Weather : వచ్చే పదిరోజుల్లో తెలంగాణలో మండనున్న సూర్యుడు!

అక్టోబర్‌ నెల మొదలైనప్పటి నుంచి కూడా రాష్ట్రంలో వేడి వాతావరణం నెలకొంది. బంగాళాఖాతం పై గంటకి సుమారు 17 నుంచి 25 కిలో మీటర్ల వేగంతో వేడి గాలులు వీస్తున్నాయి.రాష్ట్రంలో రానున్న పది రోజులు కూడా వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు.

New Update
Weather : వచ్చే పదిరోజుల్లో తెలంగాణలో మండనున్న సూర్యుడు!

తెలంగాణ(Telangana) లో ప్రస్తుతం నడుస్తుంది ఏ కాలామో కూడా తెలియడం లేదు. వర్షాకాలం సమయంలోనే వరుణుడు అప్పుడప్పుడు నేను ఉన్నాను అంటూ పలకరించాడే తప్ప వానా కాలంలో కురిసినట్లు వర్షాలు మాత్రం పడలేదు. నిజానికి రాష్ట్రానికి ఈ ఏడాది నైరుతి రుతు పవనాల రాక చాలా ఆలస్యం అయ్యింది. జూన్‌ మొదటి వారంలో కురవాల్సిన వానలు..జూన్ చివరి వారం వచ్చినా  జాడే లేదు.

అది కూడా అప్పుడప్పుడు పడ్డాయే తప్ప నిత్యం కురవలేదు. ఆ తర్వాత జులై చివరి వారంలో వానలు ముంచెత్తాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లాయి. జలశయాలు నిండుకుండల్లా మారాయి. ఆ తరువాత ఆగస్టు వరకు వానదేవుడు ముఖమే చూపించలేదు. సెప్టెంబర్‌ లో కూడా ఓ మోస్తరు గానే కురిశాయి తప్ప పెద్దగా వానలు పడలేదు.

Also read: పుంగనూరు అంగల్లు అల్లర్ల కేసుపై నేడు హైకోర్టులో విచారణ..!!

అక్టోబర్‌ నెల మొదలైనప్పటి నుంచి కూడా రాష్ట్రంలో వేడి వాతావరణం నెలకొంది. బంగాళాఖాతం పై గంటకి సుమారు 17 నుంచి 25 కిలో మీటర్ల వేగంతో వేడి గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో రానున్న పది రోజులు కూడా వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు.

వేసవి కాలం మొదలైనప్పుడు ఎలా ఉంటుందో...అంటే మార్చి మొదటి వారంలో ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా రాష్ట్రంలో అదే విధంగా ఉంది. రానున్న పది రోజుల్లో వాతావరణం పగటి పూట చాలా వేడిగా ఉంటుందని తెలిపారు. రానున్న రోజుల్లో రాత్రులు, ఉదయం 19 నుంచి 22 డిగ్రీల సెల్సియస్‌ గా ఉంటుందని వారు పేర్కొన్నారు.

పగటి పూట సూర్యుడు చూసుకోండి అంటున్నాడు. సుమారు 33-36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అంటున్నారు. ఇక నైరుతి రుతుపవనాల తిరోగమనం మొదలు కాగానే అక్టోబర్‌ 15 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AV Ranganath: ఆక్రమణలు కూల్చుకుంటారా.. లేదా కూల్చమంటారా?

హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆక్రమణలను ఎవరికి వారే స్వచ్ఛందంగా కూల్చేయాలని సూచించారు. లేదంటే తామే కూల్చేస్తాం.. అంటూ అల్టిమేటం జారీ చేశారు. ప్రజావాణిలో ఫిర్యాదులను అనుసరించి పలువురికి నోటీసులు జారీ చేశారు.

New Update
AV Ranganath

AV Ranganath

AV Ranganath: గత కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న హైడ్రా తిరిగి ప్రతాపం చూపెడుతోంది. ఆక్రమణలను తొలగించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుపుతున్న హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆక్రమణలను ఎవరికి వారే స్వచ్ఛందంగా కూల్చేయాలని సూచించారు. లేదంటే తామే కూల్చేస్తాం.. అంటూ అల్టిమేటం జారీ చేశారు. హైడ్రా ప్రజావాణిలో వచ్చిన 52 ఫిర్యాదులను రంగనాథ్‌ పరిశీలించారు. వాటి ఆధారంగా పలువురికి నోటీసులు జారీ చేశారు.

Also Read :  ఆగని యుద్ధం.. 30 వేల మంది యువతను నియమించుకున్న హమాస్ !

రోడ్లపై ఆక్రమణలు ఉంటే స్వచ్ఛందంగా తొలగించాలని, లేనిపక్షంలో హైడ్రా కూల్చివేస్తుందని కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ హెచ్చరించారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు రోడ్లపై ఆటంకాలు లేకుండా చూడటమే హైడ్రా ఉద్దేశమన్నారు. సోమవారం బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో జరిగిన ‘ప్రజావాణి’లో వివిధ ప్రాంతాల నుంచి 52 ఫిర్యాదులు వచ్చాయి. రోడ్లపై గోడలు, ఇతరత్రా నిర్మాణాలు చేపడుతుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంద కలుగుతోందని పలువురు కమిషనర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను బై నెంబర్ల ద్వారా కొందరు కబ్జా చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వాటిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కమిషనర్‌ సూచించారు.

ఇది కూడా చూడండి: Holiday Culture: హాలీడే కల్చర్‌ తో ఉత్పాదకత తగ్గిపోతుందన్న సీఈవో..మండిపడుతున్న నెటిజన్ల

దుండిగల్‌ మునిసిపాలిటీ బౌరంపేట గ్రామం సర్వే నెంబర్‌ 345లో స్థానిక మాజీ ప్రజాప్రతినిధి 25గుంటల ప్రభుత్వ స్థలంలో అతిథిగృహం నిర్మించారని, సర్వే నంబర్‌ 14లో కూడా 36 గుంటల ప్రభుత్వ స్థలానికి బై నెంబర్‌ వేసి ఆక్రమించుకున్నారని పలువురు యువకులు ఫిర్యాదు చేశారు. మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లా బాలానగర్‌ ఫిరోజ్‌గూడలోని మాధవినగర్‌ పార్కు స్థలం కబ్జా చేశారు. కోర్టు ఆదేశాలనూ స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదు. 300 చదరపు గజాల పార్కు స్థలం స్వాధీనం చేసుకోవాలి.

Also Read :  లిక్కర్ స్కామ్ లో సంచలనం.. మరో ఆడియో విడుదల చేసిన రాజ్ కసిరెడ్డి!

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని రాజేంద్రనగర్‌ శ్రీ వెంకటేశ్వర కాలనీకి 60 అడుగుల రహదారి ఉండగా ప్రహరీ నిర్మించారు. సర్వే నెంబర్‌ 20లో 23 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేశారు. శామీర్‌పేట మండలం దేవరయాంజల్‌లో రహదారులపై నిర్మాణాలు చేపట్టారు.సరూర్‌నగర్‌ చెరువు సమీపంలో ఇంటి స్థలం ఉంది. దాని చుట్టూ ఇళ్లున్నా.. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉందని మా స్థలంలో ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వడం లేదు. వెంటనే ఎఫ్‌టీఎల్‌ నిర్ధారించండి.రావిర్యాల పెద్ద చెరువులో నీటి మట్టం పెరిగి తమ ఇళ్లు మునిగిపోతున్నాయని పలువురు రంగనాథ్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించి రంగనాథ్‌ వారికి  నోటీసులు జారీ చేశారు. వారికి వారే స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకోవాలని లేదంటే కూల్చివేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చూడండి: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్‌..ఒక్క క్లిక్ చాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు