Horlicks: బోర్నవీటా దారిలోనే హార్లిక్స్.. ఇకపై హెల్త్ డ్రింక్ కాదు

చిన్నపిల్లలకు ఇప్పటివరకు ఇస్తున్న హెల్త్ డ్రింక్స్ అన్నిటికీ ఇక మీదట హెల్త్ లేబుల్స్ తొలంగించాలని ఆదేశించింది కేంద్రం. ఇంతకు ముందు బోర్నవీటా...ఇప్పుడు హార్లిక్స్ లను ఈ జాబితాలో చేర్చింది.

New Update
Horlicks: బోర్నవీటా దారిలోనే హార్లిక్స్.. ఇకపై హెల్త్ డ్రింక్ కాదు

Health Drinks: మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగించకండి అని చెబతోంది కేంద్రం. అవి హెల్త్ డ్రింక్స్ కాదని తెలిపింది. వాటిని ఫంక్షన్ న్యూట్రిషియన్ డ్రింక్స్‌గా మారుస్తున్నామని చెప్పింది. కొన్ని రోజుల క్రితమే బోర్నవీటాను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగిస్తున్నామని కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్‌లో హార్లిక్స్‌ను కూడా చేర్చింది. హిందూస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్ ప్రాడెక్ట్స్ అయిన హార్లిక్స్, బూస్ట్‌లను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తీసేసింది.

బూస్ట్, బోర్నవీటా, హార్లిక్స్...పిల్లలకు ఇషంగా తాగే చాక్లెట్ పానీయాలు. ఇవి తాగితే బోలెడంత శక్తి వస్తుంది అంటూ ప్రచారం చేస్తారు. పిల్లల్లో ఎదుగుదలకు బోర్నవీటా తోడ్పడుతుంది. దీనిలో రకరకాల విటమిన్లు ఉన్నాయని యాడ్స్‌లో చెబుతారు. దీన్ని నమ్మి చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు బోర్నీటాను అలవాటు కూడా చేశారు. అయితే ఇది శరీరానికి ఏమీ హానీ చేయకపోయినా...హెల్త్ డ్రింక్ మాత్రం కాదని అంటోంది కేంద్రం. బోర్నవీటాను హెల్త్ డ్రింక్ లిస్ట్‌లో నుంచి తీసేశాయలని వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.అన్ని ఈ-కామర్స్ సంస్థలకు తమ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్స్ నుంచి తొలగించాలని సూచించింది.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ యాక్ట్ ప్రకారం హెల్త్ డ్రింక్స్‌కు సరైన నిర్వచనం లేదు. అందుకే దీని కేటగిరీలో హార్లిక్స్ వంటి వాటిని చేర్చలేము. పైగా బోర్నవీటా, హార్లిక్స్ వటి వాటిలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు అస్సలు వాటిని హెల్త్ డ్రింక్స్‌గా పరిగణించలేము అని...అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలపింది కేంద్రం. ఫంక్షనల్ న్యూట్రీషియన్ డ్రింక్స్ కేటగిరి ప్రోటీన్స్, మైక్రో న్యూటిషీయంట్స్ అవసరాలను అందిస్తుంది. మొక్కలు, జంతువు, సముద్ర లేదా సూక్ష్మజీవుల మూలాల నుంచి ఏదైనా బయోయాక్టివ్ కాంపోనెంట్‌ని చేర్చడం ద్వారా అదనపు ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఏదైనా ఆల్కహాల్ లేదా డ్రింక్స్‌ని FNDగా నిర్వచించవచ్చు.

Also Read:Kenya: కెన్యాలో భారీ వర్షాలు..38 మంది మృతి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Khushdil Shah: చిర్రెత్తిపోయిన చిన్నోడు.. అభిమానులను కొట్టబోయిన పాక్ క్రికెటర్ - వీడియో చూశారా?

న్యూజిలాండ్‌తో 3వన్డేల సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్ 0-3 తేడాతో ఓడిపోయింది. ఫైనల్ మ్యాచ్ తర్వాత పాక్ క్రికెటర్ ఖుష్దిల్ షా ప్రేక్షకులను కొట్టడానికి దూసుకెళ్లాడు. ఆఫ్ఘన్ అభిమానులు పాక్ క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించడంతో అతడు అలా చేసినట్లు తెలుస్తోంది.

New Update
Pakistan Cricketer Khushdil Shah Attacks Fans During NZ ODI

Pakistan Cricketer Khushdil Shah Attacks Fans During NZ ODI

పాకిస్థాన్ క్రికెటర్ ఖుష్దిల్ షా వార్తల్లో నిలిచాడు. అతడు తన అనుచిత ప్రవర్తన ద్వారా విమర్శలకు గురయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం ఖుష్దిల్ షా ప్రేక్షకులను కొట్టడానికి వెళ్లడంతో హాట్ టాపిక్‌గా మారాడు. ఇంతకీ ఏం జరిగింది?.. ఎందుకు ప్రేక్షకులను కొట్టడానికి వెళ్లాడు? అనే విషయానికొస్తే.. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

న్యూజిలాండ్ vs పాకిస్థాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌‌లో భాగంగా న్యూజిలాండ్ చేతిలో పాకిస్థాన్ 0-3 తేడాతో ఘోరంగా ఓటమిపాలైంది. మొదటిగా రెండు వన్డేలు ఓడిపోయిన పాకిస్థాన్ శనివారం (ఏప్రిల్ 5) జరిగిన మూడో వన్డేలో సైతం కుప్పకూలిపోయింది. ఈ చివరి మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్‌పై పాక్ 43 పరుగుల తేడాతో ఘోరంగా ఓటమిపాలైంది. దీంతో పాక్ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. 

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

దానికి తోడు ఇటీవలే టీ20 సిరీస్‌ను సైతం పాకిస్థాన్ కోల్పోయింది. 1-4 తేడాతో ఓటమిపాలైంది. అప్పటికే తీవ్ర నిరాశలో ఉన్న పాకిస్థాన్‌కు ఇప్పుడు మరో షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ కావడంతో పాక్ క్రికెటర్లు ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఇదే క్రమంలో న్యూజిలాండ్‌తో మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ ఆల్‌రౌండర్ క్రికెటర్ ఖుష్దిల్ షా అనుచిత ప్రవర్తన వైరల్‌గా మారింది. 

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

ప్రేక్షకులపై దాడికి యత్నం

ఈ మ్యాచ్ జరిగిన తర్వాత ఖుష్దిల్ షా క్రికెట్ అభిమానుల మీదకు దూసుకెళ్లాడు. అందుకు ఓ కారణం ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ తర్వాత కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ప్రియులు పాక్ క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించినట్లు తెలిసింది. దానిని ఆపమని ఖుష్దిల్ షా వారిని కోరినా.. వారు దుర్భాషలాడుతూనే ఉండటంతో అతడు ప్రేక్షకులను కొట్టడానికి వెళ్లినట్లు సమాచారం. అప్పటికే సిరీస్ టీ20 సిరీస్‌ను కోల్పోయిన పాక్.. ఇప్పుడు వన్డే సిరీస్‌ క్లీన్ స్వీప్ కావడంతో విలవిల్లాడిపోయిందని అందుకే ఖుష్దిల్ క్రూరంగా ప్రవర్తించాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

పీసీబీ స్పందన 

దీనిపై పీసీబీ స్పందించింది. ‘‘జాతీయ ఆటగాళ్లను ఉద్దేశించి విదేశీ ప్రేక్షకులు దుర్భాషలాడడాన్ని పాకిస్తాన్ క్రికెట్ జట్టు యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఈరోజు మ్యాచ్ జరుగుతున్న సమయంలో, మైదానంలో ఉన్న క్రికెటర్లపై విదేశీ ప్రేక్షకులు అనుచిత వ్యాఖ్యలు చేశారు" అని పిసిబి తెలిపింది. 

(latest-telugu-news | telugu-news | pcb | Khushdil Shah | NZ vs Pak)

Advertisment
Advertisment
Advertisment