BAN VS USA: పసికూన పై మళ్లీ పరాజయం..చరిత్ర సృష్టించిన అమెరికా! ఆ జట్టు చిన్నస్థాయి నుంచి పెద్ద జట్లకు ఓటమిను చవిచూపించే స్థాయికి ఎదిగింది.కానీ అది ఒక్కప్పటి మాట ఇప్పుడు అదే జట్టు ఒక పసికూన చేతిలో ఓటమి పాలై..సిరీస్ ను పొగొట్టుకుని బిక్కుబిక్కుమంటూ చూస్తుంది.అసలు ఆ జట్టు ఏంటో దాని విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. By Durga Rao 24 May 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి USA vs Bangladesh: 2007 వరల్డ్ కప్ లో ఇండియా ను ఓడించి చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ జట్టు..అప్పటి నుంచి స్టార్ టీంలో ఒకటిగా ఉంటూ వస్తుంది.అప్పటినుంచి ఆ జట్టు ప్రత్యర్థి టీం లకు వణుకుపుట్టిస్తూ స్వదేశాలలోనే కాకుండా విదేశాలలో కూడా గెలిచి చూపిస్తూ వస్తుంది.అయితే అదంతా కొన్నాళ్ల క్రితం మాట..ఇప్పుడు విధి వక్రికరించినట్టు..ఆజట్టు ఎలా అయితే పైకి లేచిందో..అలానే అమెరికా (USA) లాంటి పసికూన జట్టు కూడా బంగ్లాపై సిరీస్ గెలిచి పాత రోజులని గుర్తు చేసింది. అంతర్జాతీయ టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను (Bangladesh) ఓడించి అమెరికా చరిత్ర సృష్టించింది. రెండో టీ20లో బంగ్లాదేశ్‌పై ఆతిథ్య అమెరికా చివరి ఓవర్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అమెరికా 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. రాబోయే T20 ప్రపంచ కప్‌కు ముందు ఆతిధ్యమిస్తున్న అమెరికా T20 సిరీస్ గెలవటం నిజంగా అభినందించాల్సిన విషయమే. టీ20లో అమెరికాకు ఇదే తొలి సిరీస్ విజయం. అంతకు ముందు సిరీస్‌లోని తొలి వన్డేలో కూడా అమెరికా విజయం సాధించింది. అమెరికా సాధించిన ఈ విజయంలో బౌలర్ అలీఖాన్, కెప్టెన్ మోనాంక్ పటేల్ కీలక పాత్ర పోషించారు. అమెరికా నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన బంగ్లాదేశ్ (USA vs BAN) 19.3 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ తరఫున కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (36), షకీబ్ అల్ హసన్ (30), తౌహిద్ హడోయ్ (25) జట్టును గెలిపించేందుకు విశ్వప్రయత్నాలు చేసిన వారు రాణించలేకపోయారు. అమెరికా తరఫున అలీఖాన్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. సౌరభ్ నేత్రవాల్కర్, షాడ్లీ వాన్ షైలక్ చెరో రెండు వికెట్లు తీశారు. చివరి ఓవర్లో బంగ్లాదేశ్ విజయానికి 12 పరుగులు కావాలి. అలీ ఖాన్ అమెరికా బౌలింగ్ ఎండ్‌లో ఉన్నాడు. బంగ్లాదేశ్ 19 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులు చేసింది. మ్యాచ్ చివరి ఓవర్ తొలి బంతికే ముస్తాఫిజుర్ రెహమాన్ పరుగు తీసి పరుగు తీశాడు. రెండో బంతికి రిషద్ హుస్సేన్ ఫోర్ కొట్టాడు. మూడో బంతికి రిషాద్‌కి క్యాచ్ ఇచ్చి అలీఖాన్ బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. ఈ విధంగా బంగ్లాదేశ్‌ను అమెరికా వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. Also Read: రజనీకాంత్‌కు అరుదైన గౌరవం.. UAE గోల్డెన్ వీసా దక్కించుకున్న సూపర్ స్టార్ #bangladesh #cricket-news #shakib-al-hasan #united-states-of-america మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి