ ఆడకుండానే ఎలిమినేట్ అయిపోయింది. ప్రతీ వారం ఈసారి ఆడతానంటూ చెప్పడంతోనే కాలం వెళ్ళదీసింది. హౌస్నుంచి బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ బజ్ లో గీతూతో మాట్లాడింది. అసలు గేమ్ ఆడకుండా ఇన్ని రోజులు ఎలా ఉండగలిగావ్ అని అడిగేసింది గీతూ. అసలు హౌస్‌లో తనెందుకు సరిగా ఆడలేకపోయిందో రీజన్ చెప్తూ బోరున ఏడ్చేసింది రతిక. కొన్ని విషయాలకు తాను ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయానని అవే తనని గేమ్‌లో ముందుకు వెళ్లకుండా కట్టిపడేశాయని చెప్తూ రతిక ఎమోషనల్ అయింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు